BJP New Strategy: అన్నీ మంచి శకునములే పాత పాట. కానీ ఇదే పాట ప్రస్తుత తెలంగాణ బీజేపీ పాడుతోందా? ఈ ఫలితం సాక్షిగా.. ఇక అధికారమే పరమావధిగా కొనసాగుతోందా? కాంగ్రెస్ కి ప్రత్యామ్నయం తామేనంటూ.. సంకేతాలనిస్తోందా? ఏంటా కమల కుతూహల కథనం? లెట్స్ వాచ్..
వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల వ్యూహం
లేక, కమలనాథుల కూచాలు కదులుతాయా?ఎమ్మెల్సీ విజయంతో ఫుల్ జోష్ లో ఉందట కాషాయ దండు. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తోందట.. కమలం బ్యాచ్. చాపకింద నీరులా కనిపించకుండానే బలోపేతమవుతోందట. రానున్న స్థానిక ఎన్నికల సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నారట సంఘ్ పరివార సభ్యులు.
ఇటు బీఆర్ఎస్ పారని పాచికలు, అటు కాంగ్రెస్ వైఫల్యం వెరసీ..
ఇటు బీఆర్ఎస్ నేతలు వేస్తున్న పారని పాచికలు. అటు కాంగ్రెస్ వైఫల్యం వెరసీ.. తమ గళాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీస్కెళ్లడానికి కమలదళం.. భారీగానే సిద్ధపడుతోందట. గత సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను భారీగా గండి పడింది.. అధికారం అందని ద్రాక్షే అయింది బీజేపీకి.. అయినా సరే, తమ ఓటింగ్ శాతమైతే పెంచుకుంటూ వెళ్తున్నామని తెగ సంబర పడిపోతున్నారట స్థానిక కమలనాథులు.
ఈ ఎమ్మెల్సీ విజయంతో వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం రచించిన వ్యూహం సత్ఫలితాలను ఇవ్వడంతో.. వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ మెయిన్ టైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా అధికార పార్టీకి భారీగానే గండి కొట్టాలన్న టార్గెట్ పెట్టుకుంటోంది. ఇందుకు బీజేపీ ఇప్పటి నుంచే తన దారులను రహదారులుగా మార్చే యత్నం చేస్తోందట. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. సునీల్ బన్సల్.. కేడర్ ని ఈ దిశగా మరింత సమాయుత్తం చేస్తున్నారట. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. ఇందుకోసం కేంద్రం అందిస్తోన్న నిథులు.. వంటి అంశాలను ప్రజల్లోకి నేరుగా తీస్కెళ్లే విధంగా.. తగిన శిక్షణ నిస్తున్నారట. ఇందులో పడి బన్సాల్ అనుక్షణం తెగ బిజీగా గడుపుతున్నారట.
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్సీ గెలుపు ప్రభావం
పరుగెట్టలేకుంటే పాక్కుని వెళ్లు. అంతేగానీ వెళ్లడం ఆపకు. ఇవాళ కాకుంటే రేపటికైనా గమ్యం చేరేట్టు చూడు. ఈ పాలసినీ స్థానిక కమలనాథులు ఒకింత గట్టిగానే నమ్ముతున్నట్టు సమాచారం. దీంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్న తెలంగాణ బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఫుల్ జోష్ పెంచుకున్నట్టు ఫీలవుతోందట. దానికి తోడు బీజేపీ సాధించిన ఈ విజయం ఏమంత తక్కువ కాదనీ.. తెలంగాణ రాజకీయాల్లోనే పెను ప్రభావం చూపించే అవకాశముందనీ అంచనా వేస్తున్నారట.
ఉత్తర తెలంగాణ జిల్లాలపై పార్టీకి మరింత పట్టు పెరిగే ఛాన్స్
ఏది ఏమైనా తెలంగాణ కమలదళానికి ఈ ఎన్నికల ఫలితాలు అతి పెద్ద అడ్వాంటేజీగా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోందట. ఈ అంశంపై పార్టీలోనూ అంతర్గతంగా పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోందట. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపు ఆ పార్టీకి అత్యంత కీలకం కాబోతోందనీ.. ఈ టర్నింగ్ పాయింట్ తో ఉత్తర తెలంగాణ జిల్లాలపై పార్టీకి మరింత పట్టు పెరిగినట్టేనని అంచనా వేస్తున్నారట సంఘ సభ్యులు.
ఇప్పటికే ఉన్న 4గురు ఎంపీలు, 7గురు ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎమ్మెల్సీలు తోడు
ఇప్పటికే నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఈ ప్రాంతంలో.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా తోడు కావడం అన్నది ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఈ కూడికలు తీసివేతల కార్యక్రమం ద్వారా.. బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో పాగా వేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తోందట.
Also Read: బీహార్ ఎన్నికలకు కొత్త ఎజెండా.. ఆ ప్రాంతంలో సీతా దేవి ఆలయ నిర్మాణం
రాష్ట్రంలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న తలంపులో అధిష్టానం
ఇప్పటికే ఎమ్మెల్సీ గెలుపుతో.. ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకున్న కషాయ దళం.. తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ పట్టుబిగించి.. కాంగ్రెస్ ప్రత్యామ్నయం.. బీజేపీయే అన్న సంకేతాలనిస్తోందట. ఏనాటికైనా తమ కల నిజం చేసుకోడానికి గానూ కమలనాథులు గట్టిగానే తమ మెదళ్లకు పని పెడుతున్నారట.
కమల పరివార వ్యూహాలు ఫలిస్తాయా.. లేక, కమలనాథుల కూచాలు కదులుతాయా?
ప్రస్తుత గెలుపు ఉత్సాహానికి తోడు మరో వారంలో కొత్త అధ్యక్షుడి ప్రకటన కూడా తోడు కానుంది. కొత్త బాస్- కొత్త విజయాలను.. జోడు గుర్రాలుగా మార్చుకుని.. రాష్ట్రంలో ఎలాగైనా సరే పాగా వేయాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. మరి కమల పరివార వ్యూహాలు ఫలిస్తాయా? లేక అధిష్టానం పెట్టే టార్చర్ కి కింద స్థాయి కమలనాథుల కూచాలు కదులుతాయా? తేలాల్సి ఉంది.