Baba Vanga Prediction: 2025 అంత భయంకరంగా ఉండబోతుందా..? యుగాంతానికి 2025 నాంది పలకబోతోందా..? ప్రపంచాన్ని వణికిస్తున్న బాబా వంగా,నోస్ట్రడామస్ జోతిష్యం. రెండు నెలలు.. ఇంకా 60 రోజులు మాత్రమే.. వాతావరణంలో వస్తున్న మార్పులు ఓ వైపు.. సవాళ్లు విసురుకుంటున్న దేశాలు మరోవైపు. ఇలాంటి పరిణామాల్లో బాబావంగా చెప్పింది జరగడం ఖాయమా అంటూ.. కొత్త ఆందోళన మొదలైంది. భవిష్యత్తు గాఢాంతకారం కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. బ్రతికితే చాలు.. చావే సుఖం అనుకునే రోజులు దగ్గరకాబోతున్నాయి. 2025 ఈ నెలల్లో జరిగబోయేది ఇదే అంటూ.. బాబావంగా, నోస్ట్రడామస్ చెప్పిన మాటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2025 యుగాంతానికి నాంది అని ఆ ఏడాది ప్రపంచం మృత్యు తాండవం ఆడుతుందని ఈ ఇద్దరు అంచనా వేశారు.
కాగా ఈ ఏడాది రష్యా-ఉక్రెయిన్ యుద్దం ముగుస్తుందని రెండు దేశాలు అలసిపోయి పోరాటాలు విరమించుకుంటాయని ఈ ఇద్దరు అంచనా వేశారు. నిజంగానే వాళ్లిద్దరు చెప్పినట్లు నిజం అయినట్లే కనిపిస్తుంది. అయితే ఐరోపాలో రాబోయే రెండు నెలల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని హెచ్చరించారు. అగ్నిపర్వతాల విస్ఫోటనలు, వరదలతో ప్రపంచం అంతా అల్లాడుతుందని, ముఖ్యంగా బ్రెజిల్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సముద్ర మట్టాలు పెరిగిపోయి భూమి మునిగిపోతుందని, అప్పుడు సరికొత్త రాజకీయం ఏర్పడుతుందని, దాని నాయకుడే ప్రపంచాన్ని ఏలుతాడని అంచనా వేశారు. ఈ సంఘటనలు ప్రపంచ అంతానికి దారితేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
2025 సంఘర్షణల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా జనాభా తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. మనుగడ కోసం మనుషులు కొత్త వనరుల వెతుక్కునే అవకాశం ఉందని బాబా వంగా జ్యోతిష్యం చెబుతుంది. 2025 తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 2028లో మానవులు శుక్రుడిని చేరుకుంటారని తెలిపారు. 2033లో ఓ భారీ మంచు ముక్క కరిగిపోతుందని, దీంతో సముద్ర మట్టం గణనీయంగా పెరుగుతుందని.. ఇది సునామీకి దారితీస్తుందని బాబా వంగా జ్యోష్యం చెబుతోంది.
16వ శతాబ్ధానికి చెందిన నోస్ట్రడామస్ నక్షత్రాల అమరికను బట్టి భవిష్యత్తు పరిణామాలు తారుమారు అవుతాయని లెస్ ప్రొఫెటీస్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఇందులో చెప్పనవన్ని చాలా వరకు నిజమయ్యాయి కూడా. ఇదే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ ఇద్దరి చెప్పిన జ్యోతిష్యం చాలా మంది నమ్ముతారు కూడా. గతంలో వీరి భవిష్యత్తు అంచనాలు చాలావటికి నిజమయ్యాయి. ఇక 2025లో ఈ ఇద్దరు చెప్పినట్లు ప్రకృతివైపరీత్యాలు, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని అంచనా వేశారు. వీరు చెప్పినట్లుగానే ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి కూడా. మరి ఆ ఇద్దరు చెప్పినట్లే రాబోయే రోజులు భయకరంగా ఉండబోతోందా..? ప్రపంచం వినాశనానికి అడుగులుపడబోతున్నాయా? యుగాంతానికి ఇదే నాంది ఇనేలా జనాల్లో భయాలు కనిపిస్తున్నాయి.
Also Read: బాబా వంగా షాకింగ్ జోస్యం.. 2025లో ప్రపంచం అల్లకల్లోలమే..
బాబా వంగా మాటలను ప్రస్తుత ప్రపంచ పరిణామాలతో పోలుస్తూ.. అంచనా వేస్తున్నారు జనాలు. నిజానికి దేశవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంది. ఇరాన్-ఇజ్రాయేల్ వార్‌తో ఎప్పుడూ ఏం జరుగుతుందో.. ప్రపంచం ఎలా మారుతుందో.. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో అన్న భయాలు కనిపిస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయేల్ యుద్దం మొదలైతే ఆ ప్రభావం వల్ల యూరప్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం మీద కనిపిస్తుంది. మరి అది నిజమైతే బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం నమ్మి తీరాల్సిందే. ఇకపోతే ఇవన్ని చివరికి ఊహాగానాలకు మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే..