BigTV English

India on Pakistan: పదేళ్లలో 3 సార్లు.. తోలు తీసి ఆరేసిన భారత్.. బుద్ధి తెచ్చుకోని పాక్!

India on Pakistan: పదేళ్లలో 3 సార్లు.. తోలు తీసి ఆరేసిన భారత్.. బుద్ధి తెచ్చుకోని పాక్!

India on Pakistan: పహల్గాం దాడికి భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. టెర్రరిస్ట్‌లను టార్గెట్ చేసుకొని 9 శిబిరాలపై దాడి చేసింది. ఇప్పుడే కాదు.. పాకిస్తాన్, ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడిన ప్రతీసారి భారత్ గట్టిగానే బదులిస్తోంది. కానీ, పాక్‌కు బుద్ధి రావడం లేదు. అంతేకాదు.. ఆ దేశానికి, ఉగ్రవాదులకు జరిగిన నష్టాన్ని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంది పాక్. 2016 సెప్టెంబర్ 18న ఉరిలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది భారత సైనికులు మృతి చెందారు. దానికి కౌంటర్‌గా 2016 సెప్టెంబర్ 29న పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో 38 నుంచి 50 మంది వరకు ఉగ్రవాదులు హతం అయ్యారని భారత్ ప్రకటించింది.


అంతర్జాతీయ మీడియా ప్రకారం భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌లో 10 నుంచి 70 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అటు భారత్ ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ మీడియా ఉగ్రవాదులపైనే దాడి జరిగిందని ప్రకటించాయి. మృతుల సంఖ్యలో తేడా ఉండొచ్చు కానీ.. నష్టం జరిగిందని ప్రపంచదేశాలు కూడా అప్పుడు స్పష్టం చేశాయి. కానీ, పాక్ మాత్రం దాడిని ఖండించింది. ఇది ఉగ్రవాదులపై దాడిగా కాకుండా పాక్ పైన జరిగిన దాడిగానే ప్రకటించింది. అంతేకాదు.. తమకు ఎలాంటి నష్టం జరగలేదని.. కేవలం సరిహద్దు వెంబడి కాల్పులు మాత్రమే జరిగాయని వాదించింది. జస్ట్ ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని ప్రకటించుకుంది.

ఇక 2019లో పుల్వామా దాడికి జరిగిన కౌంటర్ ఎటాక్ విషయంలో కూడా పాక్ ప్రకటన ఇంతకంటే గొప్పగా లేదు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు 40 మంది భారత భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి కౌంటర్‌‌గా 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని భారత్ అంచనా వేసింది. అంతర్జాతీయ మీడియా మాత్రం 80 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉండొచ్చని ప్రకటించింది.


అప్పుడు కూడా భారత్ దాడిని పాక్ ఖండించింది. ఉగ్రవాదలుపై జరిగిన దాడిని కూడా పాక్ మళ్లీ తమపై జరిగిన దాడిగానే ప్రకటించింది. కానీ.. భారత్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చింది. భారత వైమానిక దళం ఖాళీ ప్రాంతంలోనే బాంబులు వేసిందని ప్రకటించింది. ఈ దాడిలో కొన్ని చెట్లు కాలిపోయాయని.. ఓ కాకి చనిపోయిందని ప్రకటించింది. వరుస ఈ ఘటనలతో పాక్ వైఖరి క్లియర్‌గా తెలుస్తోంది. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే సైన్యంపై దాడిగా భావిస్తోంది పాక్. ఉగ్రవాదులు హతమైనా.. ఎలాంటి నష్టం జరగలేదని చెబుతోంది.

Also Read: మాక్ డ్రిల్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..

తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుందంటారు. అది ఎంత వరకు నిజమో కానీ… పాక్‌ ఉగ్రమూకలపై దాడుల సమయంలో…ప్రధాని మోడీ అదే వ్యూహాన్ని పాటించారు. గతంలో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్స్‌ సమయంలో శత్రువులను ఎలా డైవర్ట్ చేశారో, ఇప్పుడూ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత…దేశం మొత్తం ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. పాక్‌ ఉగ్రమూక పాత్ర తెలిసి, భారతీయుడి రక్తం మరిగిపోయింది. ముష్కరమూకకు గట్టి సమాధానం చెప్పాలన్న డిమాండ్‌ వచ్చింది.

కానీ ప్రధాని మోడీ మాత్రం.. వణకలేదు, బెణకలేదు. ఓవైపు 26 మంది అమాయకులు చనిపోయారన్న బాధ..! మరోవైపు ఉగ్రమూకపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి. ఇంకోవైపు పాక్‌ నేతల రెచ్చగొట్టే డైలాగులు. ఇలా అన్నింటినీ పంటికింద అదమిపట్టారు మోడీ. తన ఆహభావాల్లో మాత్రం ఏదీ కన్పించనీయలేదు. ఓవైపు రివేంజ్‌కు ప్లాన్ చేస్తూనే, మరోవైపు తన షెడ్యూల్‌ను కంటిన్యూ చేశారు. ఉగ్రదాడి జరిగిన 48 గంటల్లోనే బీహార్‌కు వెళ్లారు. ఆ తర్వాత కేరళ వెళ్లారు. ఏపీకి వచ్చారు. ఇలా తన రోటీన్‌ కార్యకలాపాలను కొనసాగిస్తూ శత్రువులను ఆదమరిచేలా చేశారు మోడీ.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×