Gundeninda GudiGantalu Today episode May 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి ఆకలేస్తుందని అక్కడ దగ్గరిలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్తుంది. అయితే రెస్టారెంట్లోకి ప్రభావతి కామాక్షి రావడం చూసి మనోజ్ షాక్ అవుతాడు వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఆర్డర్ తీసుకోవడానికి అక్కడికి ఎవరిని పిలిచినా రారు. ఓనర్ వచ్చి ఆ మిడిగుడ్లోడు మనోజ్ ఎక్కడికి పోయాడు కస్టమర్లు వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకోవాలని తెలియదా అని సీరియస్ అవుతాడు. మనసు తన ఫ్రెండ్ ను మేనేజ్ చేసి ఆర్డర్ తీసుకోమని పంపిస్తాడు. అతను సరే అని ఒప్పుకొని వెళ్లి ప్రభావతి కామాక్షి దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మనోజ్ మనోజ్ అంటూ మాటిమాటికి అరుస్తూ ఉంటాడు. సరిగా పనిచేయడం లేదు అంటూ నానా మాటలు తిడతాడు. అలా తన కొడుకు మనోజ్ పేరుతో ఆ ఓనర్ తిడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేక పోతుంది. కామాక్షి మాత్రం మనోజ్ ఇక్కడే పని చేస్తున్నాడేమో అని సందేహిస్తుంది. వీరి మాటలను ఓవైపు మనోజ్ చూస్తూనే ఉంటాడు.శృతి దోమల కోసం అని స్ప్రే కొట్టింది మామయ్య. ఈ వాసన ఘాటుగా వస్తుందమ్మా నాకు ఊపిరి అందట్లేదు అని సత్యం అంటాడు.. కాసేపు ఊపిరి తీర్చుకోవడానికి ఇబ్బంది పడతాడు సత్యం. ఇక మీనా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని ఎవరికీ ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. మీనా అనే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది బాలు ఫోన్ చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తే మీనా జరిగిన విషయాన్ని బాలుకి చెప్తుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లి సత్యం కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం కు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. బాలు మీనా మనోజ్ ప్రభావతి రవిలు సత్యంలో ఇంటికి తీసుకొని వస్తారు. ఇంట్లోకి రాగానే శృతి బాగున్నారా అంకుల్ మరేదో ప్రమాదం అని చెప్పారు అని అడుగుతుంది. దానికి బాలు కౌంటర్ ఇస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చారేంటి ఏదో సీరియస్ అని అన్నారు కదా అని శృతి అడుగుతుంది. దానికి బాలు నువ్వు చాలా ఫీలవుతున్నట్లున్నావే అన్ని సెటైర్ వేస్తాడు. ఒక వారం అలా పడుతుందేమో అనుకున్నాను అప్పుడే వచ్చేశారు కదా అని అలా అడిగాను అని శృతి అంటుంది.
ఆ మాట వినగానే బాలు కోపం శివాలెత్తిపోతుంది. ఓ చాలా పెద్ద ప్లానే చేసావే? చూసావా అమ్మ నీ డబ్బు ఉన్న కోడలు ఎలా మాట్లాడుతుందో అని ప్రభావతిపై బాలు సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన దానికే కదా మా నాన్నకి పరిస్థితి వచ్చింది అని శృతి పై వచ్చి రాగానే బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక రోహిణి మావయ్య గారు మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా నేను వస్తానంటే మనోజ్ ఇంటికి తీసుకొస్తున్నామని చెప్పారు అందుకే రాలేకపోయానని అంటుంది. శృతి మాత్రం బాలుకి ఏ మాత్రం తగ్గకుండా అరుస్తూ ఉంటుంది.
మా నాన్నకి లవ్వడానికి కారణం నువ్వే నువ్వు కొట్టిన స్ప్రే వల్లే మా నాన్న హాస్పిటల్ వారికి వెళ్ళాడు అని శృతి బై బాలు సీరియస్ అవుతూనే ఉంటాడు. నేనేం తప్పు చేశాను దోమలు ఉన్నాయని స్ప్రే చేశాను అంతేగాని సరదాగా ఇదేమన్నా రూమ్ స్ప్రే నా అని అరుస్తుంది. మధ్యలో ప్రభావతి కలగజేసుకొని నువ్వు ఏదైనా చేసేటప్పుడు నన్ను అడిగి చేయమ్మా అని అంటుంది. అది విన్న శృతి నేను ఏ పని చేయాలన్నా మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని చేయొచ్చా వద్దా అని అడిగి చేయమంటారా అని సీరియస్ గా అరుస్తుంది. అలా కాదు శృతి ఇంట్లో పరిస్థితులను తెలుసుకొని చేయడం మంచిది కదా అని మీనా సర్ది చెప్తుంది.
నేనేం చేశానని అందరూ నామీద అలా పడుతున్నారు నీతో తప్పుచేసి నేరం చేసి మీ ముందు నిలబడినట్లు నన్ను తిడుతున్నారేంటి అని శృతి అంటుంది. నువ్వు చేసిన పనికి మా నాన్నకి బిల్లు కట్టలేక అప్పు చేసి మరీ కట్టాను. ఆయన మా నాన్న కట్టింది నేను లెక్క చేయలే కానీ నీవల్లే ఈ పరిస్థితి వచ్చింది అని బాలు అంటాడు. హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో చెప్తే నేను అంత కట్టేస్తాను. నేను తప్పు చేశాను కదా నేనే కడతానని శృతి అంటుంది. ఆయన అలా అనట్లేదు శృతి నువ్వు కాస్త తెలుసుకొని చేసినంంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళ నాన్న అంటే ఆయనకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా ఆ బాధతోనే ఇలా మాట్లాడుతున్నారు నువ్వేం పట్టించుకోవద్దు లోపలికి వెళ్ళు అని మీనా అంటుంది.
సత్యం కు రూమ్ ఇవ్వడానికి బాలు ఒప్పుకుంటాడు కానీ మీనా మాత్రం ఆగండి అని ఆపుతుంది. చూసావా నువ్వు మీ నాన్న కోసం రూమ్ ఇవ్వాలి అనుకుంటే నీకు పెళ్ళాం రూమ్ ఇవ్వకుండా ఆపుతుంది అని మీనా పై నోరు పారేసుకుంటుంది ప్రభావతి. నాకు నోరు ఉంది అత్తయ్య శృతి లాగా నేను కూడా మిమ్మల్ని ఎదిరించి అప్లికేషన్ పెట్టుకోవాలని అడిగేదాన్ని.. కానీ నేను అలా చేయను ఆ రూమ్ అంతా దుమ్ముతో నిండి ఉంటుంది.. వెళ్లి శుభ్రం చేసి వస్తాను ఆగండి అని చెప్తున్నాను చెప్పేలోపులే మీరు ఇలా చేస్తారా.. సత్యం చూశావా ఎప్పుడు నోరెత్తని మీనా కూడా నువ్వు చేసేది తప్పు అని చెప్పింది ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే మంచిది అని హితవు పలుకుతాడు..
ఇక రవి సత్యం కు మందులు ఇచ్చేసి అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో అనేసి అంటాడు. శృతి చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నానని రవి అనగానే సత్యం ఏం పర్లేదురా తెలియక చేసింది కదా అని అంటాడు. రవి వెళ్లి శృతి దగ్గర మా నాన్నకు వెళ్లి క్షమాపణలు చెప్పు జరిగింది పొరపాటని నాదే తప్పు అని ఇంకొకసారి చేయనన్నట్లు చెప్పేశారా అని శ్రుతితో అంటాడు. శృతి రవి చెప్పినట్లుగానే సత్యం దగ్గరికి వెళ్లి నా పొరపాటు అయిన అంకుల్ క్షమించండి అని చెప్పేసి వస్తుంది. ఆ తర్వాత రవి శృతిలిద్దరూ గొడవపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..