Big Stories

Chhatrapati Shivaji: మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ!

Chhatrapati Shivaji Maharaj Jayanti

Chhatrapati Shivaji Maharaj Jayanti: భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. చర్చకు వచ్చే పేరు.. ఛత్రపతి శివాజీ. అచంచలమైన దేశ భక్తుడిగా, శత్రువుకు తలవంచని ధీరుడిగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా, పరమత సహనం గలిగిన ఉదారవాదిగా, గొప్ప మానవీయ విలువలకు ప్రతీకగా ఛత్రపతి శివాజీ మనకు కనిపిస్తాడు. మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి, మరాఠాల ఘనతను చాటిచెప్పిన వీరుడిగా, పౌరుషానికి ప్రతీకగా, పోరుబాటలోని యువతకు గొప్ప ఆదర్శంగా నిలిచిన మార్గదర్శి శివాజీ. నేడు ఆయన శివాజీ. ఈ సందర్భంగా ఆ మహావీరుడి జీవితంలోని కొన్ని మరుపురాని ఘట్టాలను స్మరించుకుందాం.

- Advertisement -

పుణె జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో క్రీ.శ 1630 ఫిబ్రవరి 19న షాహాజీ, జిజియా బాయి దంపతులకు శివాజీ జన్మించాడు. వీరిది భోస్లే.. అనే వ్యవసాయం చేసుకునే కులం. శివాజీ తల్లి దేవగిరి యాదవరాజుల ఆడపడుచు. చదువు, యుద్ధ విద్యలతో బాటు బాల్యం నుంచి తల్లి చెప్పిన రామాయణ, భారత గాథల మూలంగా యుక్తవయసు నాటికి శివాజీ గొప్ప వీరుడిగా, జాతీయ భావాలు గల దేశ భక్తుడిగా ఎదిగాడు. సమర్థ రామదాసు గురువుగా లభించటంతో ఆయన వ్యక్తిత్వం మరింత పరిమళించింది.

- Advertisement -

జాగీర్దారుగా ఉన్న తన తండ్రికి యుద్ధంలో ఎదురైన పరాజయాలను శివాజీ పాఠాలుగా మార్చుకుని తన 17వ ఏట తొలిసారి యుద్ధభూమిలో అడుగుపెట్టి బీజాపూర్‌ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను, 21వ ఏట కొండన, రాజ్‌గఢ్‌ కోటలను లూ శివాజీ వశమైపోయాయి. అనంతరం క్రమంగా పూణె ప్రాంతం మీద పట్టు సాధించాడు. తండ్రి అనుచరులుగా ఉన్న 2 వేల సైనికులకు తోడు మరో 8 వేల మందిని సైన్యంలో చేర్చుకొని బలమైన సేనను నిర్మించాడు. నిఘా విభాగం, ఆధునిక యుద్ధ తంత్రాలు, అప్పటికప్పుడు మారిపోయే యుద్ధనీతితో.. ఊహించని రీతిలో శత్రువు మీద మెరుపుదాడులు చేసి గెరిల్లా యుద్ధరీతిని ప్రపంచం ముందు చర్చకు ఉంచాడు.

Read more: నీళ్లు నమిలిన సోషల్ మీడియా దిగ్గజాలు.. టీనేజర్ల ఆత్మహత్యలపై అమెరికా పార్లమెంటులో రచ్చ

శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆది ల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపాడు. అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్‌ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ బీజాపూర్‌కు చెందిన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణె ప్రాంతాన్నంతా తన అధీనంలో తెచ్చుకున్నారు.

ఈ సమయంలోనే శివాజీ తండ్రిని మహమ్మద్ ఆదిల్ షా కుట్రపూరితంగా బందీ చేస్తాడు. కానీ.. ఆదిల్ షా సేనలను చిత్తుచేసిన శివాజీ, తండ్రిని విడిపించుకుని తానేంటో చెప్పకనే చెబుతాడు. దీంతో ఆదిల్ షా.. శివాజీని బంధించేందుకు మహావీరుడిగా పేరున్న అఫ్జల్ ఖాన్‌ను పంపుతాడు. అతడు.. శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీ ఆలయాన్ని కూలగొట్టించి యుద్ధానికి వచ్చేలా కవ్వించగా, శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని కబురు పెట్టి ప్రతాప్‌ఘడ్ కోటలో సమావేశం ఏర్పాటు చేయిస్తాడు.

అంగ రక్షకులు బయట వేచి ఉండగా, వీరిద్దరూ కోటలో సమావేశమైన సమయంలో అఫ్జల్ ఖాన్ తన ఒరలో దాచుకున్న కత్తితో శివాజీ మీద దాడి చేస్తాడు. కానీ.. శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి ఉండటంతో ఆ దాడి నుంచి బయటపడతాడు. ఆ పెనుగులాట సందర్భంగా శివాజీ పులిగోర్ల పిడితో అఫ్జల్ ఖాన్‌ పొట్టను చీల్చగా, అతడు తప్పించుకొని పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ… అఫ్జల్ ఖాన్ తలను నరుకుతాడు. అనంతరం బీజాపూర్ సుల్తాను.. అఫ్ఘానిస్థాన్ నుంచి తీసుకొచ్చిన యుద్ధ వీరులతో శివాజీ మీద దాడిచేయగా శివాజీ అతడి సేనలకు అడవిలో దిగ్బంధం చేసి సుల్తాన్ సేనలను మట్టి కరిపిస్తాడు.

దీంతో అవమానం పాలైన బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా నుంచి పదివేల మంది కిరాయి సైనికులను పిలిపించి, శివాజీ మీదకు పంపగా శివాజీ తన 5 వేల మంది మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద వారిని ఎదుర్కొని ఒక్కడినీ మిగలకుండా చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా శివాజీ పేరు మారుమోగిపోవటమే గాక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దక్కనులో శివాజీ విజృంభణ ఢిల్లీ దిశగా సాగుతుందనే భయంతో తన మేనమామ పహిస్తా ఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా లాభం లేకపోయింది. దీంతో 1666లో తన 50వ పుట్టిన రోజు వేడుకల పేరుతో ఔరంగజేబ్.. శివాజీని, అతని ఆరేళ్ల కుమారుడు శంభాజీని ఢిల్లీకి ఆహ్వానించి ఆగ్రా కోటలో బంధించగా, శివాజీ చాకచక్యంతో కుమారుడితో సహా అక్కడి నుంచి బయటపడతాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆధునిక ఆయుధాలను, గొప్ప అశ్విక, నావికా దళాన్ని ఏర్పరచాడు.

1674 జూన్‌ 6న రాయగఢ్‌ కోటలో వేదోక్తంగా క్షత్రియ రాజులంతా కలిసి శివాజీకి పట్టాభిషేకం చేసి, ‘ఛత్రపతి’ అనే బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్ళకు శివాజీ 50 వేల బలగాలతో దక్షిణాదిలోని వెల్లూరు తదితర ప్రాంతాల మీద దాడి చేసి వాటిని వశం చేసుకున్నాడు. ఇలా.. 27 సంవత్సరాల పాటు అనేక యుద్ధాలను చేసిన శివాజీ సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, విదేశీ పాలకుల మూలంగా భారతీయ సంస్కృతికి హాని కలగకుండా చేయగలిగాడు.

సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ అన్యమత ప్రార్థనా స్థలాలను గానీ, పరాజితుల కుటుంబ సభ్యులను, సేనలను చంపటం గానీ శివాజీ చేయలేదు. శివాజీ సైన్యంలో ముస్లింలది ప్రధాన పాత్రగా ఉండేది. జీవితాంతం ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీ వెంటే వారంతా చివరి వరకు అండగా నిలిచారు. పాలకుడిగా నిస్వార్థంగా పనిచేయటం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయనను ఒక ఆదర్శపురుషుడిగా, గొప్ప యోధుడిగా సమాజం ముందు నిలిపాయి. ధర్మ సంరక్షణ, మాతృభూమి విముక్తికై జీవితాంతం పోరాడిన ఆ మహా యోధుడు మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్‌ 3 మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్‌ కోటలో శివైక్యం చెందారు. ఆయన జీవించింది కేవలం 57 సంవత్సరాలే అయినా.. ఆయన తన ఇచ్చిన స్ఫూర్తి భారతావనికి నేటికీ దారి చూపుతూనే ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News