IND vs BAN Gautam Gambhir Speaks on Dhruv Jurel-Sarfaraz Khan : బంగ్లాదేశ్ తో నేడు తొలిటెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ ఇండియాలో ఇద్దరు యువ క్రికెటర్లకు చోటు లేదని హెడ్ కోచ్ గౌతంగంభీర్ చెప్పకనే చెప్పాడు. వాళ్లిద్దరూ మరెవరో కాదు.. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్.. అయితే వారినెందుకు తీసుకోవడం లేదో కూడా వివరించి చెప్పాడు.
తుది జట్టులో 11మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది. సెలక్టర్లు 15 మందిని ఇచ్చారు. నలుగురు తప్పకుండా బెంచ్ మీద ఉండాల్సిందేనని అన్నాడు. అయితే చెన్నయ్ రెడ్ సాయిల్ పిచ్ పై ఆడగలిగే వారినే తీసుకుంటామని అన్నాడు. అక్కడ ఎవర్ ఫిట్ అయితే వారినే ఆడిస్తామని అన్నాడు.
నిజానికి రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. అందుకని తనకి తప్పకుండా చోటు ఉంటుంది. ఈ క్రమంలో స్టాండ్ బై గా ధ్రువ్ జురెల్ ని తీసుకున్నాం. అలాగే జట్టులో సీనియర్లు ఎవరైనా సరే, గాయపడినా లేదా అనివార్య కారణాల వల్ల ఆడలేకపోయినా సర్ఫరాజ్ వస్తాడని అన్నాడు.
వీళ్లిద్దరిలో బ్రహ్మాండమైన ప్రతిభ ఉంది. కాదనడం లేదు.. అలాగని తుదిజట్టులో ఎవరిని తీసి, ఎవరిని ఉంచినా మరొకరికి బాధగానే ఉంటుందని అన్నాడు. దీన్ని ప్రతీ ఆటగాడు క్రమంగా అలవాటు చేసుకోవాలని అన్నాడు. ఇది కూడా ఆటలో ఒక భాగమేనని అన్నాడు. ఒకానొక సమయంలో సీనియర్ క్రికెటర్లందరూ కూడా ఇలా బెంచ్ పై ఉండి వచ్చినవాళ్లేనని అన్నాడు.
Also Read: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు
అందరికీ అవకాశాలు వస్తాయి. అంతవరకు ఓపికగా ఎదురుచూడక తప్పదని అన్నాడు. ఇక స్పిన్ దళం రవీంద్ర జడేజా, అశ్విన్, కులదీప్ ఉన్నారు. వీరిలో అశ్విన్, రవీంద్ర ఇద్దరూ ఆల్ రౌండర్లు కావడం మన అద్రష్టమని అన్నాడు. వారు డిఫెన్స్ ఆడగలరు. దూకుడుగా కూడా ఆడగలరని అన్నాడు.
ఇకపోతే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జట్టులో ఉంటారని చెప్పేశాడు. గౌతంగంభీర్ చెప్పిన దాన్ని బట్టి టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండనుంది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లీ, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, కులదీప్, బుమ్రా, సిరాజ్