Nani – Uday Kiran: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్(Uday Kiran) ఒకరు. చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. అనంతరం నువ్వు నేను సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగు లేకుండా పోయింది. ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవటం, సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ప్రొడక్షన్ హౌస్..
ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. అయితే తాజాగా నటుడు జాకీర్ హుస్సేన్(Zakir Hussain) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నేటితరం హీరోల గురించి మాట్లాడారు. ఈ జనరేషన్లో ఉన్న ఎంతోమంది హీరోలు ఒకవైపు హీరోలుగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతలుగా కూడా మారిపోయారు. ఉదాహరణకు నాని(Nani)ని తీసుకుంటే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడక్షన్ హౌస్(Production House) ద్వారా ఎన్నో సినిమాలను నిర్మిస్తూ గ్యాప్ లేకుండా కెరియర్లో ముందుకు వెళ్తున్నారు. ఇలా అప్పట్లో హీరోలు చేయలేదని జాకీర్ హుస్సేన్ తెలిపారు.
అవకాశాలు తగ్గిపోవడం..
ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ కూడా అప్పట్లో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదని, నాని చేసిన పని ఉదయ్ కిరణ్ చేయకపోవడం వల్లే నేడు ఆయన మన మధ్య లేరని తెలిపారు. కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేస్తూ ఉంటే ఇండస్ట్రీలో కెరియర్ ఉండదని కచ్చితంగా గ్యాప్ వస్తుందని, ఆ సమయంలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ జాకీర్ హుస్సేన్ తెలిపారు. అయితే ఇటీవల కాలంలో హీరోలు, హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మించడమే కాకుండా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా కూడా పనిచేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
ఇక ఉదయ్ కిరణ్ మొదటి సినిమాలతోనే మంచి సక్సెస్ కావడంతో చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్న విధంగానే వీరిద్దరి పెళ్లి గురించి ప్రకటించడమే కాకుండా ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇలా పెళ్లి గురించి చిరంజీవి ప్రకటించడంతో ఎంతోమంది దర్శక నిర్మాతలు ఉదయ్ కిరణ్ ఇంటి ముందు క్యూ కట్టారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అవ్వడం, పెళ్లి కూడా క్యాన్సిల్ కావడంతో ఉదయ్ కిరణ్ అవకాశాలన్నింటినీ కూడా కోల్పోయారు. అప్పుడే ఈయన నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇలా సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉదయ్ కిరణ్ మరణించారనే వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈయన మరణం వెనక గల కారణం ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు.
Also Read: Actress Himaja: కమిట్మెంట్స్ ఇస్తేనే సినిమా ఆఫర్లు.. హిమజ బోల్డ్ స్టేట్మెంట్!