Intinti Ramayanam Today Episode May 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్య కోసం మా ఇంటికి వెళ్తుంది ఒక్కసారైనా తనని చూడాలని తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది. ఆరాధ్య తన తల్లిని చూడడానికి ఎవరు చూడకుండా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అమ్మ నీకోసం నేను వచ్చేస్తాను అని ఆరాధ్య అంటుంది. అసలు నాన్న ఎందుకు అమ్మ నువ్వు మంచి దానివి కాదని అంటున్నాడు. ఏం జరిగిందమ్మా చెప్పు అంటే నీది అర్థం చేసుకునే వయసు కాదు ఆరాధ్య అందుకే నీకేం చెప్పలేకపోతున్నాను. మరి నాన్న మంచివాడు కాదా అని అడుగుతుంది. నాన్న చాలా మంచి వాడి అమ్మ కానీ నేనంటేనే కాస్త కోపం అందుకే మనిద్దరిని కలవనివ్వకుండా చేస్తున్నాడు అంతే తప్ప నాన్న అంత చెడ్డవాడు కాదు అని చెప్తుంది.. ఆరాధ్య రూంలో కూర్చుని ఒంటరిగా ఉండడంతో అక్షయ అక్కడికి వెళ్తాడు. నీకు ఎక్కడి వెళ్లాలో చెప్పు అక్కడ తీసుకెళ్తాను. నాకు ఏమీ వద్దు నాన్న అమ్మని ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావ్? నీకు అమ్మ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. అమ్మ చేసే పనుల గురించి నీకు చెప్పలేనమ్మ అందుకే అమ్మ పై నేను కోప్పడుతున్నాను అంతే అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే ఆరాధ్య స్వరాజ్యం వాళ్ళింట్లో అవని దగ్గర ఉంటుంది. సరదాగా నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటుంది. దయాకరు మీ నాన్న వచ్చి ఇంటికి రమ్మని అంటే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళను. మమ్మి దగ్గరే ఉంటానని చెప్తానని అంటుంది. మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తానని చెప్తే నువ్వు ఏం చెప్తావని ఆరాధ్యను దయాకర్ అడుగుతాడు. నేను పోను అని ఆరాధ్య అంటుంది. ఇక ఇంట్లో అందరితో సరదాగా ఉంటుంది. ఆరాధ్యకు అవని భోజనం తినిపిస్తుంది. ఇంట్లోని వాళ్లందరికీ ఆరాధ్య భోజనం పెడుతుంది. ఇక అందరూ ఆరాధ్యను చూసి సంతోషంగా ఉంటారు.
అక్షయ్ కు ఆరాధ్య స్కూల్ టీచర్ ఫోన్ చేస్తుంది. సర్ ఆరాధ్యని ఎవరు స్కూల్ నుంచి తీసుకెళ్లారు సార్ ఒక గంట పర్మిషన్ అని ఇంకా తీసుకురాలేదు అని టీచర్ అంటుంది. ఎవరు పడితే వాళ్ళ చేత ఎందుకు పంపిస్తారు మీరు? మీకు కొంచమైనా ఉందా పిల్లలకి ఏమన్నా అయితే ఎవరో రెస్పాన్సిబిలిటీ లేదా అని అక్షయ్ అడుగుతాడు. మీ వాళ్లే అని చెప్పి తీసుకెళ్ళారండి.. ఆరాధ్యని అడిగితే మా వాళ్లే అని చెప్పింది.. ఒక గంటలో తీసుకొస్తామని చెప్పారు మూడు గంటలు అవుతున్న ఇంకా తీసుకురాలేదని అక్షయ్ తో టీచర్ అడుగుతుంది. మావయ్య అన్నారు కదా నేను ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను మేడం అని అక్షయ్ అంటాడు.
అక్షయ్ ఇంటికి వెళ్లి ఆరాధ్యని శ్రీకర్ కమల్ తీసుకొచ్చారేమో అని అడుగుతాడు.. కానీ వాళ్ళిద్దరూ మేం తీసుకురాలేదు అన్నయ్య అని చెప్పగానే షాక్ అవుతాడు. ఆరాధ్యను రోజు స్కూల్ కు తీసుకెళ్లింది పల్లవిని పల్లవి ఏమైనా బయటికి తీసుకెళ్ళింది ఏమో బావగారు అని శ్రీయా అంటుంది. అయితే పల్లవి కి ఫోన్ చేస్తానని కమల్ అంటాడు. అప్పుడే ఇంట్లోకి పల్లవి వస్తుంది. ఆరాధ్యని నువ్వు ఏమైనా బయటికి తీసుకెళ్ళావా అని అక్షయ్ అడుగుతాడు.. నేను తీసుకెళ్లలేదు బావగారు నాకు కూడా స్కూల్ టీచర్ ఫోన్ చేసి చెప్పింది ఇంట్లో ఎవరైనా తీసుకొచ్చారేమో అని కనుక్కుందామని నేను వచ్చేసాను అని అంటుంది.
మనం తీసుకెళ్లకుండా ఇంకెవరు తీసుకెళ్లి ఉంటారు ఇది కచ్చితంగా ఆ అవని పని అయి ఉంటుందని పార్వతి అంటుంది. ఇప్పుడే అవని దగ్గరికి వెళ్లి ఆరోగ్యం ఉందో లేదో కనుక్కుంటారని అక్షయ్ అంటాడు. అయితే పల్లవి మాత్రం చెప్పకుండా తీసుకెళ్లడం కిడ్నాప్ కిందికే వస్తుంది బావగారు ముందు ఆవని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకెళ్లి ఆరాధ్యను తీసుకురండి అప్పుడైతే ఇంకొకసారి ఆరాధ్య దగ్గరికి వెళ్ళనుఅని సలహా ఇస్తుంది. పల్లవి చెప్పింది కూడా నిజమేరా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవి నీ దగ్గరికి తీసుకెళ్లి ఆరాధ్యను తీసుకురా అని పార్వతి అంటుంది.
అవని ఆరాధ్య ఇంట్లోనే వాళ్ళందరూ దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లోకి పోలీసులు రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమైంది ఎందుకు పోలీసులు వచ్చారు అని అందరూ అనుకుంటారు. ఆరాధ్యను మీరు చెప్పకుండా స్కూల్ నుంచి తీసుకొచ్చారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇలా చెప్పకుండా తీసుకురావడం కిడ్నాప్ కేసుకి ఎందుకు వస్తుంది తెలుసా అని పోలీసులు అవనిని అడుగుతారు.. కిడ్నాప్ కేస్ కాదండి కిడ్నాప్ అని అక్షయ్ అంటాడు. ఈ అవనీని అరెస్ట్ చేసి నా బిడ్డ నాకు ఇచ్చేయండి ఎస్ఐ గారు అని అక్షయ్ అంటారు.
ముందుగా అవనీని అరెస్ట్ చేయాలి కాదు నన్ను అరెస్ట్ చేయండి నేనే ఆరాధ్య ను స్కూల్ నుంచి తీసుకొచ్చారని రాజేంద్రప్రసాద్ అంటాడు. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం కిడ్నాప్ కేస్ ఎలా అవుతుంది. అవని తన బిడ్డని చూడాలనుంది నేనే ఆరాధ్యను స్కూల్ నుంచి తీసుకొచ్చాను అని పోలీసులతో రాజేంద్రప్రసాద్ అంటాడు. రాజేంద్రప్రసాద్ చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా అక్షయ్ తో అవని గురించి చెప్తారు. కానీ అక్షయ్ మాత్రం సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కు అవని అసలు నిజం చెప్పేస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి..