Operation Karregutta: మావోయిస్ట్ ఫ్రీ కంట్రీగా భారత్ ను నిలుస్తుందా? ఆ దిశగానే ఈ ఆపరేషన్ జరిగిందా? 2014 నాటికి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలేవి? ప్రస్తుతం మావోయిస్టుల సంఖ్యలో వచ్చిన తేడా ఎలాంటిది? మరీ ముఖ్యంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పేరిట మన బలగాలు పోరాడిన తీరు ఎలాంటిది? ఎలాంటి ఛాలెంజెస్ వారు ఫేస్ చేశారు? ఆ వివరాలేంటి?
ఆపరేష్ కర్రెగుట్టలు ఒక చారిత్రాత్మకం- CRPF
ప్రస్తుతం ఈ సంఖ్య 555కి పెరుగుదలచత్తీస్ గడ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన మావోయిస్టుల ఏరివేత పేరే ఆపరేషన్ కర్రెగుట్టలు. ఈ ఆపరేషన్ సుమారు 20రోజులు జరగ్గా.. మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. నక్సల్స్ రహిత భారత్ లో భాగంగా ఈ ఆపరేషన్ ఒక చారిత్రక విజయంగా చెబుతోంది సీఆర్పీఎఫ్. ఈ దిశగా ఓక ప్రకటన చేసిందీ భద్రతాదళం.
కర్రెగుట్టల్లో మొత్తం350 మంది నక్సల్స్ ఆశ్రయం
కర్రెగుట్టల్లో మొత్తం 350 మంది మావోయిస్టులు ఆశ్రయంపొందుతుండగా.. వీరిలో చాలా మంది తీవ్రంగా బాధ పడ్డమో లేక మరణించడమో జరిగిందని అంటున్నారు పోలీసులు. భౌగోళికంగా ఇక్కడున్న కఠిన పరిస్థితుల రీత్యా కొన్ని మృతదేహాలను వెలికి తీయలేక పోయామని చెబుతున్నాయి మన భద్రతా దళాలు.
214 నక్సల్స్ రహస్య స్థావరాలు, బంకర్ల ధ్వంసం
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గానూ పిలిచే ఈ ఆపరేషన్స్ లో 214 నక్సల్స్ రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు పోలీసులు. అంతే కాదు 450 ఐఈడీలు, 818 బీజీఎల్ షెల్స్, 899 కట్టల కోడెక్స్, డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు సీఆర్పీఎఫ్ డీజీ. దాదాపు 12 వేల కిలోల ఆహార పదార్ధాలను సైతం కైవసం చేసుకున్నట్టు చెబుతున్నారు అధికారులు.
4 ఆయుధ తయారీ యూనిట్లు ధ్వంసం
ఈ ఆపరేషన్లో భాగంగా బీజీఎల్ షెల్స్, హోం మేడ్ వెపన్స్, ఐఈడీలు, ఇతర మారణాయుధాల తయారీకి మావోయిస్టులు వాడే నాలుగు యూనిట్లను ధ్వంసం చేశాయి మన భద్రతా దళాలు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో కమాండ్ బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కి చెందిన 18 మంది సిబ్బంది ఐఈడీ పేలుళ్లలో గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయట పడి వివిధ ఆస్పత్రుల్లో చేరి మెరుగైన వైద్య సాయం పొందుతున్నారు.
సింగిల్ హెడ్ క్వార్టర్, శిక్షణ, ఆయుధ తయారీ కేంద్రాల ధ్వంసం
ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉన్న కర్రెగుట్టలపై ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కర్రెగుట్టలపై PLGA, DJASDC, TAC, CRC వంటి ప్రధాన నక్సల్ సంస్థల ఏకీకృత కేంద్ర కార్యాలయం ఉండటంతోపాటు నక్సల్స్ శిక్షణ ఆయుధ తయారీ సైతం జరిగేది.. ప్రభుత్వ దళాలు ఈ 20 రోజుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ పూర్తి చేశామని.. తన ట్వీట్ ద్వారా తెలియ చేశారు హోం మంత్రి అమిత్ షా.
CRPF, STF, DRD సిబ్బందికి హోంమంత్రి అభినందనలు
ఎంతో క్లిష్టతరమైన ఈ కొండల్లో మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కున్న CRPF, STF, DRD సిబ్బందిని అభినందించారు హోం మంత్రి. ప్రధాని మోడీ నాయకత్వంలో నక్సలిజం మూలాలను నిర్మూలించడానికి తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు అమిత్ షా. 2026 మార్చి నాటికి భారత్ నక్సల్స్ ఫ్రీ నేషన్ గా భారత్ మారుతుందని అన్నారాయన.
DG జ్ఞానేంద్ర.. DGP ఆరుణ్ దేవ్ నేతృత్వం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్ ఘడ్ డీజీపీ అరుణ్ దేవ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న దళాలకు నేతృత్వం వహించారు. పలువురు సీనియర్ అధికారులతో వీరు బీజాపూర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
31 మంది నక్సల్స్ మృతి- 28 మంది గుర్తింపు
కర్రెగుట్టలు మొత్తం 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నాయని. ఇందుల తలదాచుకున్న నక్సల్స్ లో 31 మంది వరకూ మట్టుబెట్టామనీ.. అయితే వీరిలో 28 మందిని మాత్రమే గుర్తించినట్టు చెప్పారు అధికారులు. వీరిపై కోటి 72 లక్షల మేర రివార్డులున్నట్టు చెప్పారు అధికారులు.
ఏప్రిల్ 21- మే 11 వరకూ జరిగిన ఆపరేషన్
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టులో భాగంగా.. కోబ్రా, సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఇంత భారీ రికవరీ గతంలో ఎన్నడూ చేయలేదని ప్రకటించారు అధికారులు. ఇది CRPFకు అతి పెద్ద విజమని అన్నారు ఉన్నతాధికారులు. ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకూ జరిగిన ఈ ఆపరేషన్లో. మావోయిస్టులకు కోలుకోలేని నష్టం జరిగినట్టు చెప్పారు.. అధికారులు.
ఈ ప్రాంతంలో సవాలుతో కూడుకున్న వాతావరణ పరిస్థితులు
మావోయిస్టులకు సుక్మా, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు పెట్టని కోటలు. ఈ ప్రాంతాల్లో పీఎల్జీఏ బెటాలియన్, సీఆర్సీ కంపెనీ, తెలంగాణ సాయుధ కమిటీలకు చెందిన అగ్రనాయకులకు, కార్యకర్తలకు సురక్షిత స్థావరం. ఈ ప్రాంతంలో సవాలుతో కూడుకున్న వాతావరణ పరిస్థితులుంటాయి. కేజీహెచ్ కఠినమైన కొండప్రాంతం కావడంతో సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో గత కొంత కాలంగా నక్సలైట్లు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. పీఎల్జీఏ బెటాలియన్ సాంకేతిక విభాగం, టీడీ యూనిట్ తో పాటు.. మరి కొన్ని ముఖ్యమైన విభాగాలతో సహా ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 300 నుంచి 350 వరకూ సాయుధ కేడర్లు ఆశ్రయం పొందుతున్నట్టు గుర్తించారు. దీంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
గత 4 నెలల్లో మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య- 197
2024లో పలు ఆపరేషన్లు విజయవంతం కావడంతో.. 2025 లోనూ యాంటీ నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగించారు.. గత నాలుగు నెలల్లో 197 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి మన భద్రతా దళాలు. 2014లో 35 జిల్లాలు మావోయిస్టుల ప్రభావంలో ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 6కి పడిపోయింది.
2014లో 126, 2025కి 18కి తగ్గుదల
నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉండగా.. ఇపుడా సంఖ్య 18కి తగ్గింది. 2014లో 76 జిల్లాల్లో 330 పోలీస్టేషన్లలో 1080 నక్సల్ ఘటనలు నమోదు కాగా.. 2024లో 42 జిల్లాల్లో 151 స్టేషన్లలో 374 ఘటనలు మాత్రమే నమోదయ్యాయి. 2014లో నక్సల్స్ హింసలో 88 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. 2024నాటికి ఈ సంఖ్య 19కి తగ్గింది. ఎన్ కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 63 నుంచి 2089కి పెరిగింది. 2024లో 928 మంది నక్సలైట్లు లొంగిపోగా.. 2025 తొలి నాలుగు నెలల్లో 718 మంది లొంగిపోయారు. 2019 నుంచి 2025 వరకూ కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసుల సహాయ సహకారాలతో.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లతో సహా మొత్తం 320 శిబిరాలను ఏర్పాటు చశాయి. 2014లో 66 గా ఉన్న పోర్టిఫైడ్ పోలీస్టేషన్ల సంఖ్య ఇప్పుడు 555కి పెరిగినట్టు గణాంకాలతో సహా వివరించారు అధికారులు.
పోలీసుల అంచనాలు ఎందుకు తారుమారు అయ్యాయి
ఆపరేషన్ కర్రెగుట్టలు ఎంత వరకూ విజయవంతం అయ్యాయో.. అంతే లోపాలున్నట్టు చెబుతారు విశ్లేషకులు. అసలు ఈ ఆపరేషన్ టార్గెట్ ఏం ఫిక్స్ చేశారు? అక్కడ ఏం జరిగింది? పోలీసుల అంచనాలు ఎందుకు తారుమారు అయ్యాయి? ఇందుకు తగిన కారణాలు ఏమై ఉంటాయి?
20 రోజుల ఆపరేషన్.. 28వేల భద్రతా బలగాలు..
20 రోజుల ఆపరేషన్. 28వేల మందికి పైగా భద్రతా బలగాలు. ఎంఐ 17హెలికాప్టర్లు, డ్రోన్లతో విస్తృత గాలింపు. 31మంది మావోయిస్టుల మృతి. 18మంది జవాన్లకు గాయాలు. గ్రే హౌండ్స్ కు చెందిన ముగ్గురు మృతి. క్లుప్తంగా చెప్పాలంటే ఇవీ.. ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించిన వివరాలు.
చనిపోయిన మావోయిస్టుల సంఖ్య- 31
మావోయిస్టు అగ్రనేతల్లో ఏ ఒక్కరినీ మట్టుబెట్టలేదు 20 రోజుల ఆపరేషన్. 28వేల మందికి పైగా భద్రతా బలగాలు. ఎంఐ 17హెలికాప్టర్లు, డ్రోన్లతో విస్తృత గాలింపు. 31మంది మావోయిస్టుల మృతి. 18మంది జవాన్లకు గాయాలు. గ్రే హౌండ్స్ కు చెందిన ముగ్గురు మృతి. క్లుప్తంగా చెప్పాలంటే ఇవీ.. ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించిన వివరాలు.
మావోయిస్టులకు గుట్టలపై పూర్తి అవగాహన
మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్ గా జరిపిన కర్రెగుట్టల ఆపరేషన్ లో పోలీసు బలగాలు విజయం సాధించాయా? అంటే, లేదనే చెప్పాలి. ఇందుకు కారణాలేంటని చూస్తే.. కర్రె గుట్టలపై పోలీసు బలగాలకు సరైన అవగాహన లేకపోవటం.. ఒక కారణమైతే వారికి వాతావరణం కూడా సహకరించక పోవటం మరో కారణంగా తెలుస్తోంది. ఇక, మావోయిస్టులకు కర్రె గుట్టలకు సంబంధించి సంపూర్ణ అవగాహన వెరసీ.. ఈ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణంగా చెబుతున్నారు కొందరు నిపుణులు.
2026, మార్చిలోపు మావోయిస్టు ఫ్రీ కంట్రీ టార్గెట్
2026, మార్చిలోపు.. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు పలు సందర్భాల్లో చెప్పారు.
ఆపరేషన్ కగార్ లో భాగంగా ఏప్రిల్ 21 నుంచి మొదలు
ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఏప్రిల్ 21న ఆపరేషన్ కర్రె గుట్టలు మొదలు పెట్టారు. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు అగ్రనేతలు ఈ గుట్టలోనే ఉన్నారంటూ అంచనా వేశారు పోలీసులు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అయితే 3వేల మందికి పైగా మావోయిస్టులు కర్రె గుట్టల్లో దాక్కుని ఉన్నట్టు లెక్క తేల్చారు. వీరిలో పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరిపై లక్షలాది రూపాయల రివార్డులున్నట్టు చెప్పారు. వీళ్లందరినీ ఏరి వేయటమే తమ లక్ష్యమని కూడా ప్రకటించారు.
160 కి. మీ విస్తీర్ణంలో గల కర్రెగుట్టలు
కూంబింగ్ మొదలు పెట్టిన మొదటి రెండు మూడు రోజుల్లోనే.. ఆపరేషన్లో పాల్గొన్న బలగాలకు మావోయిస్టులను ఏరివేత ఏమంత సులభం కాదన్న విషయం అర్థమైంది. కారణం…160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రె గుట్టలపై బలగాలకు సరైన అవగాహన లేకపోవటం… అదే సమయంలో మావోయిస్టులకు ఈ ప్రాంతంలోని ప్రతీ అంగుళం తెలిసి ఉండటం. ఇక, ఆపరేషన్ మొదలైనపుడు ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా భద్రతా బలగాలకు ఏమంత అనుకూలించ లేదు. కూంబింగ్ లో పాల్గొన్న వారిలో దాదాపు 50మంది వడదెబ్బకు గురై ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.
450 IED బీరు బాంబులను అమర్చిన మావోయిస్టులు
ఇక, కర్రె గుట్టలపై పూర్తి అవగాహన ఉన్న మావోయిస్టులు వ్యూహాత్మక ప్రాంతాల్లో 450 IED…బీరు బాంబులను అమర్చారు. వీటిని కనుగొని నిర్వీర్యం చేయటమే ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలకు గగనమైంది.
చనిపోయిన మావోయిస్టుల సంఖ్య- 31
ఆపరేషన్ లో భద్రతా బలగాలు.. మావోయిస్టుల మధ్య మొత్తం 21 ఎన్ కౌంటర్లు జరిగాయి. వేల బుల్లెట్లు పేలాయి. కాల్పుల మోతతో కర్రె గుట్టలు హోరెత్తాయి. ఇందులో పోలీసులు పెద్దగా సాధించింది ఏమీ లేదని అంటారు. ఆయా ఎన్ కౌంటర్లలో 31మంది మావోయిస్టులు చనిపోయారంటూ ఇటీవల ఛత్తీస్ ఘడ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.
EID పేలుడులో ముగ్గురు పోలీసులు చనిపోయారని ప్రకటన
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా మిలీషియా సభ్యులే. ఇదే ఆపరేషన్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ కు చెందిన RSI రణధీర్, కానిస్టేబుళ్లు సందీప్, పవన్ కళ్యాణ్ కూడా తుదిశ్వాస వదిలారు. మావోయిస్టులు అమర్చిన EID పేలుడులో ఈ ముగ్గురు చనిపోయినట్టుగా ప్రకటించారు అధికారులు. అయితే, మావోయిస్టులనుకుని సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు చనిపోయినట్టు అనుమానాలున్నాయి. ఈ విషయంపై అటు ఛత్తీస్ ఘడ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలుగానీ.. పోలీసు ఉన్నతాధికారులుగానీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
మావోయిస్టు అగ్రనేతల్లో ఏ ఒక్కరినీ మట్టుబెట్టలేదు
ప్రస్తుతం ఆపరేషన్ కర్రె గుట్టలు నిలిచి పోయింది. తిరిగి మొదలు పెడతారా.. లేదా? ఒక క్లారిటీ లేదు. 20 రోజులపాటు జరిగిన కర్రె గుట్టల ఆపరేషన్ లో సాధించిన గొప్ప విజయమేదీ లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. హిడ్మా సంగతి అలా ఉంచితే మావోయిస్టు పార్టీ అగ్ర నేతల్లో ఏ ఒక్కరిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్ట లేకపోయాయని చెబుతున్నారు.