China DeepSeek: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ చాట్‌బాట్ డీప్‌సీక్.. ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా.. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్ ఇప్పుడో సంచలనం. కానీ.. ఇప్పుడదే చాట్ బాట్ ఇండియా విషయంలో కాంట్రవర్శీగా మారుతోంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై అడిగిన ప్రశ్నలకు.. డీప్ సీక్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.
చాట్ జీపీటీ.. ఏఐ వరల్డ్‌లో అదో సంచలనం. ఆ తర్వాత చాలా ఏఐ చాటా బాట్స్ వచ్చాయ్. కానీ.. ఇప్పుడు చాట్ జీపీటీనే తలదన్నేలా వచ్చింది డీప్ సీక్. ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి.. అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్‌ఏఐతో పోలిస్తే.. ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనే మాట వినిపిస్తోంది. పైగా.. వాటి కంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది. ఇదే.. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండికొట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే.. అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఫ్రీ యాప్‌గా డీప్‌సీక్ రికార్డ్ సృష్టించింది. అలాంటి ఏఐ టూల్.. ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది.
చైనా మేడ్ చాట్ బాట్ డీప్‌సీక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇటీవల.. మన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు.. తిక్క సమాధానాలిస్తోంది. భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు గురించి అడిగితే.. ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరముంది అని ఆన్సర్ ఇస్తోంది. ఇదే ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే సరైన సమాధానం ఇస్తోంది. ఇక.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లోని రాష్ట్రమా? అనే ప్రశ్నకు.. డీప్ సీక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇది ప్రస్తుతం.. నా పరిధిలో లేని అంశం, వేరే ఏదైనా మాట్లాడదామంటూ దాటవేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పని అడిగినా.. అదే సమాధానం ఇస్తోంది.
ప్రస్తుతం.. ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇవి మాత్రమే కాదు.. దలైలామా గురించి చెప్పమని అడిగినా.. అడ్డగోలు ఆన్సర్స్ ఇస్తోంది. దలైలామా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానం ఇచ్చింది డీప్ సీక్. కొన్ని శతాబ్దాల కిందటి నుంచే.. టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతోంది. యూఎస్-చైనా రిలేషన్స్ గురించి అడిగితే.. రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరని అడిగితే కూడా.. డీప్ సీక్ చెప్పలేకపోతోంది. ఇంకా తనని అప్ డేట్ చేయలేదని ఆన్సర్ ఇస్తోంది. ఇలా.. కొన్ని కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటేస్తోంది.
భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్.. తమ భూభాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లెయిమ్ చేసింది. అది.. సౌత్ టిబెట్‌లో అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. ఇప్పుడు.. అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ చాట్‌బాట్ డీప్‌సీక్ నిరాకరించింది. దీనికి సంబంధించిన పోస్టులు.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయ్. అయితే.. వరల్డ్ వైడ్‌గా ఉన్న డీప్ సీక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగానా ఈ చాట్ బాట్ వెంటనే సమాధానం ఇచ్చేస్తోంది.
ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు? ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక.. వైట్ హౌజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు.. రెప్పపాటు వ్యవధిలో టకటకా ఆన్సర్స్ ఇచ్చేస్తోంది డీప్ సీక్. కానీ.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటేస్తోంది. మరీ.. ముఖ్యంగా చైనా విధానాలు, వివాదాలు, సంఘర్షణలని అస్సలు ప్రస్తావించడం లేదు. చైనా విధానాలకు తగ్గట్లుగానే సమాధానాలు ఇస్తోంది. ముఖ్యంగా.. చైనా వ్యతిరేక అంశాల్ని అస్సలు చెప్పడం లేదు డీప్‌సీక్ చాట్‌బాట్.
Also Read: గాజా యుద్ధం మళ్లీ మొదలు?.. నెతన్యాహుపై రాజకీయ ఒత్తిడి
చాట్ జీపీటీ.. ఏఐ వరల్డ్‌లో అదో సంచలనం. ఆ తర్వాత చాలా ఏఐ చాటా బాట్స్ వచ్చాయ్. కానీ.. ఇప్పుడు చాట్ జీపీటీనే తలదన్నేలా వచ్చింది డీప్ సీక్. ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి.. అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్‌ఏఐతో పోలిస్తే.. ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనే మాట వినిపిస్తోంది. పైగా.. వాటి కంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది. ఇదే.. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండికొట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే.. అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఫ్రీ యాప్‌గా డీప్‌సీక్ రికార్డ్ సృష్టించింది. అలాంటి ఏఐ టూల్.. ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది.
చైనా మేడ్ చాట్ బాట్ డీప్‌సీక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇటీవల.. మన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు.. తిక్క సమాధానాలిస్తోంది. భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు గురించి అడిగితే.. ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరముంది అని ఆన్సర్ ఇస్తోంది. ఇదే ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే సరైన సమాధానం ఇస్తోంది. ఇక.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లోని రాష్ట్రమా? అనే ప్రశ్నకు.. డీప్ సీక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇది ప్రస్తుతం.. నా పరిధిలో లేని అంశం, వేరే ఏదైనా మాట్లాడదామంటూ దాటవేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పని అడిగినా.. అదే సమాధానం ఇస్తోంది.
ప్రస్తుతం.. ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇవి మాత్రమే కాదు.. దలైలామా గురించి చెప్పమని అడిగినా.. అడ్డగోలు ఆన్సర్స్ ఇస్తోంది. దలైలామా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానం ఇచ్చింది డీప్ సీక్. కొన్ని శతాబ్దాల కిందటి నుంచే.. టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతోంది. యూఎస్-చైనా రిలేషన్స్ గురించి అడిగితే.. రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరని అడిగితే కూడా.. డీప్ సీక్ చెప్పలేకపోతోంది. ఇంకా తనని అప్ డేట్ చేయలేదని ఆన్సర్ ఇస్తోంది. ఇలా.. కొన్ని కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటేస్తోంది.
భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్.. తమ భూభాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లెయిమ్ చేసింది. అది.. సౌత్ టిబెట్‌లో అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. ఇప్పుడు.. అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ చాట్‌బాట్ డీప్‌సీక్ నిరాకరించింది. దీనికి సంబంధించిన పోస్టులు.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయ్. అయితే.. వరల్డ్ వైడ్‌గా ఉన్న డీప్ సీక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగానా ఈ చాట్ బాట్ వెంటనే సమాధానం ఇచ్చేస్తోంది. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు? ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక.. వైట్ హౌజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు.. రెప్పపాటు వ్యవధిలో టకటకా ఆన్సర్స్ ఇచ్చేస్తోంది డీప్ సీక్. కానీ.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటేస్తోంది. మరీ.. ముఖ్యంగా చైనా విధానాలు, వివాదాలు, సంఘర్షణలని అస్సలు ప్రస్తావించడం లేదు. చైనా విధానాలకు తగ్గట్లుగానే సమాధానాలు ఇస్తోంది. ముఖ్యంగా.. చైనా వ్యతిరేక అంశాల్ని అస్సలు చెప్పడం లేదు డీప్‌సీక్ చాట్‌బాట్.