BigTV English

Mahesh Babu: ‘మురారి’కి 22 ఏళ్లు.. సినిమాలో అనేక విశేషాలు..

Mahesh Babu: ‘మురారి’కి 22 ఏళ్లు.. సినిమాలో అనేక విశేషాలు..

Mahesh babu: హీరో మహేశ్ బాబుకు కోట్లలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే.. టకటకా ఓ 10-15 సినిమాల పేర్లు చెప్పేస్తారు. ఎవరు చెప్పినా.. ఏయే సినిమాల పేర్లు చెప్పినా.. అందులో టాప్ 5 మూవీస్ లో ఉండే సినిమా ‘మురారి’.


మురారి. మహేశ్ బాబు కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాల్లో ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్ కి మహేశ్ అనగానే.. మొదట మురారి సినిమానే గుర్తుకొస్తుంది. అన్ని వర్గాలకు అంతలా కనెక్ట్ అయిందా సినిమా. ముగ్థమనోహర రూపంలో కనిపిస్తాడు మహేశ్ బాబు ఆ చిత్రంలో. మురారి టైటిల్ కు చక్కగా ఒదిగిపోతాడు. హీరోగా సంభాషణలు బాగా ఆకట్టుకుంటాయి. మహేశ్ కామెడీ టైమింగ్ ను తొలిసారి రుచి చూపించిన మూవీ ఇది. మణిశర్మ సంగీతం, పాటలు ఇప్పటికీ మారుమోగిపోతుంటాయి. మహేశ్ కు సరిజోడిగా సరిపోయింది సోనాలి బింద్రే. కైకాల సత్యనారాయణకు అమాయకుడైన తండ్రి గెటప్ ఇవ్వడం ఓ ఎక్స్ పరిమెంటే. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన మురారి.. ప్రస్తుతం 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.

మురారి స్టోరీ లైన్ అప్పట్లో ఓ సెన్సేషనల్. చాలా కొత్త పాయింట్ ఎంచుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. సినిమాలో రవిబాబు కామెడీ విలన్ కే పరిమితం. మెయిన్ విలన్..కాలం. దేవుడు, శాపం, తరాలు, వారసులు, చావులు.. ఇలా ఆధ్యాత్మికతకు మెడ్రన్ టచ్ ఇచ్చి తీశారీ సినిమాను. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మురారీ. మహేశ్ బాబు ఇమేజ్ అమాంతం పెరిగింది.


మురారి సినిమా కథ, టైటిల్ పై పలు ఇంటర్వ్యూల్లో డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ చనిపోవడం.. ఆ ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడినట్టు అనిపించడం.. ఆ లైన్ ను బేస్ గా చేసుకొని.. మురారిలో వరుసగా వారసులను శాపం చంపేయడంలా కథను అల్లుకున్నారట కృష్ణవంశీ. మహేశ్ బాబుకు మేకప్ వేశాక.. ఆయన్ను చూడగానే బృందావనం గుర్తుకొచ్చిందని.. అందుకే సినిమాకు ‘మురారి’ అని పేరు పెట్టినట్టు కృష్ణవంశీ చెప్పారు.

‘మురారి’ మ్యూజికల్‌గానూ సూపర్ హిట్‌. మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ‘అలనాటి రామచంద్రుడి..’ పెళ్లి సాంగ్.. ఇప్పటికీ ట్రెండింగే. రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆ సాంగ్ కి తిరుగేలేదు. సాంగ్ మేకింగ్ సైతం చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. మొత్తం పూల సెటప్ తో.. అచ్చ తెలుగించి పెళ్లి వేడుకను కలర్ ఫుల్ ఫ్రేమ్ లో ఫిట్ చేశారు కృష్ణవంశీ.

మహేశ్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ లు ఉన్నా.. అందులో ‘మురారి’ మురారీనే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×