E-Paper
Advertisement

BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?

BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?
Advertisement

BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కోన్నేళ్లుగా బీఆర్ఎస్‌తో రహస్య పొత్తుల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించాలని డిసైడ్ అయ్యారా? బీఆర్ఎస్, బీజేపీలు ఒకదానికొకటి తోక పార్టీలే అన్న ప్రచారం గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఉద్ధృతమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను నిలబెట్టకపోవడం, బీజేపీ విజయం సాధించడంతో ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లైంది. ఆ క్రమంలో అసలు బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా తేల్చి చెస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను పెద్దగా ఖండించని బీజేపీ, ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్‌తో సీక్రెట్ మైత్రిపై వాయిస్ రెయిజ్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బీజేపీ నేతల ప్రకనలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం కనిపిస్తోందంటున్నారు.

బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలు

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌‌లది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ ముందు నుంచి విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు, ఇతరాత్ర అంశాలకు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావులను రక్షించడానికి బీజేపీ నేతలు బిఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని లబ్దిపొంతున్నారని కాంగ్రెస్ కీలక నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో కాళేశ్వరం కేసుకు సంబంధించి, కెసిఆర్, హరీష్‌లను సిబిఐ అరెస్టు చేయాలని, ఫార్ములా-ఇ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసి బీజేపీ తన నిబద్దత చాటుకోవాలని సవాల్ విసిరారు. గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పడు ఆ విమర్శలు ఎక్కువవుతున్నా ఇంతకాలం కమలనాథులు పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా బీఆర్ఎస్‌తో రహస్య బంధాన్ని ఆ పార్టీ రాష్ట్ర కీలక నేతలు కొట్టి పారేస్తున్నారు. బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సంక్షోభంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన కోసమా లేక కాళేశ్వరం అవినీతి కోసమా.. అసలు దేనికోసం బీఆర్ఎస్ లో ఉండాలన్న భావన ఆ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయిందని విశ్లేషించారు. అందుకే ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Turbo Stove: టర్బో స్టవ్.. దీనికి గ్యాస్ అవసరం లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

జేపీతో పొత్తు పేరుతో బీఆర్ఎస్ దుష్ప్రచారం

ఇలా తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను ఆపుకోవడానికి, తమ వారిని కాపాడుకోవడం కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఒక కొత్త ప్రచారానికి తెరలేపారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, కాబట్టి మీరెవరూ పార్టీ వీడొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండండని తండ్రీకొడుకులు బీఆర్ఎస్ నేతలను మభ్యపెడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీజేపీతో పొత్తు పేరుతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండడంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైందంటున్నారు. పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే కేడర్ లో నైతిక బలాన్ని నింపాలి, అందుకే బీజేపీతో తాము టచ్ లో ఉన్నామనే సంకేతాలను కేసీఆర్ ఇస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది, అందుకే ఏ స్థాయిలోనూ పొత్తు ఉండదనే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతోంది.

హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి ధారాదత్తం

Advertisement

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, కాబట్టి ఈ సారి కచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, భవిష్యత్తు బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై రామచందర్‌రావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని, ఇది బీజేపీ తుది నిర్ణయమని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు. తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు.

బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం

అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించినట్లైంది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతల ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ కు కొంత వరకు తెరపడినట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టడం ద్వారా, రాబోయే రోజుల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఇచ్చింది. అటు తమ పార్టీ నేతలు జారిపోకుండా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, ఇటు తమ బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ మధ్య ఈ పోరు రానున్న ఎన్నికల్లో ఎటు దారితీస్తుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు పొత్తులపై ఒక వైపు కేటీఆర్ లీకులు, బీజేపీ నేతల క్లారిటీలతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొందంట.

Story by Anup, Big TV

Also ReadLord Krishna: శ్రీ కృష్ణుడికి నిజంగా 16 వేల మంది భార్యలా..? అసలు నిజం ఏంటో తెలుసా

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×