Bezawada Bebakka:బెజవాడ బేబక్క (Bezawada Bebakka) పరిచయం అవసరం లేని పేరు. కరోనా టైంలో తన రీల్స్‌తో బాగా ఫేమస్ అయిన ఆమెకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఏర్పడింది. జనరల్ కంటెంట్‌పైనే ఫన్నీ వీడియోలు తీస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. చిత్తూరు స్లాగ్‌లో మాట్లాడుతూ ఎంతో ఫేమస్ అయిన బెజవాడ బేబక్క బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బెజవాడ బేబక్క అసలు పేరు మధూ నెక్కంటి(Madhu Nekkanti). కరోనా టైంలో ఈమె మంచు లక్ష్మీపై చేసిన రీల్ బాగా వైరల్ అయింది. అయితే ఈమె కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాకుండా సింగర్, ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న బేబక్క మొదటి వారమే బయటకు వచ్చినప్పటికీ ఎంతో ఫేమస్ అయ్యారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ..
ఇక బిగ్ బాస్ తర్వాత పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈమె చేసిన వ్యాఖ్యల సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈమె ఎన్నో ఇంటర్వ్యూల సందర్భంగా తాను ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా ఖరీదైనదని, ఇతర గ్రహాల నుంచి తెప్పించుకొని తనకిష్టమైన వస్తువులను చేయించుకుంటున్నాను అంటూ సరదాగా చెప్పిన మాటలతో కూడా ఫేమస్ అయ్యారు. తాజాగా బేబక్క ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అబ్బాయిల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అబ్బాయిలంటే చిరాకు..
ఒక ఇంటర్వ్యూలో మీ జీవితంలోకి వచ్చే అబ్బాయి ఎలా ఉండాలి అంటూ ప్రశ్న ఎదురు కావడంతో ఈమె అబ్బాయిల గురించి మాట్లాడుతూ.. అబ్బాయిలు అంటే నాకు చాలా ఛీ”రాకు” అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా జీవితంలో అబ్బాయిలకు చోటు లేదని, షాకింగ్ కామెంట్స్ చేశారు. అబ్బాయిలంటే ఛీ”రాకు” దీనిని అబ్బాయిలకు అంకితం చేస్తున్నానంటూ ఈమె మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలోను తోడు అనేది అవసరం కదా అంటూ ప్రశ్న ఎదురవడంతో నాకైతే అవసరం లేదని తెల్చి చెప్పారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ ప్రశ్నించడంతో ఎందుకు ఉండవు ప్రతి ఒక్కరికి పాస్ట్ అనేది ఉంటుందంటూ ఈమె తెలిపారు.
మోటివేషనల్ స్పీకర్ గా…
ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా.. పెళ్లి గట్రా అయిందా అంటూ ఒక డైలాగ్ ఉంది పెళ్లి కాలేదు.. కానీ ఘట్రాలు చాలా ఉన్నాయండి అంటూ ఈమె కూడా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బెజవాడ బేబక్క ఇదివరకే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అయితే పెళ్లి అయిన వెంటనే కొన్ని కారణాలవల్ల విడిపోయారని తెలిసిందే. ఇక ఈ విషయం గురించి బిగ్ బాస్ వేదికపై నాగార్జున కూడా ఆమెను ప్రశ్నించారు. ఇలా నచ్చకపోవడం వల్ల విడిపోయాము అంటూ తాజాగా మరోసారి బేబక్క తెలియజేశారు. ఇకపై తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, ఇకపై రాదని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే మోటివేషనల్ స్పీకర్ గా కూడా పనిచేస్తా అంటూ ఈ సందర్భంగా బేబక్క తెలియజేశారు.
Also Read: Uday Kiran- Nani: నాని చేసిన పని ఉదయ్ కిరణ్ చేయలేకపోయారా? అందుకే ఈ పరిస్థితి వచ్చిందా?