Big Stories

Jagan on EVM’s Voting : బ్యాలెట్‌ ఉండగా.. ఈవీఎం ఎందుకు దండగ ? అప్పుడలా.. ఇప్పుడిలా.. అలా ఎలా జగన్ ?

YS Jagan on EVM’s Voting(AP political news): ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న.. ఇది పెద్దలు చెప్పిన సామెత. ఈ సామెత పొలిటికల్ లీడర్స్‌ను చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీరి మాటలు అలా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట.. పోయినప్పుడు మరో మాట. అవసరమైనప్పుడు ఓ మాట.. అవసరం లేనప్పుడు మరో మాట. ఏంటి నమ్మడం లేదా.. ? అయితే ఓ ఎగ్జాంపుల్ చూసేయండి.

- Advertisement -

వైసీపీ అధినేత ఓ సందర్భంలో మాట్లాడిన మాట ఇది. ఏదో తెలిసి తెలియక ఓ సారి మాట్లాడాడు.. ఏముందిలే అంటారా. అయితే ఇది కూడా వినేయండి. ఇది మరో సందర్భంలో మాట్లాడిన మాట. ఈ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల సారాంశం ఏంటి ? ఈవీఎంలను ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. దానికి వారే బాధ్యులు తప్ప.. ఈవీఎంలు కాదు. మీ ఓటమికి ఈవీఎంను బాధ్యులను చేయవద్దు.. ఇది ఆయన మాటల సారాంశం. నిజానికి మహబాగా సెలవిచ్చారు అని అనాలనిపిస్తుంది.

- Advertisement -

మరి అలాంటి జగన్‌ ఇప్పుడు ఏమంటున్నారు.. ? అంటే ఆయన నేరుగా అనలేదు.. ఓ ట్వీట్‌ను ట్వీటారు. దాని సారాంశం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయి. మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. మనం కూడా ఈవీఎంల బదులు పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించాలి. ఇదీ ఆయన చెప్పే మాట.

Also Read : ఫ్యాన్ పార్టీకి మొదలైన ఉక్కపోత..

అప్పుడేమో బ్యాలేట్ వద్దు.. ఈవీఎం ముద్దు అన్న జగన్. ఇప్పుడేమో బ్యాలెట్‌ ఉండగా.. ఈవీఎం ఎందుకు దండగా అంటున్నారు. ఏంటి ఏం అర్థం కావడం లేదా? అదే కదా అసలు కథ.. అందుకే ముందుగా ఆ సామెత చెప్పింది. జగన్ అప్పుడేమన్నారు.. చంద్రబాబు ఓడిపోయి ఆ నెపాన్ని ఈవీఎంల మీద వేస్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడు మీరు చేసేందేంటి సర్.. ? మీరు చేసేది కూడా అదే కదా. అప్పుడు మీకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఈవీఎంల విధానంపై ఎలాంటి డౌట్‌ రాలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలేట్‌ విధానం కొనసాగుతుందన్న విషయం గుర్తుకు రాలేదు. కానీ ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య 11కు పడిపోవడంతో వెంటనే ఈ విషయం గుర్తుకు వచ్చిందా ? ఇదేం లాజిక్కండి బాబు..?

నిజానికి ఈ రాజకీయల నేతలేంటో.. వీరి ఆలోచన పద్ధతేంటో.. ఏం మాట్లాడుతారో.. ఎందుకు మాట్లాడుతారో.. అందులో ఓ అర్థం పర్థం ఉంటుందో లేదో కూడా చూసుకోరనిపిస్తుంది. మరి లేకపోతే ఈ పద్ధతేంటి? అసలు వైసీపీ నేతలు చిన్న లాజిక్‌ మర్చిపోతున్నారు. అదేంటంటే ఈ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ షేర్‌ ఎంతో మర్చిపోయినట్టు ఉన్నారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో 39.37 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈవీఎంలు ట్యాంపర్‌ అయితే ఇంత ఓటింగ్‌ శాతం ఎలా వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓటింగ్‌ పర్సంటేజ్ 49.95 శాతం. అంటే గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు వైసీపీకి తగ్గిన ఓటింగ్‌ షేర్ 10 శాతం మాత్రమే.

సో.. ఇక్కడ వైసీపీని కూల్చింది కూటమి అని క్లియర్‌ కట్‌గా అర్థమైపోతుంది. మరి ఈ విషయం నిజంగా వైసీపీ పెద్దలకు తెలియదా? లేక తెలిసి కూడా అంగీకరించలేకపోతున్నారా? సరే ఓటమిని అంగీకరించడం.. అంగీకరించకపోవడం అనేది మీ ఇష్టం. లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం మాటను పక్కనపెట్టి.. మీరు చేస్తున్నది ఏంటి? ప్రజల్లో ఓ కొత్త అనుమానపు బీజాలను నాటుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎలక్షన్‌ కమిషన్‌ను తప్పుపట్టేలా వ్యవహరిస్తున్నారు.

Also Read : రుషికొండ ప్యాలెస్ లో దిమ్మతిరిగే రహస్యాలు.. జనం సొమ్ముతో.. జల్సాలు

ఇక వైసీపీ అధినేత ఎప్పుడైతే ఈ ట్వీట్‌ చేశారో.. అధికార టీడీపీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. నాడు 151 సీట్లు వస్తే విజయం.. ఇప్పుడు కూటమికి 164 సీట్లు వస్తే అన్యాయమా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. అంతేకాదు ఆయన ఓ సవాల్‌ కూడా విసిరారు. జగన్‌ పులివెందులలో రాజీనామా చేస్తే.. అప్పుడు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామన్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కూడా వస్తుందో.. రాదో చూసుకుందాం అన్నారు. జగన్‌ ఇంకా షాక్‌ నుంచి తేలుకోలేదని.. ఏపీ ఎలన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కౌంటర్ వేశారు.

చోటా మోటా లీడర్లు ఎప్పుడేం మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఓ పార్టీ అధినేత అయ్యిండి కాస్త ఆచితూచి మాట్లాడకపోతే.. రియాక్షన్‌ ఇలానే ఉంటుంది మరి. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ ఓటమికి సంబంధించి అసలైన కారణాలను విశ్లేషించుకొని.. వాటికి తగ్గట్టుగా పద్ధతులు మార్చుకుంటే నెక్ట్స్‌ ఎన్నికల్లో చాన్స్‌ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News