Vishwak Sen Laila: స్టార్ హీరోలు అయినా, యంగ్ హీరోలు అయినా లేడీ గెటప్‌లో కనిపించడం అంటే అంత ఈజీ కాదు. ప్రేక్షకులు వారిని ఆ గెటప్‌లో యాక్సెప్ట్ చేస్తారా లేదా.. అసలు వారు తెరపై ఎలా కనిపిస్తారు.. ఇది చూసి ఆడియన్స్ ట్రోల్ చేస్తారేమో.. అని వారి మనసులో చాలా భయాలు ఉంటాయి. కానీ అప్పట్లోనే చిరంజీవి ఈ భయాలు అన్నింటిని పక్కన పెట్టి ఒక మూవీలో పూర్తిగా లేడీ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అదే ‘చంటబ్బాయి’. ఆ సినిమాలో చిరు లేడీ గెటప్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తాను కూడా ఆ గెటప్ వేశానని అందరి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. అప్పుడు తను ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేస్తోంది.
ఆయనే ఇన్‌స్పిరేషన్
యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు సినిమాలతో, పాత్రలతో ప్రయోగం చేయడం చాలా ఇష్టం. అందుకే తాజాగా విడుదలయిన ‘లైలా’లో కూడా లేడీ గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపిస్తాడు అనే పాయింట్‌తోనే ఈ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రేక్షకులకు దీనిపై ఇంట్రెస్ట్ మొదలయ్యింది. ఇక ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత విశ్వక్‌ను లేడీ గెటప్‌లో చూసి ఆశ్చర్యపోని వారు లేరు. తనకు అలా నటించడానికి చాలా భయం వేసినా.. ఇబ్బంది కలిగినా కూడా ‘చంటబ్బాయి’ సినిమాలో చిరంజీవి గెటప్‌ను చూసి ధైర్యం తెచ్చుకున్నానని తనతోనే స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు విశ్వక్ సేన్.
బాగున్నావయ్యా విశ్వక్
అసలైతే ‘చంటబ్బాయి’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) లేడీ గెటప్‌లో కనిపించారు కాబట్టే అలా నటిస్తున్న సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నయో అందరి ముందు అడిగి తెలుసుకోవడానికే తనను తనను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). అదే ఈవెంట్‌లో అసలు అలా ఎలా చేయగలరు అని చిరును అడిగేశాడు కూడా. అయితే ‘చంటబ్బాయి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఆపై విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో తనకంటే బాగున్నాడని, బొద్దుగా ఉన్నాడని ప్రశంసలతో ముంచేశారు. చిరు సర్టిఫికెట్ ఇచ్చారంటే సినిమా హిట్టే అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మూవీ విడుదలయిన తర్వాత మార్నింగ్ షోకే అంతా తారుమారు అయ్యింది.
Also Read: పెద్ద హీరోలతో తిరగడం కాదు… పెద్ద సినిమాలూ చేయాలి..
పొగడ్తలు కాపాడలేదు
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైలా’ (Laila) విడుదలయ్యింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించాడు అనే అంశం కంటే మరేదీ కొత్తగా లేదు అంటూ మార్నింగ్ షో పూర్తవ్వగానే ప్రేక్షకులు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. చిరంజీవి సైతం తనను దాటేశాడని, బాగున్నాడని ప్రశంసలు ఇచ్చినా మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా ప్రేక్షకులను మాత్రం ఇది మెప్పించలేకపోయింది. అంతే కాకుండా ఇలాంటి సినిమాకు చిరంజీవి ఇన్‌స్పిరేషన్ అని చెప్పడం మెగా ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ‘లైలా’ మూవీని సపోర్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.