E-Paper
Advertisement

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!
Advertisement

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! అని అనుకుంటున్నారంట అంతా. అట్ల తయారయ్యిండ్రు మరి తెలంగాణ లీడర్లు. ఆ రెండు పార్టీలు ఏక్‌సే బడ్‌కర్‌ ఏక్‌ అన్నట్టుగ గోక్కునే రాజకీయాలను చేస్కుంట మస్తు టైం పాస్‌ చేస్తుండ్రంట. గా కేసీఆర్‌ ఫామ్‌హౌజుల పండుడేందో.. ఈ కేటీఆర్‌కు మొత్తం బాధ్యతలు అప్పగించుడేందో గానీ.. జనాల సమస్యలు గాలికొదిలి.. గెలుక్కునే రాజకీయాలకే మస్తు ప్రయార్టీ ఇస్తున్నడంట రామన్న.

బాజాప్తా అంటుండు ఏమని.. ! నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతనే ఉంటా!అని. గోకుడంటే నిలదీయ్యు.. ధర్నాలు చెయ్యు.. ప్రజలెదుర్కొంటున్న బాధల మీద ర్యాలీలు తియ్యు.. కానీ ఇట్ల పిట్ట గూట్లె గుడ్డు పెట్టినట్టు ట్విట్టర్‌లో ఏదో ఒకటి గెలికేటీ ముచ్చట్లు పెట్టి.. అధికార పార్టోళ్లను రెచ్చగొట్టి.. ఆళ్లతో మళ్లీ మళ్లీ గోకిచ్చుకుని.. అదే తిట్టుచ్చుకుని.. జనాలను మధ్యలో ఫూల్స్‌ను జేసే ఈ రాజకీయమేందే రామన్నా? అని అడుగుతుండ్రంట ఆ పార్టీ లీడర్లే.

Advertisement

ఒకళ్ల మీద ఒకళ్లు ఆరోపణలు చేసుకుంట.. నివ్విట్లంట కదా..? అట్లైందంట కదా? అంటూ పనికి రాని ముచ్చట్లు ముందేసుకుని డైవర్షన్‌ పాలిటిక్స్‌ను డైలీ చేస్తుంటే జనానికి యమ చిర్రెత్తుకొస్తుందంట నిజంగా. నాకు జరమొచ్చింది.. నేను బయటకు వస్తలేను.. అని ఇట్ల ట్వీట్‌ చేసిండో లేడో.. వెంటనే గా బల్మూరి వెంకటి ప్రెస్‌మీట్‌ పెట్టే.

నువ్వు ఎంటికలకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేపిచ్చుకుంటున్నవంట కదా. ఐదు కోట్లు వెట్టి అని  నెత్తి మీద ఎంటికల గురించి ఏకరువు వెట్టిండు. డ్రగ్స్ తీసుకుంటున్నవు కదా.. పరీక్షల్ల దొర్కద్దనే ఇదంతా చేస్తున్నవా? అని దీనికి మాల్‌ మసాల జోడించిండు. అంతే కాదుల్లో.. నువ్వు ఊకూకే గోకుడు గోకుడు అని అంటున్నవంట కదా.. ! నీకు ఇచ్చిగార్డు ఆయింట్‌మెంట్ ప్యాక్‌లు పంపుతున్న అని వాటినీ చూపిచ్చిండు.

Advertisement

ఇంకో కొత్త ముచ్చట కూడా జెప్పిండుల్లో. ఆ ఎంటుకలకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జేపిచ్చుకున్నందుకు ముఖమంతా వాసిపోయిందంట. అందుకే బయటకు వస్తలేడంట. అయ్యో ఇట్ల కూడా అయ్యిందా పాపం బిడ్డా..! అని జనం అనుకునేటట్టు. ఇగ తిక్కరేగినట్టుంది రామన్నకు. ఇంట్ల పండుకొనే మళ్లొక గుడ్డు పెట్టిండు ట్విట్టర్ల.

‘బతుకమ్మ పండుగ గిఫ్టు కింద రెండు పథకాలు కొత్తవి ఇద్దామనుకుంటున్నవట కదా రేవంత్‌ సాబ్‌.. ముబారక్‌..’ అన్నడు. ఇగో గిదేందీ.. నిజమేనా? అని జనం ఆశ్చర్యపోయి మొత్తం మెసేజీ చదివితే.. అండ్ల ఎటకారమే ఉంది. గదే.. తులం బంగారం, ఆడోళ్లకు 2500 పింఛన్‌ ఇస్తామన్నడు కదా.. అదెప్పుడు ఇస్తావు? అని అడిగే బదులు.. ఇగో ఇచ్చేస్తున్నడు జూడు ..! అని జనాలను హౌలగాళ్లను చేసుడుతో పాటు.. సీఎంను దెప్పిపొడిచినట్టు చేసిండన్నట్టు.

అవే రామన్నా.. గిదే ముచ్చట మీద జిల్లాలల్ల లొల్లి చేయరాదు మీ పార్టోళ్లతోని. గీ పనికిరాని ముచ్చట్లు , మెసేజులు పెట్టుకుంట.. గెలుకుడు రాజకీయాలు చేస్కుంట.. టైంపాస్‌ చేసుడేనా? అని జనం కూడా విసుక్కుంటున్నరంట. గెలిపించినందుకు ఆళ్లేమో అట్ల.. ఓడినందుకు కోపంతో నువ్వేమో ఇట్ల.. మీ బాపమో మా మీద అలిగి ఆ అర్రలకెళ్లి రాకపోతే ఎట్ల..? అని శాపనార్దాలు పెడుతున్నరంట తెలంగాణ జనం.

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

Big Stories

Advertisement
×