BigTV English

MLC Kavitha: రగిలిపోతున్న కవిత.. జగిత్యాల నుంచి పోటీ?

MLC Kavitha: రగిలిపోతున్న కవిత.. జగిత్యాల నుంచి పోటీ?

ఢిల్లి లిక్కర్ స్కాం లో అరెస్టు అయి బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్నాళ్ళ మౌనం తరువాత ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే శాసనమండలి సమావేశాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదేసే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఒక్కసారి గెలిచి, రెండు సార్లు ఓడిపోయిన కవిత తండ్రి ఆశీస్సులతో ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారంట.

బెయిల్ వచ్చాక ఇన్ని రోజులు మౌనమే అన్నింటికి సమాధానం అన్నట్లు వ్యవహరించిన కవిత ఇప్పుడు తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన బతుకమ్మనే మరో సారి నమ్ముకొని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి సంప్రదాయ రూపమిచ్చి.. సెక్రటేరియట్‌‌లో అధికారికంగా ప్రతిష్టించింది. అయితే తెలంగాణ ‌తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని బీఆర్ఎస్ రచ్చ చేస్తుంది. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత ఏ సెంటిమెంట్‌ని తన‌ అస్త్రంగా రాజకీయాలకి వాడుకున్నారో.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని మరోసారి రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.


ప్రభుత్వం ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని.. కాంగ్రెస్ తల్లి అంటూ నిరసనలు తెలుపుతూ… బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ని ఒప్పుకోమని జగిత్యాల లో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి భూమిపూజ చేసారు. యితే జగిత్యాలలోనే ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని బీఅర్ఎస్ శ్రేణులు, జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కవిత జగిత్యాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుండే జగిత్యాల నియోజకవర్గం లో గ్రౌండ్ వర్క్ చేసుకుని జైత్రయాత్రకి సిద్దమవ్వాలని భావిస్తున్నారంట. అందుకే తరుచుగా జగిత్యాల బీఅర్ఎస్ లీడర్లతో‌ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారంట. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ , తెలంగాణ తల్లి సెంటిమెంట్ ని రగిల్చేందుకు బతుకమ్మ తో కూడి‌న తెలంగాణ ‌తల్లి ఏర్పాటుకు జగిత్యాలలోనే భూమిపూజ చేసారంట. అయితే ఆమె జగిత్యాలలో అంత యాక్టివ్ అయి. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వెనుక మరో కారణం ఉందని బీఅర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

Also Read: కరీంనగర్‌పై పొన్నం గురి.. గంగుల కోట బద్దలే

గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాలలో అన్ని తానై తన అనుంగు‌ అనుచరుడిగా పేరున్న సంజీవ్‌కుమార్‌ను కవిత గెలిపించుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని కవిత జీర్ణించుకోలేక పోతున్నారట. అప్పటి వరకు కాంగ్రెస్ ‌పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాలలో కాంగ్రెస్ ‌సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి‌ని‌ టార్గెట్ చేసి ఆయనకు కవిత చెక్ పెట్టగలిగారు. జగిత్యాలలో కంటి వైద్యుడిగా‌ మంచి పేరున్న డాక్టర్ సంజయ్ కుమార్‌ను బీఅర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం ‌చేసి జీవన్‌రెడ్డిని ఓడిస్తానన్న ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. బీఅర్ఎస్ అధికారం ‌కోల్పోవడంతో పాటుగా లిక్కర్ స్కాంలో కవిత అయిదునెలలు పైగా తీహార్ జైలుకు వెళ్లడంతో జగిత్యాల జిల్లా బీఅర్ఎస్ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే ‌సంజయ్‌కుమార్ కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరిపోయారు. సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఅర్ఎస్ క్యాడర్ ముఖ్యంగా కేటీఆర్, కవితలకు అస్సలు మింగుడు పడటం లేదంట.

తనకి అనుంగ అనుచరుడుగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన‌ సంజయ్‌కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన గెలుపు కోసం తాను పట్ట కష్టమంతా వృధా అయిందని కవిత ఫీలవుతున్నారంట. అందుకే జగిత్యాల నుండి తానే స్వయంగా బరిలోకి దిగి సంజయ్‌కుమార్‌ని ఓడించి జగిత్యాల గులాబీ పార్టీకి కంచుకోట అని నిరూపించాలని కంకణం కట్టుకున్నారంట. అందులో భాగంగా రానున్న రోజుల్లో జగిత్యాలలోనే మకాం వేసి కార్యక్రమాలు నిర్వహించేలా ఫ్లాన్ చేసుకుంటున్నారంట. మరి చూడాలి బెయిల్‌పై బయట తిరుగుతున్న కవిత ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో?

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×