E-Paper
Advertisement

Nellore politics: అవినీతి ఆరోపణలు – సిబిఐ డిమాండ్లు..కాకాణి, సోమిరెడ్డి మధ్య ముదిరిన యుద్ధం!

Nellore politics: అవినీతి ఆరోపణలు – సిబిఐ డిమాండ్లు..కాకాణి, సోమిరెడ్డి మధ్య ముదిరిన యుద్ధం!
Advertisement

Nellore politics: వారిద్దరూ మాజీ మంత్రులు వారి మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతుంటాయి. అందులో ఇద్దరు అగ్రనేతలు కావడంతో వారిద్దరి మధ్య వైర్యం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం మారినా.. ఆ జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన ఆ ఇద్దరి మధ్య రాజకీయ పోరు మాత్రం ఫుల్ స్టాప్ లేకుండా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు ఎలా ఉందో.. ఎన్నికల తర్వాత కూడా వారి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంది. వారిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోకరు మాజీ మంత్రి. నిత్యం ఏదో ఒక విషయం పై వీరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో పోరేంటి. అసలు ఎవరా నాయకులు.. ఎందుకు వారి మధ్య వార్ వాచ్ థిస్ స్టోరి.

ఒకటి పోతే ఒకటి నెల్లూరు నియోజకవర్గ రాజకీయ యుద్ధం

ఏపీలో నెల్లూరు జిల్లా రాజకీయా లకు ఓ ప్రత్యేక స్దానం ఉంది. రాజకీయ ప్రత్యర్థులైన మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ పోరు కొనసాగుతోంది. ఒకటి పోతే ఒకటి… ఏదో ఒక టాపిక్‌తో ఆ అధికార, ప్రతిపక్ష నేతలు రాజకీయరగడను రాజేస్తూనే ఉంటారు. నియోజక వర్గ అంశమైనా.. రాష్ట్ర స్థాయి అంశమైనా..ఇద్దరి మధ్య డైలాగ్ వార్ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు.

సోమిరెడ్డి-కాకాణి వారసత్వ రాజకీయ పోరు

Advertisement

ఒకవేళ సోమిరెడ్డి కన్నా ముందుగా కాకాణి మీడియా ముందుకు వస్తే…. వెంటనే నేనున్నానంటూ సోమిరెడ్డి సీన్లోకి ఎంటర్ అయిపోతారు. అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందుగా మీడియా ముందుకు వస్తే.. గట్టి గానే కౌంటర్ ఇచ్చేస్తాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. వీరిద్దరి మాటల్లో వాస్తవం ఉందా ! లేదా ! అనేది పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇలా దశాబ్దానికి పైగా వీరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంది.

దేవస్థాన భూములపై కేసులు.. మీడియా ముందు కాకాణి మళ్లీ రచ్చ

గతంలో వీరి మధ్య లిక్కర్, నకిలీ డాక్యుమెంట్స్‌లకు సంబంధించి కోర్టు కేసులు, ఉద్యోగుల బదిలీలు, కృష్ణపట్నం పోర్టు కం టైనర్ టెర్మినల్, బెంగళూరు రేవ్ పార్టీ వంటి టాపిక్స్ పై మాటల యుద్ధం జరగ్గా..తాజాగా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని..అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి సిఎస్ఆర్ ఫండ్ కూడా స్వాహా చేశారని..దేవస్థాన భూములపై కూడా కన్నేసారని..మరోసారి మీడియా ముందుకు వచ్చారు కాకాణి. సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయట పెడితే విషయాలన్నీ బయటకు వస్తాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పనుల జాబితా మీడియాకు ఇచ్చే దమ్ముందా సోమిరెడ్డికి ఉందా అని‌ ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ కోసం కాణికా డిమాండ్

Advertisement

తన అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే కనుపూరు కాలువ, సోమశిల, కండలేరు పరిశీలనకు నన్ను వెళ్లనీకుండా హౌస్ అరెస్ట్ చేయించారని విమర్శించారు. సోమిరెడ్డి తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని తాను మొదటినుంచి కోరుతున్నానని…నాలాగే సోమి రెడ్డికి తనపై వస్తున్న అవినీతి ఆరో పణలపై సిబిఐ విచారణ చేయాలని అడిగే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరి గేషన్ అంశంపై కూడా రోడ్డెక్కారు కాకాణి. దీంతో మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తెరమీదకు వచ్చింది.

కాకాణి ఆరోపణలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సూటి సమాధానం

దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు. తనపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎప్పుడూ చేసే ఆరోపణలు నిరాధారమైనవే కదా అని కాకాణి మాటలను కొట్టి పారేస్తున్నారు సోమిరెడ్డి. తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పు కొస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో టిడిపి పై నిందలు మొపే ప్రయత్నం చేసి వైసిపీ భంగ పడిందని..2020లొ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందన్న విషయం కాకాణి తెలుసుకొని మాట్లాడాలని సోమిరెడ్డి.. కాకాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జిల్లా అధ్యక్షుడిగా కాకాణి నియామకంపై విమర్శలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత వైసిపీకి లేదన్నారు. 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసిపీ ప్రభుత్వానికి వంద కోట్ల పెనాలిటీ వేసిందన్న విషయాన్ని వైసిపి గుర్తుంచుకోవాలన్నారు. సోమశిల, కండలేరులో నీళ్లు లేకపోతే వైసిపీ ఆగం చేయాలి గాని అనవసరమైన వాటిపై రాద్ధాంతం చేసి నవ్వులు పాలు అవుతున్నారని విమర్శించారు సోమిరెడ్డి.. ఇప్పటి వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై అవినీతి అక్రమాలు చేశాడు గానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా చూపించలేకపోయాడన్నారు. తనపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కాకాణి మనుగడ సాగిస్తున్నాకడని యద్దేవా చేశారు. కాకాణి లాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షు డిగా పెట్టుకుని వైసీపీ పూర్తిగా పతనమైపోయిందని విమర్శించారు .

సర్వేపల్లిలో నేతల వ్యక్తిగత విమర్శల బీభత్సం

దీంతో ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంటుందని అనిపిస్తోంది. రోజు మార్చి రోజు మీడియా సమావేశాలు పెట్టడం ఒకరిమీద ఒకరు దుమ్మెతిపోసుకోవడం పరిపాటిగా మారింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయిన మాజీ మంత్రి కాకాణి ఏ మాత్రం తగ్గకుండా సోమిరెడ్డిని ఢీ అంటే ఢీ అని ఎదురుకొంటున్నారు. సర్వేపల్లి అభివృద్ధిని మరచి వారు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటుండడంతో సర్వేపల్లి ప్రజలు అసహనం వ్యక్తం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోని సర్వేపల్లి అభివృద్ధికి పాటుపడాలని పలువురు కోరుతున్నారు.

Story by: Apparao, Big Tv

ALSO READ: రష్యాను ముంచేసిన మంచు తుఫాన్.. మంచు మంచిదేనా..?

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×