హైడ్రా తీరుపై , రంగనాథ్ దూకుడుపై హైకోర్టు సీరియస్ అయినా.. సీఎం రేవంత్ లైట్ తీసుకుంటున్నారా? ఆయనను తప్పించి.. వేరొకరిని వెంటనే నియమించండని సీఎస్‌ను కోర్టు ఆదేశించినా.. రేవంత్ మాత్రం రంగనాథే కావాలంటున్నాడా? అవును.. ఇప్పుడు తాజా పరిస్థితులు గమనిస్తే సీఎం మదిలో ఇదే ఉందని తెలుస్తోంది.
హైడ్రా అంటేనే రంగనాథ్.. రంగనాథ్ అంటేనే హైడ్రా అనే విధంగా.. ఇది కొనసాగింది. సీఎం రేవంత్ దీనికి పురుడు పోసినా.. రేవంత్ ఉద్దేశ్యం.. హైడ్రా లక్ష్యం.. రెండింటినీ గమనించి.. ఆ దిశలోనే వందశాతం.. నిజాయితీగా దీన్ని ముందుకు తీసుకెళ్లాడనేది వాస్తవం. మధ్యలో కొన్ని వివాదాలు, ఆరోపణలు.. సహజంగానే వచ్చాయి.
కొంత మంది అధికారపార్టీ అనుయాయులు, ఎంఐఎంకు చెందిన కొందరు లీడర్ల విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని తన వ్యక్తిగతంగా వాడుకోవడానికి వినియోగించుకుంటున్నాడనే ఆరోపణలు వాస్తవదూరమనే చెప్పాలి. హైడ్రా అంటే ఓ భయం క్రియేట్ చేయగలిగాడు సీఎం. ఎందుకంటే.. హైదరాబాద్‌లో కబ్జారాయుళ్లకు అప్పటి వరకు అడ్డుకట్ట పడింది లేదు.
విశ్వనగరంగా మారుస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్‌లు కూడా నాలాల ఆక్రమణలను ఒక్కటంటే ఒక్కటి కూడా పదేళ్లలో తొలగించలేకపోయారు. రెండు సార్లు వరదలు వచ్చినప్పుడు అప్పటి హైదరాబాద్ పరిస్థితులు అందరికీ విదితమే. ఈ హైడ్రా ఏర్పాటు తరువాత ఆక్రమణదారులకు సింహాస్వప్నమైందిది. ఇందులో డౌట్ లేదు.
ఎక్కడబడితే అక్కడ ఎడాపెడా.. కబ్జా చేసుకునే వారికి పార్టీలతో సంబంధం లేకుండా ఓ భయాన్ని పుట్టించగలిగింది హైడ్రా. రంగనాథ్ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవారు కదా..? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కానీ రంగనాథ్ దీనికి వందశాతం న్యాయం చేశాడు. జనాల ఆమోదం పొందేందుకు తన వంతుగా సిన్సియర్‌గా ప్రయత్నించాడు. రేవంత్ ఉద్దేశ్యం కూడా అదే.
దీన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా సంపాదించాలనుకున్నారు.. అనే ఆరోపణలు నిజానికి ఓ రాజకీయ పరమైన ఆరోపణగానే చూడాలి. హైడ్రా అంటనే పులి మీద స్వారీ అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ స్వారీ పక్కాగా నడుస్తున్నది. జవాబుదారీతనాన్ని వీడలేదు. హైడ్రా అంటే ఆక్రమణదారులు ఎంతగా భయపడుతున్నారో.. ఇది పక్కదారి పట్టకుండా జనానికి అంతలా భయపడి రంగనాథ్ పనిచేశాడంటే అతిశయోక్తి కాదేమో.
కొన్ని సార్లు కోర్టుల కేసుల విషయంలో చూపిన దూకుడు వల్లే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నా.. కొన్ని తక్షణ నివారణ, ఫలితాల కోసం తీసుకున్న దూకుడు నిర్ణయమేనని రేవంత్‌కు తెలుసు, రేవంత్ నోటీసులో ఉండే రంగనాథ్ ఇవన్నీ చేస్తున్నాడనేది అందరికీ తెలుసు. రంగనాథ్ కాకుండా.. ఈ స్థానంలో ఇంకా ఎవరిని నియమించినా.. దీనికి ఇప్పటి వరకు ఉన్న క్రెడిబిలిటీ, భయం.. దూకుడు, అక్రమార్కులను కంట్రోల్ చేసే శక్తి.. ఉండకపోవచ్చనే భావనలో సర్కార్ ఉంది.
అందుకే అవసరమైతే కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకైనా రెడీ అవుతోంది సర్కార్. కోర్టు ధిక్కరణకు క్షమాపణలు కోరేందుకూ వెనుకాబోవద్దని డిసైడ్ అయ్యింది. పాత హైడ్రానే ఉండాలి. రంగనాథే కొనసాగాలి.. ఇదే ఇప్పుడు రేవంత్ మదిలో ఉన్నది. ఇదే జరగనుంది.