UI Movie OTT : ప్రస్తుతం పాన్ ఇండియా అనే పదం ఎంతగా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ 90వ దశకంలోనే కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) తన సినిమాలతో ఇలాంటి ట్రెండ్ ని తీసుకొచ్చారు. ఆయన తన సినిమాలతో దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని భాషతో సంబంధం లేకుండా అలరించి ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లోనే రా, ఏ, ఉపేంద్ర వంటి హిట్ సినిమాలను తీసి కథానాయకుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ఉపేంద్ర. దాదాపు 10 ఏళ్ల బ్రేక్ తర్వాత ఉపేంద్ర దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘యూఐ’ (UI The Movie). థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు ఓటిటి కష్టాలు వెంటాడుతున్నాయని తెలుస్తోంది.
ఉపేంద్ర హీరోగా నటించిన ‘యూఐ’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ ఇంకా సెట్ అవ్వలేదని తెలుస్తోంది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ ని తీసుకోలేదని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు కన్నడలో హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది ‘యూఐ’. దీంతో ఈ సినిమా ఓటిటి రైట్స్ మంచి ధరకే పలకచ్చు అని టాక్ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ (Netflix) లేదా హాట్ స్టార్ (Hotstar)… ఈ రెండిట్లో ఏదో ఒక ఓటిటి ‘యూఐ’ మూవీని కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ముందుగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల్లో అంటే జనవరి 24న ఓటిటిలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఆరు లేదా ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ‘యూఐ’ (UI The Movie) మూవీని ఓటీటీ మూవీ లవర్స్ ఫిబ్రవరి 7 లేదా ఫిబ్రవరి 14న ఇంట్లోనే కూర్చుని చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక మొదటి రోజే ‘యూఐ ది మూవీ’కి ఏకంగా 6.75 కోట్ల కలెక్షన్స్ రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు కన్నడలో 6 కోట్ల కలెక్షన్స్ రాగా, తెలుగులో 70 లక్షలు, తమిళంలో 4 లక్షలు, హిందీలో ఒక లక్ష కలెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది కన్నడలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా ‘యూఐ’ చరిత్రను సృష్టించింది.
ఇప్పుడు ఈ మూవీ రైట్స్ ను ఏ ఓటీటీ సొంతం చేసుకుంటుంది? ‘యూఐ’ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఏప్పుడు అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా ఆన్లైన్ లో లీక్ అవ్వడం నిర్మాతలకు షాక్ ఇస్తోంది.