IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో భాగంగా మేల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత ఆల్ రౌండర్లు సత్తా చాటుతున్నారు. ఈ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు {IND vs AUS} ఆస్ట్రేలియా జట్టు తన ఆధిపత్యం చెలాయించింది. అయితే మూడవ రోజు కూడా భారత జట్టు శుభారంభం చేయడంలో కాస్త విఫలమైంది. రెండవ రోజు 164 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు మూడవరోజు ఆరంభంలో కాస్త తడబడింది.
Also Read: Kohli – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..ముహుర్తం ఫిక్స్ ?
వికెట్ కీపర్ రిషబ్ పంత్ కేవలం 28 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 17 పరుగులు మాత్రమే చేసి ఎల్బిడబ్ల్యు గా వెనుదిరిగాడు. అనంతరం {IND vs AUS} బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఈ సిరీస్ లో నితీష్ కుమార్ బ్యాట్ తో ఎంతో కీలకమైన పరుగులు చేశాడు. లంచ్ విరామానికి 244 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టుకి కీలక పరుగులు అందించాడు.
మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాణిస్తున్నాడు. అయితే ఈ {IND vs AUS} నాలుగవ టెస్ట్ రెండవ రోజు ఆటలో కండోమ్ బెలూన్ కలకలం సృష్టించింది. రెండవ రోజు ఆటకి దాదాపు 87 వేల మంది అభిమానులు హాజరయ్యారు. అయితే ప్రేక్షకులలోని కొందరు ఆకతాయిలు కండోమ్ బెలూన్ ను మ్యాచ్ జరుగుతుండగా గాల్లోకి వదిలారు.
అయితే ఆ బెలూన్ మైదానంలోకి వెళ్లకుండా ప్రేక్షకుల స్టాండ్స్ వైపే గాల్లో చెక్కర్లు కొట్టింది. ఒకవేళ ఆ బెలూన్ మైదానంలోకి వెళితే {IND vs AUS} ఆటకు అంతరాయం కలిగేది. కానీ అది గ్యాలరీ వైపు ఉండడంతో ఆటకు ఎలాంటి అంతరాయం కలగలేదు. దీంతో ఈ బెలూన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Sachin Tendulkar: సచిన్ కు దక్కిన అరుదైన గౌరవం… చరిత్రలోనే తొలిసారి
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ {IND vs AUS} సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి మరోసారి భారత జట్టుని కష్టాల నుంచి గట్టెక్కించాడు. తన అరంగేట్రం మ్యాచ్ లోనే 41, 38 స్కోర్లు చేసి జట్టుకి కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టులలో మూడుసార్లు 40 స్కోర్ చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్ట్ లో 85 పరుగులు చేసి జట్టుని మరోసారి ఆదుకున్నాడు. అయితే ఇదే సమయంలో మూడవరోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీష్ (85*), సుందర్ (40*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. నితీష్ – సుందర్ 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Indian fans are busy watching whether the condom balloon will burst
Well played @durex#AUSvIND #MelbourneTest #Condom pic.twitter.com/iTlB0FHmQy
— Kartik Kannan (@kartik_kannan) December 27, 2024