OTT Movie : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరెన్నో కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని పాత సినిమాలను కూడా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఈ సినిమాలలో ఉండే కంటెంట్ కారణంగానే వాటిని మళ్ళీ చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చింది. ఇది ఒక జంట ప్రేమలో పడి, కొకైన్ డ్రగ్స్ దొంగతనం చేసి, మాఫియాతో గొడవల్లో చిక్కుకునే ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ట్రూ రొమాన్స్’ (True romance) 1993లో వచ్చిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. టోనీ స్కాట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టియన్ స్లేటర్, ప్యాట్రిషియా, డెన్నిస్ హాపర్, గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1993 సెప్టెంబర్ 10న విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో 7.9/10 రేటింగ్ ని పొందింది.
క్లారెన్స్ అనే ఒక యువకుడు, కామిక్స్ షాపులో పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు అతను అలబా అనే అమ్మాయిని సినిమా థియేటర్లో కలుస్తాడు. అలబా ఒక కాల్ గర్ల్, కానీ వాళ్లు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. మూడు రోజుల్లో వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటారు. అలబామా ఒకప్పుడు డ్రగ్స్ ని కూడా డీల్ చేస్తుండేది. ఇప్పుడు తన పాత బాస్ అయిన డ్రే దగ్గర నుంచి కొకైన్ సూట్‌కేస్ తీసుకుని అతన్ని చంపేస్తుంది. ఆ కొకైన్ తీసుకుని క్లారెన్స్, అలబామా లాస్ ఏంజిల్స్‌కు పారిపోతారు. ఆ తరువాత వాళ్లు ఆ డ్రగ్స్‌ను అమ్మి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు.
Read Also : మ్యాటర్ లేనోడి మీద పడే అమ్మాయిలు… టెంప్ట్ చేస్తూ ప్లే బాయ్ లా మార్చి … ఒక్కో సీన్ అరాచకమే