BigTV English

Laila Movie Review : లైలా మూవీ రివ్యూ

Laila Movie Review : లైలా మూవీ రివ్యూ

Laila Movie Review : ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ వల్ల ‘లైలా’ సినిమా గురించి ఎక్కువ చర్చలు జరిగాయి. విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేశారు. మరి సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
సోనూ(విశ్వక్ సేన్) ఓల్డ్ సిటీకి చెందిన కుర్రాడు. తన తల్లి సహకారంతో తన ఏరియాలో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చే లేడీస్ ను తన మేకప్ మాయాజాలంతో అందంగా రెడీ చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇతను అందంగా రెడీ చేసిన ఒక అమ్మాయిని రుస్తుం(అభిమన్యు సింగ్) ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే తర్వాత ఆమె అందంగా ఉండదు. దీంతో ఆ విలన్ కి కోపం వస్తుంది. అందువల్ల సోనూ పై పగ పెంచుకుని అతన్ని చంపేయాలని అనుకుంటాడు. మరోపక్క ఒక పోలీస్ కి చెందిన భార్య సోనూ వద్ద మేకప్ వేయించుకోవడానికి వస్తుంది. అదే టైంలో సోనూ ఇంకొకరికి మేకప్ వేస్తూ ఉంటాడు. అయినా సరే ఆ పోలీస్ భార్య ముందుగా నాకు మేకప్ వేయాలని ఒత్తిడి చేసి సోనూతో గొడవ పెట్టుకుంటుంది. ఇది ఆ పోలీస్ వరకు వెళ్తుంది. దీంతో సోనూపై అతను కూడా పగబడతాడు. ఈ ఇద్దరి నుండి తప్పించుకోవడానికి ‘లైలా’ గా మారతాడు సోనూ? ఆ తర్వాత ఏమైంది? జెన్నీ(ఆకాంక్ష శర్మ) , సోనూ..ల లవ్ ట్రాక్ ఎలా మొదలైంది? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘లైలా’.

విశ్లేషణ :
గతంలో వచ్చిన ‘ఆగడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది’ అని..! ఈ మధ్య విశ్వక్ సేన్ నుండి వస్తున్న సినిమాలకి.. వాటికి అతను చేస్తున్న ప్రమోషన్స్ కి ఆ లైన్ కరెక్ట్ గా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. తన సినిమాలకి విశ్వక్ సేన్ ఏ రేంజ్లో ప్రమోషన్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ప్రమోషన్ చేసుకోవడంలో తప్పులేదు. సినిమాకి ఓపెనింగ్స్ తెచ్చేవి అవే. కానీ సరైన విధంగా సినిమాని ప్రమోట్ చేయాలి. తమ సినిమాలో ఏది హైలెట్ గా ఉంటుంది.. ఏ ట్రాక్ ఎలా ఉండబోతుంది వంటి వాటి గురించి చెబుతూ కొంచెం కొంచెం రుచి చూపించాలి. అప్పుడు ఆడియన్స్ ఏది బాగుంటుంది అని చెప్పాడో వాటికి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ‘పుష్ప 2’ గురించి గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ గురించి చిత్ర బృందం ముందు నుండి చెప్పుకుంటూ వచ్చింది. దానికి ఎంత మంది పనిచేశారు. ఎన్ని రోజులు తీశారు. ఇలాంటి ప్రమోషన్ సినిమాకి కావాలి. అంతేకాని ‘కేపీహెచ్ బి ఆంటీ’ ‘ఇంటర్నేషనల్ ఫిగర్’ అంటూ వైరల్ అవ్వడానికి చిల్లర ప్రమోషన్స్ చేసుకుంటే ఇలాంటి ఫలితాలే ఉంటాయి అనడానికి ‘లైలా’ ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


సినిమా ఫస్ట్ హాఫ్ లో చిల్లర కామెడీ ఉంది. టార్గెటెడ్ ఆడియన్స్ కి అది కొంతవరకు టైం పాస్ చేయించొచ్చు. కానీ మేటర్ లేకుండా, లాజిక్ లేకుండా కామెడీని ఎంత వరకు ఎంజాయ్ చేస్తారు. ఆడియన్ కొంచెమైనా దాన్ని రిలేట్ చేసుకోవాలి కదా. అందుకే ‘లైలా’ సెకండాఫ్ అంతా ఆడియన్స్ కి పెద్ద పరీక్ష పెట్టింది. చూడటానికి 2 పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ బాగుంది. నిర్మాత కథకి తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టాడు. కానీ కథ లేకుండా.. కథకి ఆడియన్ సరిగ్గా కనెక్ట్ కాకుండా ఉంటే ఎంత పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ నటన చాలా రెగ్యులర్ గా ఉంది. ‘లైలా’ పాత్రలో డబుల్ మీనింగ్ డైలాగులతో అతను కామెడీ పండించాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. దీనికంటే ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లో అలీ, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లో మంచు మనోజ్ బాగా చేశారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ ఆకాంక్ష గ్లామర్ తో మ్యానేజ్ చేయాలని చూసింది. సినిమాని ఎక్కువగా వార్తల్లో నిలిపిన 30 ఇయర్స్ పృథ్వీ ట్రాక్ కూడా పేలవంగా ఉంది. అభిమన్యు సింగ్ విలనిజం 10 ఏళ్ళ క్రితం అతను చేసిన ‘పండగ చేస్కో’ సినిమాల కంటే కూడా ఔట్ డేటెడ్ గా ఉంది. మిగిలిన నటీనటుల పాత్రలు కూడా ఎఫెక్టివ్ గా లేవు.

ప్లస్ పాయింట్స్ :

2 సాంగ్స్
ప్రొడక్షన్ వాల్యూస్


మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
డైరెక్షన్
సెకండాఫ్

మొత్తంగా.. ఈ ‘లైలా’ ని బాయ్ కాట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులే అవాయిడ్ చేసేస్తారు.

Laila Telugu Movie Rating : 0.25/5

Related News

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Big Stories

×