E-Paper
Advertisement

Love Crime: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. తండ్రి కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య!

Love Crime: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. తండ్రి కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య!
Advertisement

Love Crime: ఆమె వద్దన్నది.. అతడు చావు చూపించాడు. అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్‌ యువతి ప్రాణాలు తీశాడు. ఇంటి గేటు ముందు మాటువేసి.. తండ్రి ఎదుటే కత్తితో దాడి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన.. ప్రేమోన్మాదం ఎంత క్రూరమైనదో మరోసారి చాటి చెప్పింది.

ఆటో డ్రైవర్ శ్యాంబాబుతో..

ఆమె ప్రేమనుకుంది.. సన్నిహితంగా మెలిగింది.. మోసగాడని అర్థమై దూరం పెట్టింది. తాడేరు గ్రామానికి చెందిన 32 ఏళ్ల అనంతవాణి.. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌. పెళ్లి కాలేదు. కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్యాంబాబుతో ఐదేళ్లుగా పరిచయం ఉంది. శ్యాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. ఆర్థికంగానూ అనంతవాణి అతడికి అండగా నిలిచింది. అన్నీ తానై చూసుకునేది.

Advertisement

Also read: Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!

ఒంటి గంట సమయంలో..

కానీ, ఆరు నెలల క్రితం నుంచి కథ మారిపోయింది. శ్యాంబాబును అనంతవాణి పూర్తిగా దూరం పెట్టింది. అదే అతడికి కక్షగా మారింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అనంతవాణి ఇంటికి వెళ్లి శ్యాంబాబు పెద్ద పెద్ద కేకలు వేశాడు. తండ్రితో కలిసి ఆమె బయటకు వచ్చింది. ఒక్కసారిగా తండ్రిని పక్కకు నెట్టేసి.. వెంట తెచ్చుకున్న కత్తితో అనంతవాణిపై దాడికి దిగాడు. పొత్తికడుపులో తీవ్రంగా పొడిచి.. అక్కడి నుంచి పరారయ్యాడు.

ఒక తప్పుడు నిర్ణయం..

Advertisement

రక్తం దారలా కారుతుండగానే కుటుంబ సభ్యులు భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయింది. తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయగా.. దుండగుడి కోసం సెర్చ్ చేస్తున్నారు. ఒక తప్పుడు నిర్ణయం.. ఒక కక్ష.. చివరికి ఓ యువతి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది.

Also read: Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!

Related News

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

Big Stories

Advertisement
×