HP laptops: ప్రస్తుత డిజిటల్ కాలంలో ఒక మంచి ల్యాప్‌టాప్ ఉండటం అనేది అందరికీ ఎంతో అవసరం. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, కోడింగ్ లేదా గేమింగ్ కోసం పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నవారికి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్స్ , ల్యాప్‌టాప్ కేటగిరీలో నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచిన హెచ్‌పి అనేక మోడళ్లపై ఊహించని.. ధర తగ్గింపులను ప్రకటిస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో.. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టాప్ 5 హెచ్‌పి ల్యాప్‌టాప్ మోడల్స్ , వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
రోజువారీ ఆఫీస్ పనులు, స్టూడెంట్స్ ప్రాజెక్ట్‌ల కోసం హెచ్‌పి 15ఎస్ సిరీస్ ల్యాప్‌టాప్ ఎప్పుడూ టాప్ ఛాయిస్‌గా ఉంటుంది. స్లిమ్ డిజైన్, ఫాస్ట్ ఎస్ఎస్డీ స్టోరేజ్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని సొంతం. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకొని దీని ధర సుమారు రూ. 36,990 నుంచి రూ. 42,990 మధ్యలో లభిస్తుంది.
గేమింగ్ లవర్స్ హెవీ వీడియో ఎడిటింగ్ చేసే వారిని దృష్టిలో.. ఉంచుకొని తయారుచేసిన పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ ఇది. పవర్ ఫుల్ గ్రాఫిక్స్ కార్డ్, హై-స్పీడ్ ప్రాసెసర్ , 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు.సేల్ ప్రత్యేక డిస్కౌంట్‌తో ఈ మోడల్ ధర సుమారు రూ. 59,990 నుంచి రూ. 68,990 వరకు అందుబాటులో ఉంది.
మీరు ట్యాబ్లెట్ లాగా , ల్యాప్‌టాప్ లాగా రెండు విధాలుగా ఉపయోగపడే టచ్ స్క్రీన్ డివైజ్ కోరుకుంటే.. హెచ్‌పి పెవిలియన్ x360 పర్ ఫెక్ట్ ఆప్షన్. 360-డిగ్రీ రొటేటింగ్ హింజ్, స్టైలస్ పెన్ సపోర్ట్, ప్రీమియం సౌండ్ క్వాలిటీ దీనిలో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర సుమారు రూ. 54,990కే లభిస్తోంది.
Also Read: తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?
ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్లడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ లాప్‌టాప్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ బరువు, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ దీని సొంతం. ఈ సేల్‌లో ఈ లాప్‌టాప్ సుమారు రూ. 34,990 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
ప్రీమియం లుక్, మెటాలిక్ బాడీ , హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కోరుకునే ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి ఎన్వి సిరీస్ అద్భుతంగా పని చేస్తుంది. ఎండ్‌లెస్ స్పీడ్, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లు, అల్ట్రా-హై-డెఫినిషన్ స్క్రీన్ దీని ప్రత్యేకతలు. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లతో దీని ధర సుమారు రూ. 78,990 నుంచి ప్రారంభమవుతుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో హెచ్‌పి ల్యాప్‌టాప్ కొనేటప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగిస్తే.. అదనంగా ఇన్‌స్టెంట్ డిస్కౌంట్లు పొందొచ్చు. మీ బడ్జెట్ , అవసరాలకు తగిన బెస్ట్ హెచ్‌పి ల్యాప్‌టాప్‌ను ఎంచుకొని ఈ పండగ ఆఫర్లను వాడుకోండి.