E-Paper
Advertisement

GM Harish Balayogi: కోనసీమ ప్రజలకు ఎంపీ హరీష్ షాక్..

GM Harish Balayogi: కోనసీమ ప్రజలకు ఎంపీ హరీష్ షాక్..
Advertisement

GM Harish Balayogi:  తండ్రి వారసత్వం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆ ఎంపీ …ఎన్నికలు జరిగి 15 నెలలు గడిచిన నియోజకవర్గంలో కనిపించకుండా పోయారనే చర్చ నడుస్తుందట. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి..ఏదో చేస్తాడు అనుకుంటే ఏం చేయడంలేదట ఆ ఎంపీ. పార్లమెంటులో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఆయన కనిపించడంలేదనే టాక్ జోరుగా నడుస్తుందట. మా ఎంపీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని అడిగే పరిస్థితి అక్కడ నెలకొందంట ఆ నియోజకవర్గంలో. ఇంతకీ ఎవరా నేత.

బాలయోగి వారసుడిగా రాజకీయాల్లోకి హరీష్ ఎంట్రీ

కోనసీమ ముద్దుబిడ్డగా పిలుచుకునే లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత నేత జిఎంసి బాలయోగి అంటే దేశంలోనే తెలియని వారంటూ ఉండరు. కోనసీమకు ఓ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి బాలయోగి. కోనసీమ అభివృద్ధి అంటే బాలయోగికి ముందు బాలయోగికి తరువాత అనే చెప్పుకోవాలి. ఇందులో నో డౌట్. అంతలా అభివృద్ధి చేసి కోనసీమ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి బాలయోగి. అలాంటి మహానేత కుమారుడే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. గంటి హరీష్ మధుర్.. బాలయోగి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన హరీష్ ను కోనసీమ ప్రజలు తమ ముద్దుబిడ్డ కుమారుడని అందలమెక్కించి ఆదరించారు. 2024 ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించి అత్యధిక మెజారిటీతో హరీష్ ను ఎంపీగా గెలిపించుకున్నారు. తన తండ్రి లాగే జిల్లాను అభివృద్ధి చేస్తాడని ఎన్నో కలలు కన్నా కోనసీమ ప్రజలకు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదంటూ బాధపడుతున్నారట జిల్లా వాసులు.

హరీష్ కనిపించడం లేదని టాక్

Advertisement

ఎన్నికలు ముగిసిన తర్వాత,ఎంపీగా ఎన్నికై 15 నెలలు గడిచిన స్థానిక ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి నియోజకవర్గం లో పర్యటించిన దాఖలాలే ఎక్కడ కనబడడం లేదనే టాక్ విసృత్తంగా నడుస్తుందట. ఎంపీ హరీష్ గెలిచిన నాటినుండి ఎక్కడ కూడా ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కానీ అందుబాటులో ఉండడం లేదనే టాక్ పార్టీ కేడర్‌లో వినిపిస్తోంది. తన పార్టీ ఆఫీసులోకి వెళ్లి అడుగుదామంటే…తమ సమస్యలను చెప్పుకుందామంటే అక్కడ వినే నాధుడే కరువయ్యారనేది లోకల్‌గా టాక్. కనీసం వెళ్ళిన వారి నుంచి వివవరాలు తీసుకుని, మాట్లాడే వ్యక్తులు కూడా ఉండడంలేదని స్ధానికంగా నడిచే చర్చ. నియోజకవర్గానికి చెందని వాళ్లు ఎవరైనా కార్యాలయానికి వస్తే… అప్పుడప్పుడు కనిపించే వ్యక్తులు కూడా కనీసం మనుషులాగానే చూడడం లేదనేది టాక్.

బాలయోగితో పనిచేసిన నేతలను కూడా పట్టించుకోని హరీష్

తన తండ్రి బాలయోగితో పనిచేసిన నేతలను కూడా ఇప్పుడు ఆయన కుమారుడు హరీష్ వారిని గౌరవించడం కాదు కదా కనీసం పట్టించుకోవడం లేదట. తండ్రి బాలయోగి మీద ఉన్న అభిమానంతో ఆయనను స్థానిక నాయకులు గౌరవిస్తున్నా.. ఎంపీ మాత్రం కనీసం గౌరవం ఇవ్వడంలేదని బాధపడుతున్నారట స్థానిక నాయకులు. బాలయోగి స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన ఢిల్లీలో ఉన్న నియోజకవర్గంలో చిన్న విషయం జరిగితే టక్కున స్పందించే వారనేది ఆయనను దగ్గరగా చూసిన వాళ్లు చేప్పే మాట. చిన్న కార్యకర్త ఇంట్లో ఏం జరిగినా వెళ్లి దగ్గరుండి చూసి వచ్చేవారనేది స్థానికులు నోట వినిపించే మాట. కానీ ఆయన కుమారుడైన ఎంపీ హరీష్ కనీసం పార్లమెంట్ స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవనది ప్రస్తుతం స్థానికులు నోట వినిపిస్తున్న మాట. ఈ 15 నెలల కాలంలో మచ్చుకు కూడా కనిపించని ఎంపీ….మొన్న పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు తలుక్కుమన్నారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారట.

నరసాపురం రైల్వే లైన్‌కు శ్రీకారం

Advertisement

తన తండ్రి బాలయోగి చిరకాల వాంఛ కోనసీమకు రైలు మార్గం. ఆయన ఉన్న సమయంలో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టారు. ఆయన మరణ అంతరం అది నత్తనడకన నడుస్తుంది. ఇప్పుడైనా బాలయోగి కుమారుడు ఎంపీగా ఉన్న సమయంలోనైనా కోనసీమకు రైలు కోత వినిపిస్తుందని అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రైల్వే లైన్ పనులు.. మాటల్లోనూ, కాగితాల్లోనూ తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇంచు కూడా ముందుకు కదిలిన పరిస్థితి కనిపిస్తుందనేది స్థానికులు చర్చించుకుంటున్నారట. నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో గాని అభివృద్ధిలో గాని ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రిలానే అభివృద్ధి చేస్తాడు అనుకుంటే అభివృద్ధి,సమస్యల పరిష్కారానికి చోరవ చూపడంలో ఎంపీ ఆమడ దూరంలో ఉంటున్నారనే టాక్ నడుస్తుందట.

కొబ్బరి పంట చేజారిపోతుందని రైతుల ఆవేదన

పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒకరిద్దరి ఎమ్మెల్యేలతో తప్ప మిగతా వారితో సఖ్యతగా కూడా ఉండరనేది ఎమ్మెల్యేల సన్నిహితుల చేప్పే మాట. సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు మినహా… మిగిలిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఫోటోలు కూడా వేయడం మానేసారనేది లోకల్‌గా గుసగుసలు వినిపిస్తున్నాయట. తాజాగా రాజోలు నియోజకవర్గంలో కేసనపల్లి కొబ్బరి చెట్లు మొడువారిపోయి చచ్చిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వమే స్పందించి మంత్రులు ఉన్నతాధికారులు పర్యటించి స్థానిక రైతులతో సమస్య గురించి వివరాలు తీసుకున్నారు. ఎంపీ మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. దీంతో కొబ్బరి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. స్వయంగా డిప్యూటీ సీఎం కూడా సమస్యను తెలుసుకునేందుకు నేరుగా కేసనపల్లికి వెళ్లారు. డిప్యూటీ సీఎం పర్యటనకు వచ్చిన సందర్భంలో కనిపించిన ఎంపీ…అంతకు ముందుకు ఎనాడూ తమ సమస్య గురించి తెలుకునే ప్రయత్నం చేయలేదని రైతులు కూడా మదనపడుతున్నారట.

పంథా మార్చుకుని అందుబాటులోకి వస్తారని ఆశ

తండ్రి స్థాయిలో కోనసీమను అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజలు ఇప్పుడు ఆ ఎంపీ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియక నిరాశకు గురవుతున్నారట. ఎన్నికల్లో గెలిచి దాదాపు 15 నెలలు గడిచినా నియోజకవర్గంలో ఎంపీ జాడే లేదని, కార్యకర్తలకు, నాయకులకు కూడా అందుబాటులో ఉండట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎంపీ హరీష్ మధుర్ తన పంథా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని…కోనసీమను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మరి చూడాలి ఇప్పటికైనా ఆయన తండ్రి ఆశయాలను కోనసీమ జిల్లా ప్రజల కోరికలను నెరవేరుస్తాడా లేక ఇదే పద్ధతిలో ఉంటారా అనేది వేచి చూడాలి.

Story By Venkatesh, Big Tv 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×