Ahmed Shehzad: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నట్లు ఇటీవల వెల్లడించింది. ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ని పాకిస్తాన్ నిర్వహించబోతోంది. ఇందుకోసం భారత జట్టు పాకిస్తాన్ కి వెళ్లడానికి నిరాకరించింది. ఆ తర్వాత బీసీసీ – పిసిబి కి మధ్య కొంతకాలం పాటు చాలా వార్ జరిగింది. ఇక ఇప్పుడు రెండు బోర్డులు హైబ్రిడ్ మోడల్ కి అంగీకరించాయి.
Also Read: KL Rahul Injured: టీమిండియాకు బిగ్ షాక్… నాలుగో టెస్ట్ కు ఆ ప్లేయర్ దూరం !
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్రకారం ఛాంపియన్ ట్రోఫీ – 2025 పాకిస్తాన్ లో తటస్థ వేదికలో ఆడబడుతుంది. అంటే భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లకు కొలంబో & దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ని త్వరలోనే ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లు కూడా ఏ దేశంలో, ఏ వేదికలో జరుగుతాయో త్వరలోనే వెల్లడించబోతోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కాబోతోంది.
అయితే హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు అంగీకరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబి) పై ఆ జట్టు వెటరణ్ బ్యాటర్ అహ్మద్ షెజాద్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. ఇతనికి వివాదాలతో దోస్తీ కట్టడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికి చాలాసార్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించిన అహ్మద్ షెజాద్.. తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకొని బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుందని అన్నాడు.
“ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా టీమ్ ఇండియాకి ఆతిథ్యమిచ్చే బంగారం లాంటి అవకాశం పాకిస్తాన్ కి వచ్చింది. అన్ని క్రికెట్ బోర్డులు ఈ ట్రోఫీని పాకిస్తాన్ లో నిర్వహించేందుకు అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేశాయి. దీంతో ఐసీసీకి ఏ మాత్రం వెనకడుగు వేసే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఐసీసీ ఈవెంట్ ద్వారానే భారత జట్టును పాకిస్తాన్ కి తీసుకువచ్చే అవకాశం ఉండగా.. దాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేజార్చుకుంది.
తాజాగా నేను ఓ పోస్ట్ కాస్ట్ చేశాను. అందులో పాకిస్తాన్ – భారత్ జట్లకు ఓ సలహా కూడా ఇచ్చాను. భారత్ – పాకిస్తాన్ రెండు దేశాలు సరిహద్దుల్లో ఓ స్టేడియం నిర్మించుకొని ఒక గేట్ పాకిస్తాన్ వైపు, మరొక గేటు ఇండియా వైపు పెట్టాలని సూచించారు. ఇరుజట్ల ఆటగాళ్లు వారి దేశం వైపు ఉన్న గేట్లో నుండి వచ్చి ఆడతారు. ఇందుకు కూడా భారత ఆటగాళ్లకు, భారతదేశ ప్రభుత్వానికి ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే ఆ దేశ ఆటగాళ్లు మా దేశం వైపు ఉన్న మైదానంలోకి రావాలంటే వీసాలు కావాలేమో” అంటూ సెటైర్లు వేశాడు.
Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!
ఇక అహ్మద్ షెజాద్ 2013 డిసెంబర్ 31న శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 30న వెస్టిండీస్ తో జరిగిన వన్డే ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్ లో 13 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన షెజాద్.. 982 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 81 వన్డేల్లో 2605 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.