BigTV English

Banned hollywood Movies : చాలా దేశాలలో ఈ భయంకరమైన సినిమాలు బ్యాన్… ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి

Banned hollywood Movies : చాలా దేశాలలో ఈ భయంకరమైన సినిమాలు బ్యాన్… ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి

Banned hollywood Movies : ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలను చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సినిమాలు చూడాలంటే భయంతో వనికిపోతాం. ఈ సినిమాలను తలుచుకుంటేనే నిద్ర కూడా పట్టదు. అంతటి భయంకరమైన హింస ఈ సినిమాలలో ఉంటుంది. హింస ఇలా కూడా ఉంటుందా అనే విధంగా ఈ సినిమాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలను చాలా దేశాలలో బ్యాన్ చేశారు. ఈ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


The Human centipede (ది హ్యూమన్ సెంటిపెడ్)

2009 లో వచ్చిన ఈ డచ్ ఇండిపెండెంట్ హర్రర్ మూవీకి టామ్ సిక్స్ దర్శకత్వం వహించారు. పర్యాటకులను కిడ్నాప్ చేసి, నోటి నుండి మలద్వారం వరకు వారిని శస్త్ర చికిత్స ద్వారా బంధిస్తారు. ఈ మూవీ ఒక జర్మన్ సర్జన్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో సెంటిపెడ్ సృష్టికర్త జోసెఫ్ హీటర్ పాత్రలో డైటర్ లేజర్ నటించారు. ట్రక్ డ్రైవర్ పొగరు చూసిన డైరెక్టర్ అతని మలద్వారానికి నోటిని కుట్టడం ద్వారా శిక్షించాలని, స్నేహితులతో వేసిన జోక్ నుండి ఈ మూవీ ఉద్భవించింది. ఈ మూవీ 30 ఆగస్ట్ 2009న లండన్ ఫ్రైట్‌ఫెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ ప్రదర్శనను నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్‌లో 30 ఏప్రిల్ 2010న పరిమిత థియేటర్లలో విడుదలైంది.


salo or 120days of sodom (సాలో 120 డేస్ ఆఫ్ సోడోమ్)

ఈ మూవీనకి 1975లో పీర్ పాలో పసోలిని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కొంతమంది అమ్మాయిలను, కొంతమంది అబ్బాయిలను తీసుకొచ్చి, వాళ్ళను భయంకరంగా టార్చర్ చేస్తారు. ఈ సీన్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. హింస ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని చాలా దేశాలలో బ్యాన్ చేశారు.

A night mare on elm Street (ఏ నైట్‌మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్)

ఈ మూవీకి శామ్యూల్ బేయర్ దర్శకత్వం వహించారు. 2010 లో వచ్చిన ఈ అమెరికన్ థ్రిల్లర్ మూవీలో హేలీ, కైల్ గాల్‌నర్, రూనీ మారా, కేటీ కాసిడీ, థామస్ డెక్కర్, కెల్లన్ లూట్జ్ నటించారు. ఈ మూవీని మైఖేల్ బే, ప్లాటినం డ్యూన్స్ నిర్మించారు.

The Texas chainsaw Massacre (ది టెక్సాస్ చైన్సా మస్సాక్రే)

1974లో విడుదలైన ఈ అమెరికన్ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీకి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మార్లిన్ బర్న్స్, పాల్ ఎ. పార్టైన్, ఎడ్విన్ నీల్, జిమ్ సిడోవ్, గున్నార్ హాన్సెన్ నటించారు. స్నేహితుల బృందం ఒక పాత ఇంటిని సందర్శించడానికి వెళుతున్నప్పుడు, నరమాంస భక్షకుల కుటుంబానికి చిక్కడంతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ హింసాత్మక కంటెంట్ కారణంగా పంపిణీదారులు కొనడానికి ముందుకు రాలేదు. చివరికి దానిని బ్రయాన్‌స్టన్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా దీనిని R అని రేటింగ్ ఇచ్చింది.

Hostel (హాస్టల్)

2005లో వచ్చిన ఈ భయంకరమైన మూవీకి ఎలిరోత్ దర్శకత్వం వహించారు. ఇందులో జే హెర్నాండెజ్, డెరెక్ రిచర్డ్‌సన్, ఐయోర్ గుజాన్సన్, బార్బరా నెడెల్జాకోవా నటించారు. ఈ మూవీలో ఒక బృందం అమెరికన్ పర్యాటకులను టార్గెట్ చేస్తుంది. అక్కడ వారు ఇతరులను హింసించడానికి, చంపడానికి వ్యక్తులను ఒక సంస్థకు తీసుకువెళతారు. ఈ మూవీ విమర్శకుల నుండి భిన్నమైన సమీక్షలను అందుకుంది. $4.8 మిలియన్ల బడ్జెట్‌తో నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా $82 మిలియన్లు వసూలు చేసింది. తరువాత హాస్టల్: పార్ట్ II హాస్టల్: పార్ట్ III కూడా వచ్చాయి.

 

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

Big Stories

×