Gundeninda GudiGantalu Today episode march 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే శృతి అక్కడికి వెళ్లి నువ్వు చేసింది ఇదేనా రోహిణి ఎందుకు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు మళ్లీ ఎందుకు వచ్చావు అని శృతి అడుగుతుంది. నేను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం బాలు అన్న మాటలే ఆ క్షణం నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు అసలు నేనేం చేశాను కూడా నాకు తెలియలేదు అంతగా నాకు నేను తెలియకుండానే వెళ్ళిపోయాను అని అంటుంది. మనోజ్ కి జాబ్ లేదని బాలు ఎన్ని మాటలు అన్నారో విన్నావు కదా అలాంటి మాటలు పడ్డ తర్వాత ఎలా ఉండాలనిపిస్తుంది శృతి అందుకే వెళ్ళిపోయానని అంటుంది రోహిణి. జాబు వెతుక్కోడానికి మనోజ్ వెళ్ళాడు లేదంటే జాబ్ రాకుంటే ఎంత చులకనగా చూస్తారో అర్థం చేసుకోవచ్చు అని రోహిణి అనగానే మీ నాన్న పెద్ద బిజినెస్ మాన్ కదా మీ పార్లర్ లోనే మీ ఆయన్ని సీఈఓ గా చేయొచ్చు మళ్లీ బ్రాంచీలు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీ మావయ్య బిజినెస్ మాన్ కదా ఆయన్ని అడిగి కాస్త డబ్బులు తీసుకొని కార్ షోరూమ్ పెట్టించొచ్చు కదా మళ్లీ తిరిగి డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి అంటుంది. ఇది విన్న ప్రభావతి మంచి ఐడియా లేస్తుంది అనేసి లోపలికి వెళుతుంది.. మనోజ్ కి ఇంకా ఉద్యోగం రాలేదని బాలు ఎద్దేవా చేస్తాడు.. మీనా కూడా బాలు పై మాట పడనివ్వదు.. కానీ మనోజ్ మాత్రం బాలుకి ఇంకా జాబ్ రాలేదని సెటైర్లు వేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి రాగానే ఏమైందిరా జాబ్ వచ్చిందంటే లేదమ్మా నేను అన్ని కంపెనీలు తిరిగాను వెతుకుతున్నాను కచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుందిలే అనేసి అంటాడు అప్పుడే రోహిణి పైనుంచి కిందికి వస్తుంది. మనోజ్ వెళ్లిన పని ఏమైంది అనగానే ప్రభావతి రోహిణి పక్కకు పిలిచి నేను ఇవన్నీ అడిగాను జాబ్ రాలేదని చెప్పాడు వెతుకుతున్నాడు కదా బాగా అలసిపోయాడు వెళ్లి కాఫీ ఇవ్వు అనేసి రోహిణి కి చెప్తుంది. బాలు ఎంట్రీ ఇచ్చి ఏంట్రా ఇప్పుడు కూడా జాబ్ రాలేదా అని ఎగతాళి చేస్తాడు.. నువ్వు జాబ్ పెట్టుకోవడం ఏమో కానీ నీకు ఇప్పట్లో జాబ్ రాదు ఇది ఫిక్స్ అయిపో నన్ను ఎన్ని మాటలు అన్నారు అలాంటి వాళ్ళకి ఇదే సరైన బుద్ధి అనేసి బాలు మనోజ్ కి నాలుగు తిట్లు పెడతాడు. చదువుకునే వాళ్ళకి అయితే జాబ్ గురించి తెలుస్తుంది ఇలా చదువు లేకుండా కారులో కూర్చొని దర్జాగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది జాబ్ గురించి చదువు గురించి అని ఎగతాళి చేస్తుంది.
నీ జాబ్ గురించి నాకెందుకు నాకేం అవసరం లేదు నేను వెళ్లి నా పని నేను చేసుకుంటాను నన్ను అన్నవాళ్ళకి మాత్రం ఇది బుద్ధొచ్చేలా ఉంటుంది పార్కులో పల్లీలను ఎంత ఈజీనో డ్రైవింగ్ చేయడం ఎంత కష్టమో తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదని రోహిణికి ఇండైరెక్టుగా వార్నింగ్ ఇస్తాడు.. ఇక మళ్లీ వెళ్లి మీనా కోసం స్వీటు ని తీసుకొచ్చి ఇస్తాడు. నాలాంటి వాడికి ఎలా సంపాదిస్తాడు ఎలా పోషిస్తాడు అని అన్నారు కదా ఇదే దానికి నిదర్శనమని స్వీట్ తీసుకొచ్చి మీనాక్షి పెడతాడు. తీసుకొచ్చింది 1/4 కిలో హల్వా కి 10 కేజీలు ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడని మనసులో అనుకుంటుంది. ఇక మీనా నాకు ఏ స్వీట్ వద్దండి వీళ్లంతా చూస్తుంటే ఎలా తినమంటారు అనేసి అంటుంది దానికి ప్రభావతి మాకేం వద్దు మీరే తినండి అంటూ సెటైర్లు వేస్తుంది..
ఇక రోహిణి పైకెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి బాధపడుతున్నావని ప్రభావతి అడుగుతుంది ఎలా బాధపడకుండా ఉంటాను ఆంటీ అని ప్రభావతితో అంటుంది వాడి గురించి తెలిసిందే కదా అమ్మ నా కడుపునిలాంటి వాడు పుట్టాడని నేనే బాధపడుతున్నాను. మీరు ఈ చెవిన వినేసి ఆ చెవిలో వదిలెయ్యాలి అని సలహా ఇస్తుంది.. ఇక సత్యం దగ్గరికి ప్రభావతి వచ్చి మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతుంది. బాలు గురించిన అంటే ఎప్పుడు నాకు వాడితోనే పనా వాడి గురించి మీకు చెప్తాను అని అంటుంది.
మౌనిక పెళ్లి చాలా రోజులైంది కదా తాళి మార్చాలి ఆ విషయం గురించి మీరు ఆలోచించలేదు అని అడుగుతుంది అప్పుడే మీనా ఎంట్రీ ఇచ్చి పెళ్లి అనేది మంచి విషయమే కదా అత్తయ్య ఇక పనిలో పని రోహిణి కూడా తాలు మారిస్తే బాగుంటుంది అని సలహా ఇస్తుంది. చూసావా మీనా కూడా ఎలాంటి సలహా ఇచ్చిందో అదేనమ్మ నేను మీ అత్తయ్య అనుకుంటున్నాము అంతలోకే రోహిణి వస్తుంది. అనను మలేషియా నుంచి రమ్మని చెప్పు నీకు తాళి మార్చాలి అని అంటాడు.
ఆ మాట వినగానే మా నాన్నకి ఇప్పుడు చెప్పడం కష్టం మాయయ్య నేను ఎలాగోలాగా పిలిపిస్తాను అని రోహిణి అంటుంది. ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్లి మలేషియా నాన్న గురించి ఇంట్లో తీసుకురమ్మని చెప్తున్నారు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతుంది నువ్వు వెంటనే ఏదో ఒకటి చేసి ఈ అబద్ధాన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది లేదంటే మాత్రం నువ్వు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అని విద్య సలహా ఇస్తుంది.. సత్యం మళ్లీ లెక్కలు వేస్తూ ఉంటాడు ప్రభావతి అక్కడికి వెళ్లి ఏంటండీ లెక్కలు తీసివేతలు చేస్తున్నారంటే నువ్వు మనోజ్ కి ఇంటర్వ్యూ కి వెళ్లడానికి రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తున్నావు 1000 రూపాయలు అవసరం లేదు కదా మరి నువ్వు ఎందుకు అంత చేస్తున్నావని ప్రభావతిని అరుస్తాడు. ఆ తర్వాత మౌనిక పుస్తెలతాడు చేయించడానికి రెండు లక్షలకు పైగా ఖర్చు అవుతుంది వాళ్ళ స్థాయికి తగ్గట్లు వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలి కాబట్టి రెండున్నర లక్షల మూడు లక్షల వరకు అవుతుందని లెక్కలు వేస్తాడు.
ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రభావతి అంటుంది దానికి రవి నేను హోటల్ పెట్టాలని ఆలోచిస్తున్నాను దాని గురించే డబ్బుల కోసం వెతుకుతున్నాను నాన్న నా దగ్గర అంత లేవు అనేసి అంటాడు. శృతి మాత్రం ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అంకుల్ అనేసి అంటుంది. చూశారా ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎందుకు పనికిరారు నా కోడలు చూశారా డబ్బులు అడగగానే డబ్బులు ఇస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడే బాలు వచ్చి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు నా చెల్లెలు పుస్తెలతాడు కోసం నేనే ఇస్తాను అని అంటుంది. 20000 30,000 కాదురా రెండున్నర లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అంత విన్నాను నా దగ్గర ఆ డబ్బులున్నాయి నేను అరేంజ్ చేస్తాను అనేసి బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..