Addanki Next MLA 2024 Shocking Survey: ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ .. ఇది నా అడ్డా అని ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటుంటే .. సమీకరణాలను మార్చయినా సరే ఆయన అడ్డాలో జెండా ఎగురవేయాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించడం అంత ఈజీ కాదని తెలిసినా.. అక్కడ విజయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న అధికార వైసీపీ. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లు ఎన్నికల్లో కష్టపడింది. మరక్కడ వరుస విజయాలతో ఊపు మీద ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందా? అసలింతకీ వైసీపీకి అంత ప్రెస్టేజియస్‌గా మారిన
ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఒకటి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమారే అందుకు కారణం ఈ నియోజకవర్గంలో జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు మండలాలు ఉన్నాయి. అద్దంకిలో మొత్తం 2లక్షల 41వేల 218 మంది ఓటర్లు ఉంటే.. వారిలో పురుషులు లక్షా 18వేల 289మంది కాగా.. మహిళలు లక్షా 22 వేల 917మంది వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధిగా గొట్టిపాటి రవి కుమార్, వైసిపి నుంచి పాణెం చిన్న హనిమిరెడ్డి లు అద్దంకి బరిలో పోటీపడ్డారు.
ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారాయన .. మూడు సార్లు మూడు పార్టీల నుంచి విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ ఆయనది. దాంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డ్ రవికుమార్ సొంతమయ్యింది. 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ తొలిసారి గెలిచారు. 2014లో రవికుమార్ వైసీపీలో చేరి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు.
అద్దంకి నియోజకవర్గంలో బాచిన చెంచు గరటయ్య, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ కుటుంబాలదే హవా.. బాచిన గరటయ్య ఈ నియోజకవర్గంలో కీలక నేతగా చాలా కాలం కొనసాగారు. కరణం బలరాంకు రాజకీయ ప్రత్యర్ధిగా అద్దంకిలో ఆయనకు చుక్కలు చూపించారు. కెరీర్‌లో నాలుగు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీతో అంటకాగిన గరటయ్య.. తర్వాత వైసీపీ బాట పట్టారు. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతితో ఆ సీనియర్ లీడర్ వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం మూటగట్టుకున్నారు. దానికి ముందు రెండు సార్లు గొట్టిపాటి అద్దంకిలో కరణం బలరాం ఫ్యామిలీకి చెక్ పెట్టగలిగారు.
Also Read: ఏపీ సీఎంని డిసైడ్ చేసే ఉరవకొండలో గెలుపెవరిదంటే..
2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కరణం బలరాంపై గొట్టిపాటి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌ను ఓడించారు. తర్వాత గొట్టిపాటి టీడీపీలోకి రావడంతో 2019 ఎన్నికల నాటికి కరణం ఫ్యామిలీ అద్దంకిని వీడి చీరాల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గొట్టిపాటి రవి టీడీపీ నుంచి ప్రస్తుతం మళ్లీ పోటీ చేశారు. చీరాల నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన కరణం బలరాం.. వైసీపీ పంచకు చేరి ఈ సారి చీరాల నుంచి తన కొడుకు వెంకటేష్‌ను బరిలో నిలిపి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉంది.. గొట్టిపాటి కుటుంబ పెద్ద హత్యతో ఈ రెండు కుటుంబాలు ప్రత్యర్థులుగా మారాయి. కరణం ఫ్యామిలీ టీడీపీలో ఉంటే.. గొట్టిపాటి ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో ఉన్నారు. కరణం, గొట్టిపాటిలు టీడీపీలో ఉన్నప్పుడు ఆ వర్గపోరు కొనసాగింది. ఈ క్రమంలో బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన హత్యలు కలకలం రేపాయి. దీంతో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా చూశారు.
కరణం ఫ్యామిలీ చీరాలను అంటిపెట్టుకోవడంతో అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి రవికుమార్‌పై గుంటురు జిల్లా కు చెందిన పాణెం చిన్న హానిమిరెడ్డిని వైసిపి రంగంలోకి దింపింది. గొట్టిపాటి రవికుమార్ ను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్న వైసిపి అధిష్టానం. గొట్టిపాటిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఎన్నికలలో పనిచేసింది. వైసిపి ముఖ్య నేత వై వి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గ కావడంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వ్యూహాలను అమలు చేసింది. హనిమిరెడ్డి ముందు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన బాచిన కృష్ణచైతన్యను తప్పించి రెడ్డి సామాజికవర్గానికి చెందిన హనిమిరెడ్డి ని అద్దంకి వైసిపి నుంచి పొటీ చేయించింది.
కమ్మ సెగ్మెంట్‌గా ముద్ర ఉన్న అద్దంకిలో వైసీపీ రెడ్డి ప్రయోగం చేసింది. దాంతో అద్దంకిలో ఈక్వేషన్స్ మారుతాయని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. వాస్తావానికి వైసీపీ వెసుకుంటున్న లెక్కలు వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో 55వేల కమ్మ సామాజిక ఓట్లు ఉన్నాయి. అ తర్వాత ఎస్సీ మాదిగ ఓటు బ్యాంకింగ్ ఉంది. కమ్మ , మాదిగ సామాజిక ఓట్లే నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయిస్తాయి.
Also Read: చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్యేల్యేల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?
వైసీపీ అభ్యర్ధి హనిమిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినరనే టాక్ నడుస్తుంది. బట్ గెలిచే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో ప్రయోగం చేయడంతో కమ్మ వర్గం అంతా సంఘటితంగా గొట్టిపాటి రవికి అండగా నిలిచిదంటున్నారు. అయితే వైసీపీ మాత్రం వంద ఓట్లు తేడాతో అయినా తామే గెలుస్తామని లెక్కలు వేసుకుంటుంది. టీడీపీ కేడర్ అయితే పది వేల ఓట్ల మెజార్టీ ఖాయమని గొట్టిపాటి రవి నాలుగొసారి ఎమ్మెల్యే అవుతున్నారని భారీగా బెట్టింగులకు దిగుతున్నారు భేటింగ్ లు వెసుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉండటంతో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కుతుందని అంచనాలు వెసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ప్రభుత్వ వ్యతిరేకత , గొట్టిపాటి ఇమేజ్‌తో మళ్లీ గెలుస్తామని టీడీపీ నమ్మకంతో ఉంది. వైసీపీ అభ్యర్ధి నాన్ లోకల్ అవ్వడం.. నియోజవర్గ రాజకీయాలు వంటి బట్టించుకునేటంత టైం ఆయనకు లేకపోవడం తమకు కలిసి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. మరోవైపు చివరి వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య కుమారుడు కృష్ణచైతన్యను పక్కనపెట్టారు జగన్.. దాంతో గరటయ్య వర్గం కూడా టీడీపీకే పనిచేసిదంటున్నారు. అద్దంకిలో అణువణువు తెలిసిని గొట్టిపాటి రవి పోల్ మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా సక్సెస్ అయ్యారని.. వైసీపీ అదే మైనస్ అయిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి అద్దంకి బరిలో గొట్టిపాటికి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందో లేదో.