Big Stories

CBI Arrests Kavitha: మొన్న ఈడి.. నేడు సీబీఐ.. కవిత పరిస్థితేంటి..?

Kavitha Arrested By CBI Inside Tihar Jail Over Liquor Policy Case: మాజీ సీఎం కేసీఆర్ కూతురు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నిందితురాలు. ఎమ్మెల్సీ కవిత  ఇప్పిటికే తీహార్‌కు చేరిన ఆమె.. ఇప్పుడప్పుడే బయటికి వచ్చే అవకాశమే లేదా? కటకటాలకే కవిత అంకింతం కానున్నారా? ఇప్పటి వరకు ఈడీతోనే తలప్రాణం తోకకొస్తున్న కవితకు ఇప్పుడు సీబీఐ రూపంలో మరో టెన్షన్ స్టార్టయ్యిందా? ఈడీ బెయిల్‌ ఇచ్చినా కవిత బయటికి రాలేరా? ఇంతకీ సీబీఐ అరెస్ట్‌తో కవిత ఎలాంటి రిస్క్‌లో పడ్డారు? కల్వకుంట్ల కవితకు సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ షాకచ్చింది. ప్రస్తుతం ఈడీ జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్‌ జైలులో ఉన్న కవితను.. ఇప్పుడు లెటెస్ట్‌గా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అరెస్ట్ చేసింది. అంటే ఆమె ప్రస్తుతమున్న సెల్‌లోనే అటు ఈడీ, ఇటు సీబీఐ నిందితురాలిగా ఉంది.

- Advertisement -

నిజానికి రెండు రోజుల క్రితం కోర్టు పర్మిషన్‌తో తీహార్‌లోనే కవితను విచారించింది సీబీఐ.. ఆ తర్వాత రౌజ్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ కవితను అరెస్ట్ చేసేందుకు అప్లై చేసుకుంది. కోర్టు వెంటనే అనుమతిచ్చింది. దీంతో ఇప్పుడు కవితను ఆఫీషియల్‌గా అరెస్ట్ చేసింది సీబీఐ. సో మళ్లీ ప్రొసిజర్ షురూ కానుంది. మళ్లీ రిమాండ్‌ కోసం పిటిషన్ వేయనుంది. ఆ తర్వాత కస్టడీ కోరనుంది. కోర్టు కనుక మళ్లీ కస్టడీ విధిస్తే.. ఈడీలాగానే. కవితను మళ్లీ సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈడీ ముడుపులపై కాన్సన్‌ట్రేట్ చేస్తే సీబీఐ కవిత వాట్సాప్‌ చాట్‌పై ఫోకస్ చేసింది.. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బుచ్చిబాబు ఫోన్ నుంచి అధికారులు వాట్సాప్ చాట్ రివకరీ చేశారు.. ఆ చాట్‌లో కవిత పేరు ఉన్నట్టు తెలుస్తోంది.. ఎట్ ది సేమ్ టైమ్.. ఆప్‌కు వంద కోట్ల ముడుపులు చెల్లించిన తర్వాత.. కొన్న భూముల డాక్యుమెంట్స్‌పై ఫోకస్ చేసింది సీబీఐ.. ఇప్పుడు వీటిపైనే కవిత నోటి నుంచి సమాధానాలు రప్పించే పరిస్థితి ఉంది.

- Advertisement -

సో ఓవరాల్‌గా చూస్తే కవిత ఈ కేసులో మరింత కూరుకుపోయినట్టు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది.ఇక్కడొక పాయింట్ ఉంది. ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు చార్జ్‌షీట్‌ వేయలేదు. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది.. అంటే ఆ రోజు నుంచి 90 రోజుల పాటు చార్జ్‌షీట్‌ వేసేందుకు టైమ్ ఉంది.. సో అప్పటి వరకు ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం దాదాపు లేనట్టే.. అంటే జూన్‌ వరకు ఇదే సీన్‌ ఉంటుంది. ఇప్పుడు అంటే ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసింది.. సో ఇప్పుడు సీబీఐకు 90 రోజుల టైమ్ ఉంది చార్జ్‌షీట్ వేసేందుకు.. అప్పటి వరకు కవిత బయటికి రాలేని పరిస్థితి.. అంటే ఈడీ కేసులో కవితకు బెయిల్ వచ్చినా.. సీబీఐ అరెస్ట్ చేసింది కాబట్టి.. ఆమె తీహార్‌ను విడిచి బయటికి రాలేని పరిస్తితి.. దీన్ని బట్టి చూస్తే కవిత కటకటాలను వీడి రావడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది.

Also Read: సీబీఐ అరెస్ట్.. ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరో షాక్..!

కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ ఈ నెల 16న విచారణ జరపనుంది.. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసిన లాభం లేని పరిస్థితి.  అయితే కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఆమె తరపు లాయర్లు.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారు? అనేది వారి క్వశ్చన్. మరి దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ మారింది. కవిత అరెస్ట్‌ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాతే కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది ఈడీ.. సేమ్ ఇప్పుడు సీబీఐ కూడా ఇదే పద్ధతిని రీపిట్ చేసే అవకాశం కనిపిస్తోంది.. త్వరలోనే కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది.

ఆయన కూడా బెయిల్ కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో సీబీఐ ఆయనను అరెస్ట్ చేస్తే పరిణామాలు మరింత మారడం ఖాయం కానుంది. కేజ్రీవాల్ కావొచ్చు.. కవిత కావొచ్చు.. వీరిద్దరికి బెయిల్ విషయంలో ససేమీరా అంటోంది ఈడీ.. ఎందుకంటే వీరు సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు. బయటికి వస్తే సాక్షులను బెదిరించే చాన్స్ ఉందంటున్నారు. కోర్టు కూడా వారి మాటలను అంగీకరిస్తోంది. బెయిల్‌ ఇవ్వడం లేదు. ఇప్పుడిదే బాటలో సీబీఐ నడుస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.  రీజన్స్‌తోనే వారికున్న డెడ్‌లైన్‌ను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉపయోగించుకునే చాన్స్ ఉంది. చివరి నిమిషం వరకు చార్జ్‌షీట్ వేసే అవకాశం కూడా లేదు. ఇన్‌కేస్ చార్జ్‌ షీట్ వేస్తే నిందితులు వెంటనే బెయిల్‌ కోరే అవకాశం ఉంది. అందుకే ఆ చాన్స్‌ ఇచ్చే మూడ్‌లో లేవు ఏజన్సీస్.. సో ఈడీ కావొచ్చు. సీబీఐ కావొచ్చు. ఇప్పట్లో చార్జ్‌షీట్ వేసే చాన్సేస్‌ అయితే దాదాపు సున్నా మరి అప్పటి వరకు కవిత, కేజ్రీవాల్ తీహార్ జైలు, రౌజ్ ఎవెన్యూ కోర్టు చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News