దేవాదాయశాఖలో ఇంకా వైసీపీ వాసనలు కొనసాగుతన్నాయి … దానికి నిదర్శనం వైసీపీతో అంటకాగిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆలయాలలో సైతం వారికి పెద్ద పీట వేస్తున్నారని అంటున్నారు.. తాజాగా గతంలో తిరుపతి ఆర్డీఓగా పనిచేసిన పెంచల కిషోర్‌కు ఏకంగా ప్రతిష్టాత్మకమైన కాణిపాకం ఆలయ ఈఓగా పోస్టింగ్ ఇచ్చారు.. శ్రీకాళహస్తిలో సైతం వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో చక్రం తిప్పిన అధికారికి అవకాశం ఇచ్చారు.. అదే విధంగా శ్రీశైలం లో సైతం అర్హత లేక పోయినా ఇన్చర్జ్‌గా అవకాశం కల్పించారని అంటున్నారు.. ఆ క్రమంలో కాణిపాకం ఈఓ ఇష్యూ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది
స్వయంభూగా వెలసిన కాణిపాకం ఆలయం గత ఐదు సంవత్సరాల్లో వివాదాలకు కేంద్రమైంది . ఆలయ పునర్మిణం తో పాటు ఈఓలుగా వచ్చిన వారు సైతం పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వైసీపీ పాలనలో ఈఓగా ఉన్న వెంకటేష్ అయితే స్వయంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడే మకాం వేసి మరి తిరిగారు. అతను కాణిపాకం ఆలయంలో కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవాడన్న విమర్శలు ఉన్నాయి.
తాత్కాలిక ఉద్యోగుల నియామకంతో పాటు దాతల సాయంతో ఆలయ పునర్మిణం విషయంలో వెంకటేష్‌తో పాటు అప్పటి ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు కూడా అనేక వివాదాలకు కారణమయ్యాయి ..చివరకు పెద్దిరెడ్డి అనుచరుడు అయితే మూలవిరాట్‌ని విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆఖరికి అర్చకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహింప చేసిన ఘనత కూడా ఆయనదే. ఫేక్ సర్టిఫికేట్ తో ఉన్న వ్యక్తిని ప్రధానార్చకుడిగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు ఆ మాజీ ఈఓ.
ప్రభుత్వం మారిన తర్వాత వెంకటేష్‌ను బదిలీ చేసారు. స్థానికంగా ఉన్న అధికారిణికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి కొంత కాలం నడిపారు. తర్వాత కర్నూలు జిల్లా డీసీగా ఉన్న గురుప్రసాద్‌కు అవకాశం కల్పించారు. గురుప్రసాద్ కాణిపాకం బ్రహోత్సవాలు విజయవంతం చేసారు. దాంతో పాటు పాలన పై దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ మోహన్ తో కలసి ఆలయ మాస్టర్ ప్లాన్ పై దృష్టి సారించారు. అయితే ఇదే సమయంలో ఉన్నట్లుండి వివాదాస్పద అధికారి అయిన తిరుపతి మాజీ అర్డీవో పెంచల కిషోర్‌కు కాణిపాకం ఆలయ ఇవో గా పోస్టింగ్ వేసారు.
పెంచల కిషోర్‌కు కాణిపాకం ఈఓగా పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. గతంలో చిత్తూరు జడ్పీ సీఈఓగా, అర్డీఓ, డీఆర్ఓగా ఎక్కువ కాలం పనిచేసిన పెంచల కిషోర్‌కు కాంగ్రెస్ , వైసీపీ వీర విధేయుడిగా పేరుంది. దీంతో పాటు గత ఎన్నికలలో తిరుపతి ఆర్డీఓగా ఉన్న సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసాడని ఆరోపణలున్నాయి. అతను వైజాగ్ లో పనిచేస్తున్నప్పుడు గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడంలో కీలక పాత్ర వహించాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
Also Read: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. భూములు సొంతం చేసుకునేందుకు చివరి ఛాన్స్
పెంచల కిషోర్ ను ఈఓగా నియమించడంతో తెలుగు తమ్ముళ్లు చిత్తూరు జిల్లాలో నిప్పులు చెరుగుతున్నారు.. నేరుగా మంత్రి లోకేష్‌కు మెసేజ్ లు పెడుతున్నారంట..పెంచల కిషోర్ గతంలో తమను అనేక ఇబ్బందులు పెట్టాడని అతను ఎట్టి పరిస్థితులలోనే జిల్లాలో ఉండకూడదని .. అది కూడా కీలక మైన కాణిపాక వరసిద్ది వినాయకుడి ఆలయ ఈఓగా ఎలా పోస్టింగ్ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.. అసలు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ విచారణలు లేకుండా కీలక ఆలయాలకు వివాదాస్పద అధికారులకు ఏలా పోస్టింగ్ ఇస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.. ఆలయ అభివృద్ది కొనసాగాలని, అందుకు క్లీన్ చిట్ ఉన్న అధికారిని నియమించాలని కోరుతున్నారు .. మొత్తం మీద వినాయకుడి వివాహానికి విఘ్నాలు అన్నట్లు ఐదు నెలలలో కాణిపాకాణికి ముగ్గురు ఈఓలు రావడం చర్చనీయాంశంగా మారింది.