BigTV English

SSMB29 Update: రాజమౌళి-మహేష్ బాబు మూవీలో విలన్ ఫిక్స్..?

SSMB29 Update: రాజమౌళి-మహేష్ బాబు మూవీలో విలన్ ఫిక్స్..?

SSMB29 Update: ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్న సినిమాలు SSMB29.. రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మహేష్ బాబు లాంటి చాక్లెట్ బాయ్ ను జక్కన్న ఎలా చూపిస్తాడు అని చాలామంది ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్లిద్దరూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో.. షూటింగ్ కూడా అలానే చేస్తారని అందరికి తెలుసు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ హీరోలను దించాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో ను విలన్ గా దించబోతున్నట్లు తెలుస్తుంది. హీరో ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మహేష్ బాబుతో తలపడబోతున్న మరో స్టార్..?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని యావత్ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలంటే ఆమాత్రం ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో స్టార్ హీరోలను దించబోతున్నాడు జక్కన్న. కీలక పాత్రలో ఇప్పటివరకు స్టార్ హీరోలు నటించిన ఉన్నారని తెలిసిందే.. ఇప్పుడు మరో పాన్ ఇండియా హీరోను విలన్ గా దింపబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. హీరో మరెవరో కాదు పాన్ ఇండియా హీరో విక్రమ్.. గతంలో కూడా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్‌ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్‌ మొదలైంది. మే నుంచి జూన్‌ వరకు ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది..


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్క సినిమాను అస్సలు మిస్ అవ్వకండి

మూవీ బడ్జెట్.. 

గత ఏడాది వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమా కోసం ప్రిన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్టు లో మహేశ్ బాబుతోపాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలిసా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ ఆవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ మూవీ కోసం దాదాపు రూ.. 1000 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టబోతున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలంటే అంతకుమించి బడ్జెట్ ఉంటుంది. ప్రస్తుత్తానికి అయితే 1000 కోట్లు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×