BigTV English

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అబద్ధాల వరద.. పాక్ బుద్ధి ఎప్పటికీ మారదా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అబద్ధాల వరద.. పాక్ బుద్ధి ఎప్పటికీ మారదా?

Operation Sindoor: ఎప్పుడూ నిజం చెప్పని దేశం. ప్రతిసారీ వాస్తవాలను దాచే ప్రభుత్వం. తమవైపు భారీ నష్టం జరిగినా.. పైకి ఏమీ జరగనట్లుగా వ్యవహరించే వ్యవస్థ. ఇవన్నీ కలిసిన ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. అబద్ధాలు చెప్పడం, వాటిని వాయు వేగంతో ప్రచారం చేయడం.. శత్రుదేశానికి కొత్తేమీ కాదు. అసలు.. పాక్ అంటేనే ఫేక్. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. భారత దళాలు చేసిన దాడులపై.. పాకిస్తాన్ నుంచి ఫేక్ ప్రచారాలు వరదలా వచ్చాయ్. కానీ.. మిసైల్ స్ట్రైక్స్‌తో చెలరేగిన నిప్పులాంటి నిజమేంటో.. ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్‌కు ఇంకా బాగా తెలుసు.


ఇండియాలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం

పాకిస్తాన్ అంటేనే అంత! ఇండియా అంటే.. కుళ్లు, కుతంత్రం, దుష్ట పన్నాగాలు, నికృష్ట కుట్రలు. భారత్ పేరు వింటేనే కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది శత్రుదేశం. అందుకే.. ఉగ్రవాదుల్ని ఎగదోసి.. ఇండియాలో అశాంతి రేపేందుకు, అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ.. పాక్ ఇలా ఆలోచించిన ప్రతిసారీ.. ఆ దేశానికి పగిలిపోతోంది. ప్రతిసారీ.. ఇండియా నుంచి రివేంజ్ మామూలుగా ఉండట్లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. సూపర్ సక్సెస్ అయింది. భారత్ మిసైల్ దాడులకు.. పాక్‌లోని ఉగ్రస్థావరాలు కూలిపోయాయ్. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సక్సెస్ అవడంతో.. దానిని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ నుంచి తప్పుడు సమాచారం వరదలా వస్తోంది. పాక్ మీడియాతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థల నుంచి దుష్ప్రచారం మొదలైంది. పాకిస్తాన్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లోనూ పాక్ సర్కార్ ఫేక్ ప్రచారాలు చేయిస్తోంది.


పాక్ ప్రభుత్వ ఛానెల్‌లు, సోషల్ ఖాతాల్లో ఫేక్ ప్రచారం

ఆపరేషన్ సిందూర్ పూర్తయిన కొన్ని గంటల్లోనే.. అనేక పాకిస్తాన్ ప్రభుత్వ సంబంధిత మీడియా ఛానెల్‌లు, సోషల్ మీడియా ఖాతాల్లో.. తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చశాయ్. వీటిలో చాలా వరకు.. సొంత విశ్లేషణలు చేసేవాళ్లు, వాళ్లకు వాళ్లే ఏదో జరిగిందని ఊహించుకునే వాళ్లు, వాళ్లకు తోచింది చెప్పే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలోని 15 ప్రదేశాలపై పాకిస్తాన్ కూడా మిసైల్ ఎటాక్స్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే.. శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ని.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేసిందని, ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ కూడా ధ్వంసమయ్యాయని తప్పుగా ప్రచారం చేశారు. ఇవన్నీ.. ఎక్స్‌లో ఎక్కువగా కనిపించాయ్. ముఖ్యంగా.. పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్‌ ఖాతాలు ఫాలో అయ్యే వారి నుంచే.. ఈ తప్పుడు ప్రచారం ఎక్కువగా సాగింది. అయితే.. వీళ్లు చేసిన ప్రచారాన్ని రుజువు చేసేలా.. నమ్మదగిన దృశ్యాలు గానీ, శాటిలైట్ ఎవిడెన్స్ గానీ.. ఎక్కడూ చూపించలేదు.

శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ని టార్గెట్‌ చేశారని తప్పుడు ప్రచారం

పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్న మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్.. పాక్ ఎయిర్‌పోర్స్ శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ని టార్గెట్‌గా చేసుకున్నట్లు తప్పుగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని చెబుతూ షేర్ చేసిన వీడియో కూడా పాతది. పైగా.. అది ఇండియాకు సంబంధం లేని దృశ్యాలుగా చెబుతున్నారు. ఈ వీడియో గతేడాది పాకిస్తాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన మత ఘర్షణల నుంచి తీసుకున్నారు. కచ్చితమైన, నిజమైన సమాచారం కోసం భారత ప్రభుత్వ అధికారిక.. సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వాలని.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. పాకిస్తాన్‌కి మద్దతుగా షేర్ చేసిన అనేక ఫోటోలు, వీడియోలు.. తర్వాత సంబంధం లేని ఆర్కైవల్ ఫుటేజ్‌గా గుర్తించారు. కొన్నింటిని.. సంబంధం లేని ఘటనల నుంచి గుర్తించగా.. ఇంకొన్నింటిని డిజిటల్‌గా మార్చారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. అనేక పాకిస్తాన్ మెయిన్‌స్ట్రీమ్ చానళ్లు ఈ పోస్టులను ప్రసారం చేశాయ్.

తప్పుడు సమాచారం వ్యాప్తికి వేదికలుగా సోషల్ ప్లాట్‌ఫామ్స్

భారత చేపట్టిన దాడులపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్.. ఈ తప్పుడు సమాచారం వ్యాప్తికి ప్రధాన వేదికలుగా మారాయ్. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఇంకొన్ని గ్రూపులు.. ఆపరేషన్ సిందూర్‌ని భారత్ దురాక్రమణగా చిత్రీకరిస్తూ.. తప్పుడు కథనాలను వైరల్ చేశాయ్. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా చేపట్టిన ఈ ఆపరేషన్‌ని.. ఓ కుట్రగా చిత్రీకరించాయ్. ఈ తప్పుడు ప్రచారాలతో.. పాకిస్తాన్‌ని అస్థిరపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు గుప్పించాయ్. అంతేకాదు.. భారత దళాలు చేపట్టిన చర్యల్ని తప్పుగా వక్రీకరిస్తూ.. ఫేక్ వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పాక్ ఉద్దేశపూర్వకంగా చేపట్టిన తప్పుడు ప్రచారాన్ని.. భారత అధికారులు ఖండించారు.

కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఆపరేషన్ సిందూర్

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా.. భారత్ తన జాతీయ భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందులో ఎలాంటి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరగలేదని క్లారిటీ ఇచ్చారు. పాక్ నుంచి వెల్లువెత్తుతున్న ఫేక్ ప్రచారాన్ని.. ఫ్యాక్ట్ చెక్ పేరుతో భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయ్. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఖాతాలను గుర్తించి.. వెంటనే వాటిని బ్లాక్ చేయడం, సస్పెండ్ చేయడం చేస్తున్నారు. అదేవిధంగా.. ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు వాస్తవాలను తెలియజేసేందుకు.. అధికారికంగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు భారత అధికారులు.

ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తోంది?

పాకిస్తాన్‌పై దాడి చేయడం భారత్‌కు కొత్త కాదు. వాటిపై.. తప్పుడు ప్రచారం చేసుకోవడం ఆ దేశానికి కూడా కొత్తేమీ కాదు. ఎప్పుడు కౌంటర్ ఎటాక్ జరిగినా.. పాక్ నుంచి కామన్‌గా ఇదే వినిపిస్తుంటుంది. గతంలో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్‌‌ది ఇదే తీరు. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాక్‌ది ఇదే కథ. ఇప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తోంది? ఎప్పుడు దాడి జరిగినా సోషల్ మీడియాలో వేగంగా ఫేక్ ప్రచారాన్ని ఎలా సృష్టిస్తోంది?

అబద్ధపు ప్రచారాల్లో పాకిస్తాన్ ఓ బ్రాండ్

తప్పుడు ప్రచారాన్ని సృష్టించాలన్నా.. దాన్ని క్షణాల్లో వైరల్ చేయాలన్నా.. వాస్తవాల నుంచి ప్రజల అటెన్షన్‌ని మళ్లించాలన్నా.. పాక్‌ ముందుంటుంది. అప్పుడు అదే చేసింది. ఇప్పుడూ అదే దారిని ఎంచుకుంది. ఇక ముందుకూడా.. ఇలాగే చేస్తుంది. ఇందులో.. నో డౌట్. ఒక్కమాటలో చెప్పాలంటే అబద్ధపు ప్రచారాలు చేయడంలో పాకిస్తాన్ ఓ బ్రాండ్ అని చెప్పాలి. ఇండియా ఎప్పుడు కోలుకోలేని దెబ్బకొట్టినా.. అబ్బే.. అలాంటిదేమీ లేదు. మాపై దాడి జరగలేదని సింపుల్‌గా చెబుతుంది. పైగా.. తామే భారత్ దాడుల్ని తిప్పికొట్టామని.. వెంటనే తప్పుడు ప్రచారం మొదలుపెడుతుంది. ఇది.. కొన్నేళ్లుగా పాక్‌కు బాగా అలవాటైన వ్యవహారం.

రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లుగా ట్వీట్లు

ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌పైనా అవే తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు వైరల్ చేస్తూ.. వాస్తవాలను దాస్తోంది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లో దాడులు చేసేందుకు భారత్ మిరాజ్, సుఖోయ్ యుద్ధ విమానాలను వాడినట్లు ప్రకటించింది. కానీ.. పాకిస్తాన్‌కు చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం.. పాక్ ఎయిర్‌ఫోర్స్ ఇండియాకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసిందని ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. కొన్ని ఫేక్ వీడియోలను కూడా పోస్ట్ చేశారు. కానీ.. కొన్ని గంటల్లోనే అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. పాక్ పరువు పోయింది.

బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత్ దాడి

గతంలో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా పాక్‌ ఇలాగే వ్యవహరించింది. పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమాయ్యారు. కానీ.. పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. పైగా.. వెంటనే తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ.. భారత్ దాడి చేసిన ప్రాంతాన్ని.. జనవాసం లేని కొండప్రాంతంగా చిత్రీకరించింది. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్.. ఖాళీ ప్రాంతంలో బాంబులు వేసి వెళ్లిపోయాయని వాదించింది. సంబంధం లేని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అంతేకాదు.. బాలాకోట్ దాడి తర్వాత పాక్ మీడియా సంస్థలు కూడా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయ్.

మిస్ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో భాగంగా ఫేక్ కంటెంట్ వైరల్

పాక్ ఎయిర్‌ఫోర్స్ రెండు భారత యుద్ధ విమానాలను కూల్చిందని.. 2016లో జరిగిన విమాన ప్రమాద ఫోటోలను వ్యాప్తి చేశారు. ఈ ఫేక్ కంటెంట్‌ని.. మిస్ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో భాగంగా వైరల్ చేశారు. పాక్‌కు అనుకూలంగా కొన్ని హ్యాష్ ట్యాగ్‌లు ఉపయోగించి.. భారత్ దాడి ఫెయిలైనట్లుగా చిత్రీకరిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేశారు. అదే సమయంలో.. పీఏఎఫ్ భారత సైనిక స్థావరాలపై దాడి చేసిందని.. మరో రెండు భారత యుద్ధ విమానాలను కూల్చిందని తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారు. పాక్ మీడియా కూడా.. బాలాకోట్‌లో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది. భారత్ దాడిని అంతర్జాతీయ సరిహద్దు ఉల్లంఘనగా చిత్రీకరించి.. యుద్ధ చర్యగా ప్రచారం చేసింది పాకిస్తాన్. అంతేకాదు.. ఆ దేశానికి అనుకూలంగా ఉన్న రిపోర్టులను కూడా పాకిస్తాన్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసింది.

2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ సర్జికల్ స్టైక్స్

2016లో ఉరి ఎటాక్‌కు ప్రతీకారంగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై.. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ స్ట్రైక్స్‌లో భారత కమాండోలు.. ఎల్వోసీ దాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిని కూడా పాకిస్తాన్ పూర్తిగా తిరస్కరించింది. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని ప్రకటించింది. భారత సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అదంతా కేవలం కల్పిత కథ అని తెలిపింది. పాక్ అధికారులు ఈ దాడిని ఎల్వోసీ వెంబడి తరచుగా జరిగే కాల్పుల విరమణ ఉల్లంఘనగా చిత్రీకరించారు.

భారత సైనికులు ఎల్వోసీ దాటినట్లు ఆధారాలు లేవన్న పాక్

ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కాలేదని రుజువు చేసేందుకు పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. దాడి జరిగిన ప్రాంతాలు బాగానే ఉన్నాయని చూపించేందుకు.. పాత ఫోటోలను వాడారు. సర్జికల్ స్ట్రైక్స్‌లో.. భారత సైనికులు ఎల్వోసీ దాటినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పాకిస్తాన్ సైన్యం వాదించింది. ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌ని కేవలం ఓ పీఆర్ స్టంట్‌గా వర్ణించారు. పాకిస్తాన్ అధికారులు ఈ చర్యలను.. అంతర్జాతీయ సరిహద్దు ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నించారు. కానీ.. స్ట్రైక్స్ పీవోకేలో జరగడం వల్ల.. అవి ఎల్వోసీ వెంబడి జరిగిన దాడిగానే చూశారు.

Also read: పదేళ్లలో 3 సార్లు.. తోలు తీసి ఆరేసిన భారత్.. బుద్ధి తెచ్చుకోని పాక్!

ఆపరేషన్ సింధూర్‌ని తప్పుగా చిత్రీకరిస్తూ పోస్టులు షేరింగ్

పాకిస్తాన్‌కు చెందిన కొన్ని గ్రూపులు, ట్రోల్ అకౌంట్లు, హ్యాష్ ట్యాగ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నాయ్. ఇప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్‌ని తప్పుగా చిత్రీకరిస్తూ.. పోస్టులు షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని సాధారణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు.. ఈ ఆపరేషన్‌ని పాక్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ కథనాలు సృష్టిస్తున్నారు. భారత్.. పాకిస్తాన్‌ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ.. జాతీయవాద భావనలను రెచ్చగొడుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ని.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా చిత్రీకరిస్తూ.. దానిని అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా.. భారత ప్రజల్లోనూ గందరగోళం సృష్టించేందుకు సోషల్ మీడియాలో ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

సరైనా సమాచారం వచ్చే లూపే తప్పుడు కథనాలు వైరల్

పాక్ లోని కొన్ని మీడియా సంస్థలు కూడా.. ఈ తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు.. సోషల్ మీడియా కథనాలను ఆధారంగా చేసుకొని.. వార్తల్ని ప్రసారం చేస్తున్నాయ్. ఇవి.. సోషల్ మీడియా పోస్టులు నిజమేనని నమ్మేలా ఉంటున్నాయ్. దాంతో.. ఫేక్ ప్రచారం మరింత వైరల్ అవుతోంది. దాంతో.. సరైన సమాచారం వచ్చే లోపే.. తప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయ్. అయితే.. భారత మీడియా సంస్థలు ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ.. పాక్ బుద్ధిని ప్రజల ముందుంచుతున్నాయ్. ఆపరేషన్ సిందూర్ వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నాయ్. పాక్ నుంచి వైరల్ అవుతున్న పోస్టులు, కథనాలు.. ఇండియా విక్టరీని దెబ్బతీసేవిగా ఉన్నాయ్. ఫేక్ కంటెంట్, ట్రోల్ ఖాతాల ద్వారా ఈ తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయినప్పటికీ.. ఎప్పటికప్పుడు ఫాక్ ఫేక్ ప్రచారాలను.. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు తిప్పికొడుతూనే ఉన్నాయ్.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×