E-Paper
Advertisement

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!
Advertisement

iPhone Storage Tips: ఐఫోన్ వాడుతున్న చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫోన్ స్టోరేజ్ ఉన్నట్టుండి తగ్గిపోవడం. దీంతో ఎన్ని ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసినా స్టోరేజ్ మాత్రం పెరగకపోవడంతో చిరాకు వస్తుంటుంది. అయితే, దీనికి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే.. ఈ ఏఐ ఫీచర్లు మన ఐఫోన్‌లో ఏకంగా 6GB నుంచి 14GB వరకు స్టోరేజ్‌ను ఆక్రమించవచ్చు. ఒకవేళ ఈ ఫీచర్లు మీకు పెద్దగా అవసరం లేకపోతే.. వాటిని ఆఫ్ చేసి ఫోన్‌లో కొంత మెమరీని ఖాళీ చేసుకోవచ్చు. మరి యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా ఆఫ్ చేయాలి? దీనివల్ల ఎంత స్టోరేజ్ ఖాళీ అవుతుందో తెలుసుకుందామా..

ఎంత స్పేస్ మిగులుస్తుంది?

యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేయడానికి కొన్ని మోడల్స్ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ అవుతాయి. దీనివల్ల ఫోన్ మెమరీ చాలావరకు నిండిపోతుంది. రకరాకాల వెర్షన్లను బట్టి 5GB నుండి 14GB వరకు ఇది స్టోరేజ్ ఆక్రమిస్తుంది. మీరు ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసిన వెంటనే, ఆన్-డివైజ్ డేటా తొలగిపోయి మీ ఐఫోన్‌లో చాలా మెమరీ ఖాళీ అవుతుంది. తక్కువ మెమరీ ఉన్న ఫోన్ వాడుతున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడం చాలా తేలిక. మీ ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ‘యాపిల్ ఇంటెలిజెన్స్ & సిరి’ (లేదా కొత్త వెర్షన్‌లో సిరి) ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ కనిపించే మెయిన్ టాగుల్‌ను ఆఫ్ చేసి, కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్ > జనరల్ > ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్లి చూస్తే.. గ్రాడ్యువల్‌గా మెమరీ ఖాళీ అవ్వడం మీరు గమనించవచ్చు.

ఏయే ఫీచర్లు కోల్పోతారు?

Advertisement

యాపిల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ చేస్తే రైటింగ్ టూల్స్, నోటిఫికేషన్ సమ్మరీలు, ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్‌మోజీ, సిరి ఏఐ ఫీచర్లు పనిచేయవు. అయితే మీ ఫోన్ సాధారణ కాల్స్, మెసేజ్లు, కెమెరా వంటి రోజూవారీ పనులను ఎప్పటిలాగే వేగంగా పూర్తి చేస్తుంది. ఈ ఏఐ ఫీచర్లు వాడని వారికి వీటిని తీసేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.

తిరిగి ఆన్ చేయడం ఎలా?

ఒకవేళ భవిష్యత్తులో మీకు మళ్లీ ఈ ఏఐ ఫీచర్లు కావాలనిపిస్తే.. చాలా సులభంగా ఆన్ చేసుకోవచ్చు. మళ్లీ అదే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఫైల్స్ మళ్లీ డౌన్‌లోడ్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి.. మీ ఫోన్‌లో వైఫై కనెక్షన్, తగినంత ఖాళీ మెమరీ ఉంచుకోవడం మంచిది.

Also Read: మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

Tags

Related News

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

Big Stories

Advertisement
×