E-Paper
Advertisement

IBPS Clerk Vacancies: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు

IBPS Clerk Vacancies: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు
Advertisement

IBPS Clerk Jobs: ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2026 సంబంధించిన షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబిపిఎస్) విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (సిఎస్ఏ) ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 21, 2026 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం సంక్షిప్త నోటిఫికేషన్ మాత్రమే విడుదల అయింది. పూర్తి నోటిఫికేషన్ ఆగస్టు 1న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

నోటిఫికేషన్‌ జాగ్రత్తగా చదవండి

పూర్తి నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అవసరమైన అన్ని వివరాలు ఉంటాయి. ఖాళీల సంఖ్య, అర్హతలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్ష విధానం, సిలబస్ వంటి వివరాలను అందులో చూడవచ్చు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది. దీంతో దరఖాస్తు సమయంలో పొరపాట్లు జరగకుండా ఉంటుంది.

దరఖాస్తు తేదీలు

Advertisement

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21, 2026 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోపు అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేయాలి. అదే సమయంలో దరఖాస్తు ఫీజును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అప్లికేషన్ కరెక్షన్ విండోకు సంబంధించిన తేదీలను ఐబిపిఎస్ తరువాత ప్రకటిస్తుంది.

పరీక్షల షెడ్యూల్

ఐబిపిఎస్ తాత్కాలిక పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 2026లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 2026లో జరిగే మెయిన్ పరీక్షకు హాజరవుతారు. రెండు పరీక్షలు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో దేశవ్యాప్తంగా నిర్ణయించిన కేంద్రాల్లో జరుగుతాయి.

ప్రీ.. ఎగ్జామినేషన్ ట్రైనింగ్

Advertisement

అర్హత ఉన్న అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 2026లో ప్రీ..ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ ద్వారా పరీక్ష విధానం గురించి అవగాహన కల్పిస్తారు. ట్రైనింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.

సాలరీ, విద్యార్హత

ఈ ఉద్యోగానికి బేసిక్ పే రూ.24,000 వరకు ఉంటుంది (అంచనా). గ్రాస్ సాలరీ రూ.40,000 (అంచనా). కటింగ్స్ పోను టేక్ హోం రూ.37,000 వరకు ఉండొచ్చు. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.  వయో పరిమితి 20 నుంచి 28 మధ్య ఉండాలి.

ఫలితాలు, తుది ఎంపిక

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను నవంబర్ 2026లో ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం మెయిన్ పరీక్ష నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 2027లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇవ్వాలని ఐబిపిఎస్ ప్రణాళిక రూపొందించింది.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

దరఖాస్తు ఫీజు

ఎస్‌సి, ఎస్‌టి, పిడబ్లూబిడి, ఇఎస్ఎం, డిఇఎస్ఎం అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాలి. ఇందులో జిఎస్‌టి కూడా ఉంటుంది. ఇతర వర్గాల అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లింపు కూడా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటుంది.

అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు ప్రారంభానికి ముందే అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక ఐబిపిఎస్ వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలిస్తూ తాజా సమాచారం తెలుసుకోవాలి. ప్రస్తుతం సంక్షిప్త నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అర్హతలు, ఖాళీలు, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేయడం ఉత్తమం.

Related News

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..

రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు, వివరాలు బయటపెట్టిన కేంద్రం

క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా? జూలై 31 ఐటిఆర్ ఫైలింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి

జూలై 31న ఆదాయ పన్ను రిటర్న్ చివరి తేదీ.. గడువు పొడిగింపు ఉంటుందా?

ఒక TB డేటా లీక్.. బ్యాంక్ కస్టమర్లకు షాక్, డార్క్‌వెబ్‌లో డేటా ప్రత్యక్షం

పసిడి ప్రియులకు షాక్.. గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం-వెండి ధరలు

సీన్ రివర్స్.. రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తున్న భారత్.. విచిత్ర పరిస్థితి

Big Stories

Advertisement
×