BigTV English

Super Star Krishna Birthday: నట విస్వరూపం సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు తెలుసుకోండి..

Super Star Krishna Birthday: నట విస్వరూపం సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు తెలుసుకోండి..

Super star krishna biography in telugu(Today tollywood news): తెలుగు సినిమా పరిశ్రమ కీర్తిని, పేరు ప్రతిష్టలను యావత్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనది, విభిన్నమైనది కూడా. ఓ సమయంలో వెండితెరపై స్టార్లుగా కొనసాగుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు సమానంగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో వందల సినిమాలు చేశారు. సినిమాలో ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోయారు.


సరికొత్త క్యారెక్టర్లతో సినీ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ యాక్షన్ తరహా చిత్రాలను సైతం తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఆయనది. అయితే నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా మల్టీ టాలెంట్‌తో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అయితే ఇవాళ (మే 31)న ఆయన జయంతి. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తెనాలిలోని బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. అయితే స్కూల్ అనంతరం కాలేజీ మెట్లు ఎక్కిన కృష్ణ.. అప్పట్లోనే తాను మంచి హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోరికతో మద్రాసు చేరుకున్నాడు. అనంతరం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నటించే మొదటి ఛాన్స్ కృష్ణకు వచ్చింది. అలాగే ముందుగా పదండి ముందుకు, పరువు ప్రతిష్ట, కులగోత్రాలు వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.


Also Read: భువి నుంచి దివికి సూపర్ స్టార్ కృష్ణ..ఆత్మీయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు

అలాగే ఆయనకున్న క్రేజ్‌తో దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘తేనెమనసులు’ అనే సినిమాతో తొలిసారి వెండితెరకు కృష్ణ హీరోగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఆ తర్వాత కృష్ణ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనంతరం ‘గూఢచారి 116’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు. ఈ సినిమాతో తెలుగులో మొదటి జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’లో కౌబాయ్‌గా నటించి మెప్పించాడు. అలా వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ ప్రియులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలా తన కెరీర్‌ పీక్స్‌లో ఉందనగా.. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తర్వాత దాదాపు 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఎక్కడా తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేశారు. అలా మళ్లీ కంబ్యాక్ అయ్యారు. ఆపై ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు.

ఇక సినిమాలతో ఓ ఊపు ఊపేసిన సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లో కూడా తన హవా కనబరిచారు. అప్పట్లో ‘జై ఆంధ్రా’ ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటిగా ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇచ్చి దానిపై ఈనాడు అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పెట్టిన కొన్ని పథకాలు నచ్చక నాదెండ్ల బాస్కరరావుకు మద్దతు ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ప్రభుత్వం కూలి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యారు. అనంతరం 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరడం.. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. ఆపై 1993 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమా, రాజకీయ రంగంలో ఎంతో పేరు సంపాదించుకున్న కృష్ణ ఇప్పుడు లేకపోయినా.. ఆయన సినిమాల రూపంలో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×