E-Paper
Advertisement

త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?

త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?
Advertisement

అన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే నాకివ్వ‌రా? అన్న‌ద‌మ్ములం క‌రెక్టే.. కానీ ఎవ‌రి రాజ‌కీయాలు వారివే..! ఓ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అధిష్టానంపై నిల‌దీత‌.

బండి సంజ‌య్ కొడుకుపై పోక్సో కేసు అని ఎందుకంటున్నారు? బండి భ‌గీర‌థ్ అని అత‌ని పేరు తీసుకోండి.. మ‌రోసారి నా పేరును ఈ అంశంలో ప్ర‌స్తావిస్తే ఖ‌బ‌డ్దార్‌… ఓ కేంద్ర మంత్రి ఫైర్‌!

Advertisement

నా కొడుకు ఏ పార్టీలో ఉండాలో అత‌నే డిసైడ్ చేసుకుంటాడు.. నేను చెబితే వింటాడా..? ఎవ‌రి విజ్ఞ‌త వారికే.. అర్వింద్ ఇష్ట ప్ర‌కార‌మే బీజేపీలో చేరాడు.. నేనెలా బాధ్యుడ‌వుతా? – కేసీఆర్‌తో వాదించిన దివంగ‌త నేత డీఎస్ ..

నా కూతురు రాజ‌కీయ కామెంట్స్‌తో నాకేం ప‌ని.. ఆమె పొట్టు పొట్టు తిడితే నాదా బాధ్య‌తా? నో నెవ్వ‌ర్‌.. నోటీస్ వాప‌స్ తీసుకోండి..! మంత్రి కొండా సురేఖ ఉల్టా కామెంట్‌..

Advertisement

రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎలాగైనా నాలుక మ‌డ‌త‌పెట్టేయ‌డం ఈ రాజ‌కీయాల‌కే చెల్లుతుంది అనేలా ఉంటున్నాయి ప‌రిణామాలు. సీట్ల‌ప్పుడు ఫ్యామిలీ, టికెట్లు కావాల‌న్న‌ప్పుడు అన్న‌చెల్లె, అక్కా త‌మ్ముడు, అన్నాద‌మ్ముల బంధాలు, ప‌ద‌వుల పంప‌కాల‌ప్పుడు కూడా ఫ్యామిలీ ప్యాకేజీ పై పోటీలు ప‌డి వాటాలు.

కానీ ప‌రిస్థితి రివ‌ర్స్ అయితే.. అనుకున్న‌ది జ‌ర‌గ‌క‌పోతే.. ఇలా వీటిని రివ‌ర్స్ చేసి కూడా మాట్లాడొచ్చు.ఎలా ప‌డితే అలా మార్చుకునేలా రాజ‌కీయ రాజ్యాంగంలో లిఖించ‌బ‌డ‌ని ఓ సౌఖ్యం నాయ‌కుల‌కు ప్ర‌త్యేకంగా క‌ల్పించ‌బ‌డింది కాబోలు. పార్టీ మారినా.. లేదు వాళ్లు పార్టీ మారిన‌ట్టు మాకు ఎలాంటి ఆన‌వాళ్లు, ఆధారాలు దొర‌క‌లేదు.. అని ఏకంగా స్పీక‌రే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై తీర్పులు ఇచ్చేస్తూ ఉంటే.. జ‌నాలు వాటిని విని త‌రించి.. ఆహా ఏమీ రాజ‌కీయాల‌ని కీర్తిస్తూ ఉంటే.. కొండా సురేఖ లాంటి నేత‌ల వ‌ద్ద నుంచి ఇలాంటి వివ‌ర‌ణ కాక‌పోతే హుందాత‌నంగా, బాద్య‌త‌గా, జ‌వాబుదారీగా, ప‌శ్చాత్తాపంగా, ప‌రివ‌ర్త‌న‌గా వ‌స్తుంద‌నుకోవ‌డం మీ త‌ప్పు.

ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు ఆమే క‌రెక్టు. మంత్రిగా కూడా ఆమే బెట‌ర్‌. అందుకే కొండాకు పంపిన నోటీసును వాప‌స్ తీసుకుని, అధిష్టాన‌మే తిరిగి వివ‌ర‌ణ ఇస్తూ.. సారీ చెప్పాల‌నే డిమాండ్ చేయాల‌నేది నా వాద‌న‌.

పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా? అంటుంటారు కామ‌న్‌గా. రాజ‌కీయాల‌కూ ఇది వ‌ర్తిస్తుంది. పిల్ల‌ల‌ను క‌న్నాం.. కానీ వారి ప్ర‌వ‌ర్త‌న‌ను, వారి వ్య‌వ‌హారాన్ని క‌న్నామా? వారి మాట‌లు ఇలా ఉండాల‌ని మేం చెప్పామా? అది వారి వ్య‌క్తిగ‌తం. వారి విజ్ఞ‌త‌. కాక‌పోతే.. వారూ ఓ ప‌దవిలో ఉండాల‌ని క‌న్న‌పేగు త‌పిస్తుంది కాబ‌ట్టి.. రేపు ఎమ్మెల్యేగా చూడాల‌ని త‌ల్లి మ‌న‌సు త‌ల్ల‌డిల్లుతుంది కాబ‌ట్టి.. టికెట్ ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా.. ఇండిపెండెంట్‌గా నిల‌బ‌డ్డా.. క‌న్న త‌ల్లిదండ్రులుగా ఆమెకు పూర్తి మ‌ద్ద‌తు, స‌హ‌కారం, అండ‌దండ‌లు ఉంటాయి.. ఈ విష‌యంలో కూడా మీరు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని, క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీపై నాకు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌నే విష‌యాన్ని మ‌రోసారి వెల్ల‌డిస్తూ సెల‌వు.

జై బీసీ, జై తెలంగాణ‌. జై రాహుల్‌, జై సోనియా…!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×