E-Paper
Advertisement

ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!

ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!
Advertisement

Energy Crisis: యుద్ధాలకు, సంక్షోభాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడొచ్చినా.. ఆ తర్వాత సంక్షోభం కూడా బోనస్‌గా వచ్చేస్తుంది. యుద్ధం తాలూకూ ఇంపాక్ట్ నేరుగా పడకపోయినా, సంక్షోభం ప్రభావం మాత్రం ఏదో ఒక రూపంలో ప్రపంచంలోని ప్రతి మూలనా పడుతుంది. ఎప్పుడైతే.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తొలుత దాడి చేశాయో.. అప్పుడు యుద్ధం మాత్రమే మొదలైంది. ఫిబ్రవరి 28 నాటి దాడుల తర్వాత.. ప్రపంచంలో అతిపెద్ద ఇంధన సంక్షోభం నిజానికి ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కొనసాగుతున్నా, ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఫలించి.. యుద్ధం ముగిసిపోయినా, ఇప్పటికిప్పుడు ప్రపంచ ఇంధన సంక్షోభం ముగిసే అవకాశం లేదు. యుద్ధానికి ముందు క్రూడ్ ఆయిల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆ స్థాయికి పడిపోవడం అస్సలు సాధ్యపడదంటున్నారు.

హర్మూజ్ మూసివేతతో..

యుద్ధం మొదలవడానికి ముందు.. చమురు, గ్యాస్ చాలా చౌకగా, పుష్కలంగా దొరికాయ్. అప్పుడు.. వ్యాపారాలకు ఢోకా లేదు. సాఫీగా సాగాయ్. దాంతో.. ప్రజల ఆదాయం పెరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటికిప్పుడు వార్ ముగిసినా.. యుద్ధానికి ముందున్న పరిస్థితుల్ని పునరుద్ధరించడం అంత తేలిక కాదు. ఇందుకు అనేక కారణాలున్నాయ్. యుద్ధం సరిగ్గా నెలన్నర క్రితం మొదలైంది. ఆ తర్వాత హర్మూజ్ మూసివేతతో.. క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. అందువల్ల.. ప్రపంచంలో అసలైన చమురు కొరత ఇప్పుడే మొదలైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే.. సుమారు నెల రోజులు పడుతోంది. మార్చితో పోలిస్తే.. ఇకపై పరిస్థితి దారుణంగా ఉంటుంది. నష్టాలు డబుల్ అవుతాయనే అంచనాలున్నాయ్. ఇది అధిక ద్రవ్యోల్బణానికి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. త్వరలోనే.. అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై లిమిట్ రావొచ్చంటున్నారు. యుద్ధం మొదలయ్యాక చమురు ధరలు పెరిగాయ్. ఇప్పటిదాకా వచ్చిన ట్యాంకర్లు.. యుద్ధానికి ముందు లోడ్ చేసిన క్రూడ్ ఆయిల్‌నే తీసుకొచ్చాయ్. ఇప్పుడు.. చమురు ఉత్పత్తి బాగా పడిపోయింది. అందువల్ల.. ఇరాన్, అమెరికా ఓ ఒప్పందానికి వచ్చి, వెంటనే హర్మూజ్‌ని ఓపెన్ చేసినా.. ఆయుల్ ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు.

బొగ్గుతో పోలిస్తే గ్యాస్..

Advertisement

చమురు సంక్షోభంలో కొత్త దశ ఇప్పుడే మొదలైంది. పరిస్థితులన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నా.. క్రూడ్ ఆయిల్ సప్లై పునరుద్ధరణకు నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. ఈ కొరత.. ఈ ఏడాది చివరిదాకా కొనసాగుతుంనే రిపోర్టులు వస్తున్నాయ్. మిడిల్ ఈస్ట్‌లో శాశ్వత శాంతి నెలకొంటే, గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని వేగంగా పెంచగలవు. అయినప్పటికీ, ప్రస్తుతం గ్యాస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ దేశాలు ఎక్కువగా ఎల్‌ఎన్‌జీ వైపు మళ్లింది. ఐరోపాపై ఒత్తిడి తెచ్చేందుకు రష్యా ఈ పైప్‌లైన్‌లని ఓ ఆయుధంగా ఉపయోగించింది. అలా 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం తలెత్తింది. బొగ్గుతో పోలిస్తే గ్యాస్ చౌకగా, స్వచ్ఛంగా మారుతూ వచ్చింది. ఇంధన వినియోగంలో దాని వాటా పెరిగింది. ఇప్పుడది ఆగితే పరిస్థితులు ఎలా మారిపోతాయో.. ఇరాన్ యుద్ధం చూపిస్తోంది. ఇప్పుడు.. మొత్తం గ్యాస్ పరిశ్రమ విశ్వసనీయతే దెబ్బతింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో.. గ్యాస్ ధరలు చాలా నెలల పాటు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Also Read: కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

మరమత్తులకు సంవత్సరాలు..

Advertisement

ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. హర్మూజ్ జలసంధిని తెరవడం ఓ సమస్య అయితే, నెలన్నర పాటు జరిగిన బాంబు దాడుల్లో మిడిల్ ఈస్ట్‌లో దెబ్బతిన్న ఆయిర్ రిఫైనరీల్లో ఉత్పత్తిని పునరుద్ధరించడం మరో సమస్య. యుద్ధంలో దాడులతో.. గల్ఫ్‌లో 40కి పైగా చమురు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయని నివేదికలు చెబుతున్నాయ్. ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఆయిల్ రిఫైనరీల్లోని పరికరాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటికి.. స్పేర్ పార్ట్స్ ఉండవు. అందువల్ల.. మరమ్మత్తులకు నెలలు కాదు, కొన్నేళ్లు పడుతుందంటున్నారు. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయ్. ఇరాన్.. యూఏఈ, కువైట్, ఇరాక్‌లోని రిఫైనరీలు, ఆయిల్ ప్లాంట్లు, ఇతర ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయ్. వీటి రిపేర్లకే కొన్ని నెలల టైమ్ పట్టడమే కాదు, బిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది.

వరల్డ్ ఎకనమిక్ రిపోర్ట్‌లో..

యుద్ధం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగితే.. ఇంధన ధరలు పెరుగుతాయ్. దాని ఎఫెక్ట్‌తో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ కూడా హెచ్చరిస్తోంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా చమురు, గ్యాస్, ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే ఉంటే, ప్రపంచ వృద్ధి రెండు శాతం కంటే తక్కువకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ రిపోర్ట్‌లో తెలిపింది. దీనివల్ల ప్రపంచం ఆర్థిక మాంద్యానికి దగ్గరవుతుంది. 1980 తర్వాత నాలుగు సార్లు ఇలా జరిగిందని ఐఎంఎఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇటీవల, కోవిడ్ సమయంలోనూ ఈ పరిస్థితి కనిపించింది. మరోవైపు, పెరుగుతున్న జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేందుకు.. గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తి పెంచుకోవాలని యుద్ధానికి ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయ్. ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు కూడా ఆయిల్ పుష్కలంగా లభిస్తుందని, గ్యాస్ సప్లై కూడా పెరుగుతుందనుకున్నాయ్. కానీ, ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమ వనరులను అభివృద్ధిపై కాకుండా, తమ ఆయిల్ రిఫైనరీలను పునరుద్ధరించేందుకు, భవిష్యత్ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ముందుగానే ఖాళీ..

కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో ఏర్పడిన రెండు సంక్షోభాల కంటే.. ఈసారి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. వ్యూహాత్మక చమురు నిల్వల వినియోగం వల్ల.. భవిష్యత్ వనరులు ముందుగానే ఖాళీ అయ్యాయి. చమురు కొరతను అధిగమించడానికి, పాశ్చాత్య దేశాలు తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి రోజూ 10 నుంచి 12 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్‌కు చేరడం ఆగిపోయింది. దీన్ని భర్తీ చేసేందుకు వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి రోజూ 3 నుంచి 4 కోట్ల బ్యారెళ్లు విడుదల చేస్తున్నారు. అయినా, ఇవి కేవలం 4, 5 నెలల అవసరాలనే తీర్చగలుగుతాయ్. ఆ తర్వాత చమురు నిల్వలను తిరిగి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యూహాత్మక నిల్వలను తిరిగి సమకూర్చుకోవడం మొదలుపెడితే.. చమురు ధరలు మరింత పెరుగుతాయ్. ఇది.. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగేందుకు దారితీస్తుంది.

Also Read: ఇక్కడ నెల సంపాదన.. అక్కడ ఒక్క రోజులో.. డ్రైవర్ వీడియో వైరల్!

చరిత్రలోనే..?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. సో.. యుద్ధం ముగియడానికి ఇంకా టైముంది. 1970ల నాటి చమురు సంక్షోభం ద్రవ్యోల్బణానికి, రాజకీయ అశాంతికి దారితీసింది. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చంటున్నారు. ఇప్పటివరకు ఆసియా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. కానీ, ఈ సంక్షోభం యూరప్, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. చరిత్రలోనే.. అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి ప్రవేశించబోతున్నామనే విశ్లేషణలు.. ఆందోళనలు రేకెత్తిస్తున్నాయ్. ఇప్పటికే, హర్మూజ్‌ జలసంధిలో రాకపోకలపై యుద్ధ ప్రభావం పడటంతో.. ఇంధన ధరలు పెరిగాయ్. మరోవైపు.. శాంతి చర్చలు విఫలం కావడంతో యుద్ధం ముగియడంపై అనిశ్చితి నెలకొంది. దాంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి గాడి తప్పే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ చెబుతోంది. ఇందుకు.. చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లు చేరడమే తొలి సంకేతమంటోంది. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయ్.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1% మేర..!

రాబోయే కొన్ని వారాల్లో యుద్ధం ముగిసి, మిడిల్ ఈస్ట్‌లో ఇంధన ఉత్పత్తి, ఎగుమతులు సాధారణ స్థితికి వస్తే, ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంటోంది. ఇది గతంలో అంచనా వేసినా 3.3 శాతానికన్నా తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వస్తే, ఇరాన్ యుద్ధం వల్ల కలిగే ఇంధన సంక్షోభంతో బ్రిటన్ అత్యధికంగా ప్రభావితమవుతుందనేది ఐఎంఎఫ్ అంచనా. గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఎగుమతి దేశాల్లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధిలో భారీ తగ్గుదల కనిపిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1% మేర తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కూడా 8.6% మేర తగ్గుతుందని, వచ్చే ఏడాదే తిరిగి కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాదే మిడిల్ ఈస్ట్‌లోని చమురు ఎగుమతి చేసే దేశాలు కోలుకునే అవకాశం ఉందంటున్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల లబ్ధి పొందే దేశాల్లో రష్యా ఒకటని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది, వచ్చే ఏడాది రష్యా ఆర్థిక వ్యవస్థ 1.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

Storey By: Anup Big Tv

Also Read: మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×