E-Paper
Advertisement

ఏడాది గడిచినా వీడని మిస్టరీ.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కు అసలు కారణమేంటి?

ఏడాది గడిచినా వీడని మిస్టరీ.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కు అసలు కారణమేంటి?
Advertisement

Air India: కాలం మారింది కానీ గాయం మానలేదు.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదానికి జూన్ 12తో ఏడాది. బాధితుల ఇళ్లల్లో నేటికీ కన్నీళ్లు ఆగడం లేదు. వారి జ్ఞాపకాలు, ఫోటోలు బాధితుల ఇళ్లల్లో మౌనంగా ఉండిపోయాయ్.

DNAతోనే గుర్తించిన 260 ప్రాణాలు

Advertisement

మాటలకు అందని విషాదమది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, కేవలం DNA పరీక్షల ద్వారానే 260 మందిని గుర్తించి అవశేషాలను కుటుంబాలకు అప్పగించారు. నా బిడ్డ ముఖాన్ని కడసారి కూడా చూసుకోలేకపోయానన్న దుఃఖం చాలా మంది తల్లిదండ్రుల్లో ఇంకా ఉంది. విమానం కూలిన బి.జె. మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం నేటికీ ఒక గాయంలా అలాగే నిలిచింది. కాలిపోయిన గోడలు, చెల్లాచెదురైన లగేజీలు, పుస్తకాలు ఆ నాడు మరణించిన 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల భవిష్యత్ అనుకోని ప్రమాదంలో కలగా చెదిరిపోయింది. ప్రాణాలే పోయాయి.

ప్రాణాలు కాపాడిన అదృష్టం

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో 242 మంది ప్రయాణికులలో ఒక్కడంటే ఒక్కడే బతికి బట్టకట్టాడు, ఆయనే 40 ఏళ్ల బ్రిటీష్ పౌరుడు విశ్వాస్‌కుమార్ రమేష్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన కూర్చోవడం వల్ల విమానం విడిపోయినప్పుడు ఆయన బయటపడ్డారు. కానీ, అదే ఫ్లైట్‌లో ఉన్న తన సొంత అన్నను కోల్పోయారు. ఈ విషాద ఘటనకు ఏడాది పూర్తవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కార్యాలయాలు, విమానాశ్రయాలలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఎయిర్ ఇండియా ఉద్యోగులు.

ఏడాది గడిచినా వీడని మిస్టరీ..

ఏదైనా విమాన ప్రమాదంపై అంతర్జాతీయ నియమాల ప్రకారం ఏడాది లోపు తుది నివేదిక రావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక లోపం లేదా పైలట్ పొరపాటు అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నా ప్రమాదంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. విమానానికి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ల లోపాలను అమెరికాలో ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ టెక్నికల్ అనాలసిస్ పూర్తయితేనే అసలు కారణం తెలుస్తుంది.

పైలట్ తప్పిదమా? టెక్నికల్ లోపమా?

ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యూయల్ కట్-ఆఫ్ స్విచ్ ఆపరేట్ అవ్వడం వల్ల రెండు ఇంజిన్లు ఆగిపోయాయని, పైలట్ కావాలనే చేశాడా అన్న ప్రచారం మొదట జరిగింది. అయితే ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. టెక్నికల్ లోపం వల్లే అలా జరిగి ఉండవచ్చని, పూర్తి ఆధారాలు లేకుండా పైలట్లపై నింద వేయకూడదని పట్టుబట్టడంతో దర్యాప్తు బృందం మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తోంది. సగం సమాచారంతో రిపోర్ట్ ఇస్తే అది మరిన్ని అనుమానాలకు, ఊహాగానాలకు దారితీస్తుందని, అందుకే సమగ్రమైన ఫైనల్ రిపోర్ట్ కోసమే ఈ రెండు నెలల అదనపు సమయం తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

Related News

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

Big Stories

Advertisement
×