Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం కాస్త రసవత్తరంగా మారింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాస్క్ లు ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ప్రతి వారం రేషన్ కోసం టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తాడు. అలాగే ఈ వారం కూడా సరికొత్త టాస్క్ లను ఇచ్చాడు.. రేషన్ కోసం కంటెస్టెంట్లు టాస్కులు ఆడారు. అందులో నిఖిల్ క్లాన్ నచ్చిన ఆహారాన్ని సంపాదించుకుంది. ఈ టాస్క్ లో అభయ్ టీమ్ ఓడిపోయింది. వాళ్లు సాధారణ రేషన్ వచ్చింది. ఇక ప్రభావతి 2. ఓ అంటూ పెట్టిన టాస్కుతో ఇంట్లో ఫిజికల్ వయలెన్స్ ఎక్కువైంది. ఎవరు ఎవరిని లాగేస్తున్నారు.. ఎవరు ఎవర్ని ఎత్తి పడేస్తున్నారన్నది అర్థం కాకుండా పోయింది.. ఈ క్రమంలో కొందరు అమ్మాయిలు కావాలనే సీరియస్ అయ్యాడు.
నిన్న బిగ్ బాస్ ఇచ్చినా బూర కొట్టు రేషన్ పట్టు టాస్కులో సంచాలక్గా సోనియా ఫెయిల్ అయిందన్న సంగతి తెలిసిందే. సోనియా చేసిన పనులు, నిఖిల్ అభయ్లు ఆడిన ఆట గురించి ఇంట్లో చర్చలు జరిగాయి. యష్మీ అయితే నిఖిల్ మీద, సోనియా మీద మండిపడింది.. ఇక సీత సోనియాకు సపోర్ట్ గా నిలిచింది తాను ఎక్కడ తప్పు చేసినట్లు కనిపించలేదు అని చెప్పింది. సోనియా నిర్ణయం వల్ల అభయ్ హర్ట్ అయ్యాడు. ఇంట్లో ఏ పని చేయమని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎవరి పనులు వాళ్లే చేయాలని చీఫ్గా ఆదేశాలిచ్చాడు. ఇది ఇంటి సభ్యులకు కాస్త నిరాశలు మిగిల్చింది. అభయ్ కోపం అతన్ని నామినేట్ చేసేలా చేస్తుందని అనుకోలేదు..
ఇదిలా ఉండగా గత వారంతో పోలిస్తే ఈ వారం ఫిజికల్ టాస్క్ లను ఎక్కువగా ఇచ్చాడు బిగ్ బాస్. టాస్కులు గెలిచిన శక్తి టీంకు సూపర్ మార్కెట్లో, ఓడిన కాంతార టీంకు జనరల్ మార్కెట్లో షాపింగ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. ఆ తరువాత సోనియా తన ప్రేమ కథను ప్రేరణకు చెప్పింది. తాను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదని చెప్పాడు. ఇక ఇండవ్ ప్రభావతి 2 అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. మణికంఠను నిఖిల్ ఎత్తి అవతల పారేశాడు. దీంతో మణి అక్కడే పడిపోయాడు. దీంతో బిగ్ బాస్ ఆటకు బ్రేక్ ఇచ్చాడు. మెడికల్ రూంకి రమ్మన్నాడు. ఇక మణికంఠకు బాగా లేదని రెస్ట్ తీసుకోమని అభయ్ చెప్పాడు. కానీ ఈ గేమ్ తనకు జీవితం అని, కచ్చితంగా ఆడతాను అని ఏడ్చేశాడు.. ఆ తర్వాత నబీల్, విష్ణు ప్రియా మధ్య వార్ మొదలైంది. నువ్వా నేనా అంటూ గొడవకు దిగారు. దాంతోవిష్ణు అక్కడ పదే పదే టచ్ చేశాడంటూ గొడవకు దిగింది. ఈ టాస్కు ఇంకా మధ్యలోనే ఆగినట్టు కనిపిస్తోంది.. మరి ఈరోజు టాస్క్ లో ఎలా ఉంటుందో చూడాలి.. మొత్తానికి బిగ్ బాస్ మూడో వారం నుంచి ఆట రసవత్తరంగా ఉంటుందని తెలుస్తుంది.. వంద రోజుల ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి..