Big TV Kissik Talks: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. అయితే ఆ బంధం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య స్నేహబంధం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి బంధాలలో ఆమని (Amani ), సౌందర్య (Soundarya )గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరికీ సినిమాలలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఇద్దరికీ ఒకరు ఉంటే ఒకరికి ఎనలేని అభిమానం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత సాన్నిహిత్యం ఉండేది. అంతలా పెనవేసుకున్న ఈ బంధంలో ఒకరు దూరమయ్యేసరికి ఇంకొకరు తట్టుకోలేక తాను కూడా వెళ్ళిపోవాలని అనుకున్నారట. అలా సౌందర్య గురించి ఆమని చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
సౌందర్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఆమని.. జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేయగా.. అందులో ఆమని, తన స్నేహితురాలు, ప్రముఖ దివంగత సీనియర్ స్టార్ హీరోయిన్ సౌందర్యను తలుచుకొని ఎమోషనల్ అయింది. ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని ప్రశ్నించగా.. ఆమని మాట్లాడుతూ..” ఇంకెవరు సౌందర్య. ఇండస్ట్రీలో నాకు ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ తను. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మరింత పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఊహించని క్రేజ్ దక్కింది. అయితే అనూహ్యంగా మరణించి మమ్మల్ని ఒంటరి చేసింది” అంటూ ఎమోషనల్ అయింది ఆమని.
సౌందర్యకి బదులు నన్నెందుకు తీసుకెళ్లలేదు దేవుడా అని ఏడ్చాను – ఆమని
ఆమని మాట్లాడుతూ.. “సౌందర్య చనిపోయింది అన్న విషయం తెలియగానే ఒక్కసారిగా నా గుండె ఆగిపోయిందనిపించింది. సౌందర్య లేని విషయాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె చనిపోయినప్పుడే కాదు ఇప్పటికీ కూడా సౌందర్యకి బదులు నన్నెందుకు తీసుకెళ్లలేదు దేవుడా అని, ఆ దేవుడ్ని అడగని రోజు ఉండదు.. అంత మంచి స్నేహితురాలు నాకు. ఇక ఆమె తర్వాత ఆ లోటును ఇప్పటివరకు ఎవరు భర్తీ చేయలేకపోయారు” అంటూ సౌందర్య లేని విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది ఆమని. ప్రస్తుతం ఆమని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సౌమ్య అలియాస్ సౌందర్య.. ఆ తప్పే ప్రాణాలు తీసిందా..
సౌందర్య విషయానికి వస్తే.. 1972 జూలై 18న కర్ణాటక కోలారు జిల్లాలో జన్మించిన సౌమ్య.. ఇండస్ట్రీ కోసం సౌందర్యగా పేరు మార్చుకుంది. ఈమె తండ్రి ప్రముఖ జ్యోతిష్యులు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మొత్తం వందకి పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె.. అలనాటి అందాల తార సావిత్రి (Savitri) తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న ఘనత కూడా సౌందర్యకే సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లకే ఊహించని స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సౌందర్య.. కెరియర్ పీక్స్ లో ఉండగానే.. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజపా అభ్యర్థి విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి కరీంనగర్ బయలుదేరింది. అయితే దురదృష్టవశాత్తు గాల్లోకి ఎగిరిన ఆ విమానం కొన్ని క్షణాలకే గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలడంతో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.. అయితే ఈ ఘటన తర్వాత సౌందర్య అలా ప్రచారం చేయడానికి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేదని ఎంతోమంది అనుకున్నారు కూడా. ఇక 2004 ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన సినీ ఇండస్ట్రీని అటు అభిమానులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఒక ఆమె లేని లోటును ఇప్పటికీ ఎప్పటికీ ఎవరు తీర్చలేరు అనేది వాస్తవమని సినీ వర్గాలు కూడా చెబుతూ ఉంటాయి.
ALSO READ:Big TV Kissik Talks: ఆడపిల్ల పుట్టగానే కన్నీరు కార్చిన ఆమని.. ఆ కన్నీటి వెనుక ఇంత నరకం దాగి వుందా..?