BigTV English

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు.. కారణం ఏంటంటే?

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు.. కారణం ఏంటంటే?
Thalapathy Vijay Latest news

Changes in Thalapathy Vijay’s Political Party Name: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇటీవలే ఫిబ్రవరి 2న ‘తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే ఇప్పటికే తాను కమిటైన రెండు సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ప్రజలతో మమేకమైపోతానని విజయ్ తెలిపాడు. వచ్చే తమిళనాడు లోక్‌‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని వెల్లడించాడు.

అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా తాను ప్రకటించిన కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ పెట్టిన కొత్త పార్టీ పేరులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఈ పార్టీ పేరులో మరొక అక్షరాన్ని జోడిస్తున్నట్లు సమాచారం. ‘క్’ అనే అక్షరాన్ని ఈ పార్టీ పేరులో యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు గల కారణం కూడా ఉంది. ఈ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ పేరును ఇంగ్లీష్‌లో ‘టీవీకే’ అని పిలుస్తున్నారట.

Read More: కొత్త పార్టీ ప్రకటించిన హీరో విజయ్.. పేరు ఏంటంటే..?

దీంతో తమిళనాడులోని కొన్ని పార్టీల నుంచి కొంత వ్యతిరేకత వస్తోన్నట్లు సమాచారం. అంతేకాకుండా తమిళనాడులో ‘తమిళగ వాల్వురిమై కట్చి’ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీ ఉందని తెలుస్తోంది. ఇక ఆ పార్టీని కూడా ఇంగ్లిషులో ‘టీవీకే’ అని పిలుస్తున్నారు.

దీంతో ఈ రెండు పార్టీలను ఇదే పేరుతో పిలుస్తుండటంతో వాళ్లు విజయ్ పార్టీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అందువల్లనే విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరులో ‘క్’ అక్షరాన్ని కలపాలని నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ అక్షరాన్ని జోడించిన తర్వాత విజయ్ పార్టీ పేరును ‘తమిళగ వెట్రిక్ కళగం’ అని పిలవనున్నారు.

Read More: తలపతి విజయ్ టార్గెట్ 2026.. మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

ఇకపోతే విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ మూవీ చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ తర్వాత విజయ్.. వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×