BigTV English

AP CM Jagan Mohan Reddy: ప్రచార సభలో సీఎం జగన్ భావోద్వేగం!

AP CM Jagan Mohan Reddy: ప్రచార సభలో సీఎం జగన్ భావోద్వేగం!

YS Jagan latest Comments(Political news in AP) : పులివెందుల అంటే తనకు ప్రాణం.. ప్రతి కష్టంలోనూ తనతో నడిచిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఏపీ సీఎం జగన్ భావోద్వేగంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పులివెందుల అంటే అభివృద్ధి అని.. అయితే, ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్ అని.. ఆయన బాటలోనే తమ ప్రభుత్వం ముందుకు సాగిందంటూ ఆయన అన్నారు.


తమ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిందని ఆయన అన్నారు. అయితే, వైఎస్సార్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలో భాగంగా వైఎస్సార్ వారసులమంటూ కొందరు వస్తున్నారని.. అయితే, ఆ మహానేతకు నిజమైనా వారసులెవరో చెప్పాల్సింది ప్రజలేనని జగన్ అన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని.. కుట్రలు పన్నేవారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.

పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ వేలెత్తి చూపిస్తున్నారని… మంచి చేయడం, మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్ అంటూ జగన్ పేర్కొన్నారు.


Also Read:చింతమనేనికి తీరిన చింత..

ఇటు పరిపాలన, పథకాలు, సంక్షేమంలో జగన్ ను ఎవరూ కొట్టలేరని.. ఏ రంగంలోనైనా జగన్ కంటే ఎక్కువ చేశామని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పరిపాలన అందించామని, పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చాడని.. అందుకే మరింత మంచిగా అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు.

Tags

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×