Gundeninda GudiGantalu Today episode May 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. చేతికి నొప్పిగా ఉంది అని బైక్ మీద నుంచి పడ్డాను అని శివ అబద్ధం చెప్తాడు.. వాడికి ఏదో అయింది అని చెప్పేసి పార్వతి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. మీనాకు ఫోన్ చేసి రమ్మని చెప్తే మీనా తమ్ముడికి ఏమైనా తెలుసుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని బాలుకు చెప్తే బాలు మాత్రం నాకేం తెలీదు అన్నట్లు లైట్ తీసుకుంటాడు. ఇక మీనా శివను చూసి ఇంటికి వెళుతుంది. ఇంట్లోకి రాదు అనే సత్యం ఏమైంది మీ తమ్ముడికి అని అడుగుతాడు. బైక్ మీద నుంచి కింద పడ్డాడు అంట మావయ్య చేయి చాలా నొప్పిగా ఉందని బాధపడుతున్నాడు అని అంటుంది మీనా. డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకెళ్లి ఇవ్వమ్మా అనేసి అంటాడు. బాలు మీనా పిలిచిన హాస్పిటల్ కి వెళ్ళడు. ఏమైంది ఏంటి అని అందరూ అడుగుతారు. కానీ బాలు మాత్రం ఏదో కోపంగా ఉన్నట్లు అందరూ అర్థం చేసుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా శివకిలా అయిందని బాధపడుతూ ఉంటుంది. బాలు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేదని సత్యం కూడా అడుగుతాడు. మీ సొంత బామ్మర్ది కి అలా సీరియస్ అయితే నువ్వు వెళ్లకుండా ఎలా ఉంటావు ట్రిప్పు ముఖ్యం కాదు ట్రిప్పు పక్కన పెట్టు ముందు వెళ్లి మీ బామ్మర్దిని చూసి పరామర్శించి మీ అత్తయ్యకు ధైర్యం చెప్పి ఆ తర్వాత నువ్వు ట్రిప్ పెట్టుకో అనేసి అంటాడు. ఇక బాలు ఏం మాట్లాడలేక సత్యం చెప్పినట్లు హాస్పిటల్ కి వెళ్తాడు. నిన్ను చూడటం నాకు ఇష్టం లేకపోయినా సరే మా నాన్న చెప్పాడని దగ్గరికి వచ్చాను. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది. ఆ గుణ గాడితో కలిసి నువ్వు ఇలాంటి దొంగతనాలు అవి ఇవి చేస్తే బాగోదు మీ అమ్మ చెల్లి నీ మీద ప్రాణాలను పెట్టుకున్నారు అది గుర్తుపెట్టుకో అనేసి బాలు వార్నింగ్ ఇస్తాడు. కానీ శివ మాత్రం బావ అని కూడా చూడకుండా అరుస్తాడు.. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
బాలు రాజేష్ దగ్గరికి వెళ్లి ఆ శివకి బెదిరించిన కూడా వీడియో చూపించిన కూడా భయపడకుండా నన్నే అంటున్నాడు వాడికి ఎంత ధైర్యం నన్ననే ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని బాధపడుతూ మందు తాగుతాడు. అటు పార్వతి తన కొడుకు ఏమీ కాకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఎక్స్రే రిపోర్టులను తెచ్చిస్తారు. ఏమైంది బాబు మరేం ప్రాబ్లం లేదు కదా అని పార్వతి అడుగుతుంది. అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అతని చెప్పి వెళ్ళిపోతాడు పార్వతి తన కొడుక్కి ఇలా అయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. వాడికి తగిలింది చిన్న దెబ్బేమి కాదు మీనా? ఆపరేషన్ చేయాలని అంటున్నారు 30,000 అర్జెంటుగా కట్టాలని అంటున్నారు అని పార్వతి అంటుంది. దానికి మీనా గాయం బలంగా తగలడం వల్ల ఎముక విరిగింది అని చెప్తున్నారు వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ అంటున్నారని మీనా తో చెప్తుంది సుమతి. నా దగ్గర ఇంటిదెంటు కానీ వాటికని వీటికని 12,000 ఉన్నాయి మిగిలిన డబ్బులు ఎలా అర్థం కావట్లేదని పార్వతి బాధపడుతుంది. ఇక మీనా నా దగ్గర పూలకు సంబంధించిన ఒక 6000 ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇస్తాను అంటుంది.
ఇక మిగతా 12000 కావాల్సి వచ్చింది ఒకసారి బావకి ఫోన్ చేసి అడుగు కానీ అంటుంది. మీనా ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లి మా పరిస్థితి ఇదండీ రెండు మూడు రోజుల్లో సద్దుతామని మీనా చెప్తుంది. డాక్టర్లు ఇన్స్టాల్మెంట్ పద్ధతి ద్వారా మీరు పే చేసుకుని ఆపరేషన్ కి డబ్బులు కట్టచ్చు అని చెప్తాడు. ఇక డాక్టరు మీనా కి నిజం చెప్పేస్తాడు అది బైక్ మీద నుంచి పడితే తగలలేదు ఎవరో బలంగా కొట్టారు అని చెప్తాడు.
అయితే శివకి ఆపరేషన్ ని పూర్తి చేస్తారు డాక్టర్లు. ఆ తర్వాత మీనా శివ దగ్గరికి వెళ్లి మీకు ఈ దెబ్బ ఎలా తగిలింది చెప్పు అని అడుగుతుంది. చెప్పాను కదా అక్క బైక్ మీద నుంచి కింద పడ్డాను అని అంటాడు శివ. కానీ మీనా నాకు డాక్టర్ అంత నిజం చెప్పాడు ఇప్పుడు నిజం చెప్పు ఏం జరిగిందో అని అడుగుతుంది. నేను గుణాల దగ్గర ఫైనాన్స్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అయితే బావ ఫ్రెండు రాజేషు అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అది అడగడానికి పోతే నన్ను కొట్టాడు అని అబద్ధం చెప్తాడు. బావా అప్పుడు తాగేస్తున్నాడు అందుకే నన్ను కొట్టాడు ఇంకేం మాట్లాడలేదు అని శివ అంటాడు.
శివా అన్న మాట విని మీనా షాక్ అవుతుంది. అసలేం జరిగింది చెప్పు అని అడుగుతుంది. ఇక పార్వతీ సుమతి బాలు చేసిన పనిని తలుచుకొని బాధపడతాడు. శివ పరీక్షలు రాయలేడు కదా అని పార్వతి ఏడుస్తుంది. ఇక మీనా బాలుని విషయం గురించి తెలుసుకోవాలని బయలుదేరుతుంది. మీనా రావడం చూసి రాజేష్ ఏమైందమ్మా ఇలా వచ్చావని అడుగుతాడు. శివని ఆయన ఎందుకు కొట్టాడు ఏం జరిగింది అంత పెద్ద గొడవ చెప్పు అని మీ నా రాజేష్ ని అడుగుతుంది. నువ్వు డబ్బులు తీసుకుంటే శివాని ఎందుకు కొట్టాడు ఆయన అని డౌట్ గా అడుగుతుంది. రాజేష్ నిజం చెప్పబోతుంటే బాలు లేచి వచ్చి రాజేష్ చెప్పనివ్వకుండా ఆపుతాడు.
వాడిని నేను కావాలని కొట్టలేదు. వాడు చేసిన పనికి నాకు కోపం వచ్చి అలా కొట్టాను వాడు కింద పడిపోతాడని నాకెలా తెలుసు చేయి విరగట్టుకుంటాడని నేను ఊహించనా ఏంటి అని బాలు మీ నాతో అంటాడు. చెయ్యి విరగొట్టే అంత తప్పు పడి ఏం చేసాడో చెప్పు అని మీనా అడిగిన బాలు నిజం చెప్పడు. ఇన్నాళ్లు మా నాన్న లేని లోటును మా వాళ్లకు మీరు తీరుస్తారు అనే నమ్మకం నాకుంది ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నేను తప్పు చేశాను కదా నన్ను కొట్టి చంపేసేయండి అని మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.