E-Paper
Advertisement

US Dollar: డాలర్ పెరిగితే రూపాయి ఎందుకు పడిపోతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఇదే!

US Dollar: డాలర్ పెరిగితే రూపాయి ఎందుకు పడిపోతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఇదే!
Advertisement

US Dollar: డాలర్ అనేది కేవలం కాగితం ముక్క కాదు. అదొక గ్లోబల్ ఎకనమిక్ ఇంజిన్. అయితే అది కేవలం హైప్ వల్ల మాత్రమే నిలబడిందా? లేక దానికి బలమైన పునాదులు ఉన్నాయా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా తన సైనిక శక్తితోనో, మార్కెటింగ్ చాకచక్యంతోనో డాలర్‌ని బలవంతంగా రుద్దిందని కొందరు భావిస్తుంటారు.

ఒక నిర్ణయం… ప్రపంచ కరెన్సీకి కొత్త దిశ!

కానీ.. డాలర్ ఇంతటి శక్తిమంతమైన కరెన్సీగా మారడానికి.. చరిత్రలో జరిగిన ఓ సంఘటన, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయ్. డాలర్‌‌కి, గోల్డ్‌ రేట్లకి ఉన్న లింక్ గురించి కూడా సోషల్ మీడియాలో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. 50 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంకి.. మొదట్లో స్టేడియం యాజమాన్యం 50 వేల టికెట్లు మాత్రమే ఇచ్చేది. అంటే.. ఒక టికెట్‌కి ఒక సీటు. ఇది.. పక్కా గ్యారెంటీ. చాలా ఏళ్ల పాటు ఈ సిస్టమ్ చాలా నిజాయితీగా నడిచింది. ఇక్కడ టికెట్ అనేది.. కేవలం ఓ రశీదు మాత్రమే. అసలైన విలువ.. ఈ సీటులో ఉంది.

స్టేడియం కంటే టికెట్‌కి విలువ ఎక్కువైనప్పుడు..

Advertisement

ఆ సీటుని ఇంటికి పట్టుకెళ్లలేరు కాబట్టి, ఆ టికెట్‌ని అంతా భద్రంగా దాచుకున్నారు. కొన్నేళ్లకు స్టేడియం యాజమాన్యం ఆలోచన మారింది. బయటి జనం ఈ టికెట్లను.. కరెన్సీలా వాడుకోవడం గమనించింది. నా వాచ్ ఇస్తాను.. రెండు టికెట్లు ఇవ్వు, నా బైక్ ఇస్తాను.. ఐదు టికెట్లు ఇవ్వు.. అన్నట్లుగా మార్చుకుంటున్నారు. జనం స్టేడియంలో తమ సీటు ఉందా? లేదా? అనేది చూడటం మానేసి.. ఈ టికెట్ ముక్కనే.. ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడే.. యాజమాన్యానికి ఆశ పుట్టింది. లేని సీట్ల కోసం కూడా అదనపు టికెట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. 50 వేల సీట్లు ఉన్న స్టేడియానికి.. లక్ష టికెట్లు అమ్మారు. తర్వాత దానిని 5 లక్షలు, చివరకు 10 లక్షల టికెట్లు అమ్మేశారు. నిజానికి.. అక్కడ సీట్లు ఖాళీ లేవు. కానీ.. లేని సీట్లని టికెట్ల రూపంలో అమ్మేసి వారు బిలియనీర్లు అయిపోయారు.

బ్రెటన్‌వుడ్స్ నుంచి నిక్సన్ షాక్ వరకు

అసలు కథ అప్పుడే మొదలైంది.. ఒకరోజు బయటి దేశాల నుంచి టికెట్లు ఉన్నవారంతా.. ఒక్కసారిగా స్టేడియం దగ్గరకు వచ్చి మా సీట్లు మాకు చూపించండి అని అడిగారు. యాజమాన్యం దగ్గర సీట్లు లేవు. అప్పుడు వారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం గేట్లు లాక్ చేసేశారు! ఇకపై.. టికెట్లు ఇస్తే మేము సీట్లు ఇవ్వం, ఆ టికెట్టే మీకు విలువైనది, ఆ కాగితమే మీ డబ్బు అని ప్రకటించారు. ఈ కథలో స్టేడియం అంటే బ్యాంక్. సీటు అంటే గోల్డ్. టికెట్ అంటే.. అమెరికన్ డాలర్. చాలా ఏళ్ల క్రితం వరకు 35 డాలర్లకు ఒక ఔన్సు బంగారం ఇచ్చే గ్యారంటీ ఉండేది. ఆ డాలర్ అనేది కేవలం బంగారానికి సంబంధించిన రశీదు మాత్రమే. అప్పట్లో అమెరికా ప్రభుత్వం.. తన దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే ఎక్కువ డాలర్లని ముద్రించింది.

ఫియట్ మనీ యుగం.. విలువ ఎవరిది?

Advertisement

ఫ్రాన్స్ లాంటి దేశాలకు డౌట్ వచ్చి.. మా డాలర్లు తీసుకొని, మా బంగారం మాకు ఇచ్చేయండి అని అడిగారు. దాంతో.. అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్.. 1971లో గోల్డ్ విండో మూసేశారు. అప్పుడు.. ఆయన ప్రపంచానికి ఏం చెప్పారంటే, ఇకపై డాలర్ అనేది బంగారానికి రశీదు కాదు.. ఆ డాలరే అసలైన డబ్బు అని ప్రకటించారు. దాంతో.. ఈరోజు ప్రపంచంలో ట్రిలియన్లకొద్దీ అమెరికన్ డాలర్లు చలామణీ అవుతున్నాయ్. కానీ.. అగ్రరాజ్యం దగ్గర బంగారం మాత్రం అంతే ఉంది. అందుకే.. ప్రతి వస్తువు ధర పెరుగుతోంది గానీ, అక్కడ బంగారం నిల్వలు మాత్రం పెరగట్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ అంతా.. డబ్బుని పొదుపు చేస్తున్నారు. ధనవంతులు మాత్రం నిజమైన ఆస్తులని, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు.. సేఫ్ హెవెల్ కోసం చూసినప్పుడు.. వారికి ముందుగా గుర్తొచ్చేది డాలరే. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయం ప్రపంచానికి ఇంకా కలగలేదు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే, డాలర్ విలువలో స్థిరత్వం ఎక్కువ. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ప్రపంచం డాలర్ వైపే మొగ్గు చూపుతోంది. 1970లలో సౌదీ అరేబియా లాంటి చమురు దేశాలతో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఎక్కడ చమురు కొనాలన్నా డాలర్లలోనే చెల్లించాలనేది దాని సారాంశం. అంటే, మీకు పెట్రోల్ కావాలంటే మీ దగ్గర డాలర్లు ఉండాల్సిందే. దీనివల్ల ప్రతి దేశం డాలర్లను నిల్వ చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా అమెరికా డాలర్ చెల్లుబాటు అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో.. 80 శాతానికి పైగా లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయ్. ఈ భారీ చలామణీ వల్ల దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గడం లేదు.

అమెరికా వైట్ హౌస్ తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మన దేశంలోని సామాన్యుడి జేబుని కూడా ప్రభావితం చేయగలదు. భౌగోళిక రాజకీయాల్లో ఎన్ని దేశాలు సూపర్ పవర్‌లుగా ఎదిగినా, కరెన్సీల చక్రవర్తిగా డాలర్ తన ఆధిపత్యాన్ని ఏళ్ల తరబడిగా కాపాడుకుంటోంది? డాలర్ వెనుక ఉన్న రహస్య కథలేంటి?

ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఎలా మారింది?

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయ్. అప్పుడు 44 దేశాల ప్రతినిధులు అమెరికాలోని బ్రిటన్‌వుడ్స్ అనే ప్రాంతంలో సమావేశమయ్యారు. అప్పట్లో, ప్రపంచంలోనే అత్యధిక బంగారపు నిల్వలు అమెరికా దగ్గరే ఉండేవి. దీనిని అవకాశంగా తీసుకొని ఓ ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీ విలువని.. డాలర్‌తో లింక్ చేయాలని, డాలర్ విలువని బంగారంతో అనుసంధానించాలని తీర్మానించారు. అంటే.. డాలర్ ఇస్తే బంగారం వస్తుందనే నమ్మకంతో.. అంతా డాలర్లని వాడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా అవతరించింది. అయితే.. 1971లో ఓ ఊహించని మలుపు వచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డాలర్లకు బదులుగా బంగారం ఇవ్వడం నిలిపేశారు. దీనినే నిక్సన్ షాక్ అంటారు. అప్పటి వరకు బంగారం బ్యాకప్‌గా ఉన్న డాలర్, ఒక్కసారిగా కేవలం అమెరికా ప్రభుత్వం ఇచ్చే భరోసా మీద మాత్రమే నడవడం మొదలైంది. అయినా డాలర్ విలువ తగ్గలేదు.

డాలర్ పెరిగితే… రూపాయి ఎందుకు పడిపోతుంది? అసలు కథ ఇదే!

డాలర్ డామినేషన్ తగ్గకూడదంటే.. దానికి ఏదో ఒక బలమైన ఆధారం ఉండాలి. అందుకే.. అమెరికా సౌదీ అరేబియాతో ఓ డీల్ చేసుకుంది. ప్రపంచంలో ఎవరైనా చమురు కొనాలంటే, కేవలం డాలర్లతోనే కొనాలి. ప్రతిగా సౌదీకి అమెరికా సైనిక రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల.. చమురు అవసరమైన ప్రతి దేశం డాలర్ల నిల్వలని ఉంచుకోవడం తప్పనిసరి అయింది. ఇదే.. డాలర్‌ని ప్రపంచం మొత్తానికి అవసరమైన కరెన్సీగా మార్చింది. ఇక.. అమెరికా వడ్డీ రేట్ల మాయాజాలం కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు వస్తాయ్. అమెరికా వడ్డీ రేట్లు పెంచితే.. ఇన్వెస్టర్లు ఇతర దేశాల్లో ఉన్న తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని, అమెరికా బాండ్లలో పెడతారు. దీనివల్ల.. డాలర్‌కు డిమాండ్ పెరిగి, మన రూపాయి లాంటి కరెన్సీల విలువ పడిపోతోంది. అనేక దేశాలు డాలర్లలో అప్పులు తీసుకుంటాయ్. డాలర్ విలువ పెరిగితే ఆ దేశాలు చెల్లించాల్సిన వడ్డీ భారం అమాంతం పెరిగిపోతుంది.

డీ-డాలరైజేషన్ దిశగా ప్రపంచం.. డాలర్ ఆధిపత్యానికి సవాల్

అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డీ-డాలరైజేషన్ అనే చర్చ నడుస్తోంది. డాలర్ ఆధిపత్యంపై కొన్ని దేశాలు అసహనంగా ఉన్నాయి. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం, డాలర్‌ని ఓ ఆయుధంలా వాడుతోందనే విమర్శలున్నాయ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై విధించిన ఆంక్షలు చూసి, భారత్-చైనా లాంటి దేశాలు తమ సొంత కరెన్సీల్లో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నాయ్. మరోవైపు.. చైనా కూడా యువాన్‌ని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్రిక్స్ కూటమిలోని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయ్. వాస్తవానికి.. డాలర్‌కు ఉన్న సీన్ వాస్తవమే.

దశాబ్దాల క్రితమే అమెరికా తెచ్చిన హైప్‌తో.. ఇప్పుడది తోపు కరెన్సీగా మారింది. అయితే, అమెరికా తన ఇష్టారాజ్యంగా డాలర్‌ని రాజకీయ ఆయుధంగా వాడుతుండటంతో, ఇతర దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయ్. డాలర్ కేవలం ఓ కాగితం ముక్క కాదు. అది.. అమెరికా రాజకీయ, సైనిక, ఆర్థిక బలాల కలయిక. డీ-డాలరైజేషన్ గురించి చర్చలు జరుగుతున్నా, ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యానికి డాలరే ఏకైక చక్రవర్తి. అయితే.. గతంలో గ్రీక్ డ్రాక్మా, రోమన్ దేనారియస్, బ్రిటిష్ పౌండ్ ఎలా తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయో.. భవిష్యత్తులో డాలర్‌కు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయ్. ఇప్పటికైతే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని నడిపించే స్టీరింగ్.. అమెరికా డాలరే. అది ఎటు తిరిగితే.. ప్రపంచం అటు తిరుగుతుందనేది మాత్రం వాస్తవం.

Also Read: గర్భస్రావానికి ఒత్తిడి.. మనస్తాపంతో గర్భిణీ ఆత్మహత్యాయత్నం

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×