E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 76 : తనూజ – దివ్యలకు నాగ్ మాస్ వార్నింగ్… భరణికి నాగబాబు, ఇమ్మాన్యుయేల్ కు అవినాష్ సీక్రెట్ హింట్స్

Bigg Boss 9 Telugu Day 76 : తనూజ – దివ్యలకు నాగ్ మాస్ వార్నింగ్… భరణికి నాగబాబు, ఇమ్మాన్యుయేల్ కు అవినాష్ సీక్రెట్ హింట్స్
Advertisement

Bigg Boss 9 Telugu Day 76 : బిగ్ బాస్ సీజన్ 9 డే 75 ఎపిసోడ్ లో ఎట్టకేలకు రీతూ కెప్టెన్ అయ్యింది. అలాగే నాగార్జున దివ్య వర్సెస్ రీతూ గొడవను గురించి మాట్లాడారు. ఎపిసోడ్ మొదట్లో శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. నిన్నటి మాన్స్టర్ టాస్క్ లో రీతూ, సుమన్ మిగలడంతో వాళ్లిద్దరి మధ్య టాస్క్ పెట్టారు. ‘కొన్ని అడుగుల దూరం’ అనే ఈ టాస్క్ లో సుమన్ ముందుగా జెండా అందుకున్నాడు. కానీ అతను సరిగ్గా టాస్క్ పూర్తి చేయకపోవడంతో కెప్టెన్సీ రీతూ చేతికి వెళ్లింది. అంతలోపు హౌస్ మొత్తం సుమన్ కు, డెమోన్ ఒక్కడు రీతూకి సపోర్ట్ చేసి ఓ రేంజ్ లో గొడవలు పడ్డారు. డెమోన్ రీతూ కోసం తనుజాతో ఫైట్ చేశాడు. చివరకు హౌస్ మొత్తం ఒక్కరికే సపోర్ట్ చేస్తారా? అని రీతూ బరస్ట్ అయ్యింది. చివరికి సంచాలక్ గా ఉన్న తనూజా నిర్ణయమే ఫైనల్ కాబట్టి రీతూకి కెప్టెన్సీ ఇచ్చేసింది. అదయ్యాక పెట్టిన పెయింట్ టాస్క్ లో తనూజ – ఇమ్మాన్యుయేల్ విన్ అయ్యారు.

తనూజాకు క్లాస్ పీకిన నాగార్జున 

నాగార్జున ఎంట్రీ ఇచ్చి తనూజా – దివ్య గొడవ గురించి ప్రశ్నించారు. “అసలు ఎవరిది తప్పు?” అని హౌస్ మేట్స్ ను అడగ్గా, భరణి – డెమోన్ తనూజాదే తప్పు అని చెప్పాడు. ఇమ్మాన్యుయేల్ మాత్రం దివ్యాదే తప్పు అని అన్నాడు. తనూజా స్టాండ్ తీసుకోవడం తప్పు కాదు. కానీ దివ్య ఆ హీట్ లో మాటలు వదిలేసింది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీంతో తప్పు ఎవరిదో ఇప్పుడే చూపిస్తా అని వీడియోను ప్లే చేశారు. అందులో స్పష్టంగా దివ్యదే తప్పు అని తేలిపోయింది. ఇక “మీ మధ్య అసలు భరణి ప్రస్తావన ఎందుకు వస్తోంది?” అని నాగార్జున తనూజను అడిగారు. మొన్న తన కాలికి భరణి బామ్ రాస్తుంటే దివ్య వచ్చి అరిచింది అని చెప్పింది తనూజా. “కెప్టెన్ అవ్వగానే పొగరు తలకు ఎక్కిందా ? హౌస్ మేట్స్ అందరూ అక్కడే ఉన్నారు. పొ అంటే ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆ గొడవను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇప్పుడు బరస్ట్ అయ్యావు. మాటలు వదిలేస్తే గేమ్ ను కూడా వదిలేసినట్టే. నువ్వు కూల్ గా నీ పాయింట్ ను పెట్టి ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా. ఆడే తీరును మార్చుకోకపోతే నీకే నష్టం” అని తనుజాకు వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. దీంతో తాను మార్చుకుంటానని సారీ చెప్పింది తనూజ.

Advertisement

నెక్స్ట్ దివ్యాను “భరణికి చెయ్యి స్టార్టింగ్ నుంచే ఉంది కదా. నువ్వు హెడ్ మసాజ్ చేయించుకున్నప్పుడు గుర్తు రాలేదా ?” అని అడిగారు. దివ్య స్పందిస్తూ “మధ్యలో తగిపోయిందని అన్నారు. కానీ మళ్ళీ కంప్లయింట్ చేశారు. అయినా ఆయనకే లేనిది నేను అరవడం వేస్ట్ అని నేను కూడా అరవడం వదిలేశాను” అంటూ తన నోటితో చేసిన తప్పును చెప్పేసింది దివ్య. భరణి లేచి నాకూ, తనుజాకు సేమ్ ట్రీట్మెంట్ చెప్పారు. దివ్యకు కూడా చెప్పాను అని అన్నారు. ‘గొడవంతా అయ్యాక చెప్పారు. నేను అది కావాలని చెప్పలేదు’ అని దివ్య అనేలోపే నాగార్జున అందుకున్నారు. “దివ్య నీకు ప్రాబ్లమ్ ఉంది. లేనప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అనేది ఎందుకు వచ్చింది? తప్పు నీతోనే మొదలైంది. ఒక్క తప్పు చాలు పాతాళానికి పడిపోవడానికి” అంటూ ఘాటుగా స్పందించారు నాగ్. దీంతో దివ్య చివరకు తన తప్పు ఒప్పుకుంది.

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీల సందడి 

నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ సందర్భంగా భరణి తల్లి, క్లోజ్ ఫ్రెండ్ నాగబాబు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. “మేము చాలా ఏళ్ల క్రితమే కలిశాము. అప్పుడు కోపంగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం గంగిగోవులా సాఫ్ట్ గా అయిపోయాడు. ఈ భరణి నచ్చలే. హౌస్ లోకి వచ్చేటప్పుడు పొరపాటున కూడా ఎవ్వరిని కొట్టొద్దు అని చెప్పాను. అది మనసులో పెట్టుకుని మరీ సాఫ్ట్ అయ్యాడు. ఇదస్సలు నచ్చలేదు. హౌస్ లో బాండింగ్స్ విషయంలో ఎలా ఉన్నావో ఆటను కూడా అలాగే ఆడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఊరికే ఉండకు” అని చెప్పారు నాగబాబు. అలాగే తమ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా వివరించారు. ఆయన వెళ్తూ వెళ్తూ టాప్ 5 లో భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనాలను పెట్టారు. అలాగే రీతూను బొమ్మరిల్లు హాసిని, భరణికి గజిని క్యారెక్టర్లు ఇచ్చారు.

Advertisement

తరువాత కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి తన తండ్రి లక్ష్మణరావు పడాల, తమ్ముడు బాలు భాస్కర్ వచ్చారు. కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు “ఏదో మారుమూల గ్రామంలో ఉంటూ డ్రైవర్ గా పని చేసుకునేవాడిని. అలాంటి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెడతాడు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి వాడిని పక్కనుండి చూసుకున్నది లేదు. ఓ ముద్ద తినిపించింది లేదు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ‘గేమ్ నువ్వు ఆడు, ఆడియన్స్ చూసుకుంటారు’ అంటూ బూస్ట్ ఇచ్చాడు కొడుకుకి. అలాగే కళ్యాణ్ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డ తన తండ్రే తన హీరో తండ్రే అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. టాప్ 5లో కళ్యాణ్, ఇమ్మూ, తనూజ, రీతూ, డెమోన్ లకు ఇచ్చారు. డెమోన్ షెకావత్, కళ్యాణ్ కు ‘కిక్కు కళ్యాణ్’ క్యారెక్టర్ ఇచ్చారు.

అలాగే ఇమ్మాన్యుయేల్ కోసం అతని బ్రదర్ తో పాటు గురువు ముక్కు అవినాష్ వచ్చాడు. టాప్ లో ఇమ్మూ, తనూజ, కళ్యాణ్, రీతూ, డెమోన్ లకు ఇచ్చాడు. ఈ పొజిషన్ లను బట్టి ఎవరితో ఫైట్ చేస్తే బెటర్ అనేది చూసుకోమని ఇమ్మూకి హింట్ ఇచ్చాడు. అలాగే తనూజకు కట్టప్ప, మహానటి క్యారెక్టర్లు ఇచ్చాడు. చివరగా తనుజా తాత వారణాసి రామశర్మ, చిన్నప్పటి ఫ్రెండ్ సలోని వచ్చారు. బాండింగ్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది చూసుకోమని హెచ్చరించారు.

Read also : ఏడవొద్దె ఇమ్మూ తల్లి… తనూజా వర్సెస్ దివ్య తగవు… కెప్టెన్సీ టాస్క్ రచ్చ రంబోలా

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×