BigTV English

India Vs Pakistan War: పాక్‌లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్

India Vs Pakistan War: పాక్‌లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్

India Vs Pakistan War: పాక్‌లో అంతర్యుద్ధం జరుగుతోందా? ఈ కష్టకాలంలో తమకెంతో ధైర్యాన్నివ్వాల్సిన ప్రధాని కనిపించక పోవడం చూసి ప్రతిపక్షం మండి పడుతోందా? జనం తమ ప్రభుత్వం, సైన్యం పనితీరు చూసి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారా? పాక్ ప్రభుత్వాధినేత సరే, ఆర్మీ చీఫ్ ఎక్కడ? సైన్యంలోనూ తిరుగుబాటు తప్పదా? కొత్త ఆర్మీ చీఫ్ వస్తున్నాడా? దేశానికి భరోసా ఇవ్వాల్సిన పీఎం పత్తా లేక, ముందుండి నడిపించాల్సిన ఆర్మీ చీఫ్‌ అడ్రెస్ లేక.. పాక్ లో అసలేం జరుగుతోంది?


పాక్ ప్రధాని ఓ పిరికి పంద-పాక్ ఎంపీ

ఇదిగో చూశారా పాకిస్థాన్ ఎంపీ ఒకరు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని బుజ్ దిల్.. అంటే పిరికివాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విధం చూశారుగా. సరిగ్గా అదే సమయంలో.. భారత ప్రధాని మోడీ పేరెత్తడానికి కూడా షెహబాజ్ కి ధైర్యం చాలడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారీ ఎంపీ. పాక్ సైన్యం ఈ బలహీన ప్రధాని కారణంగా తీవ్ర నిరాశ చెందిందనీ.. ఈ క్లిష్ట సమయంలో తన సొంత దళాలకే మద్ధతు ఇవ్వలేని ప్రధాని ఒక ప్రధానా? అంటూ ఈ ఎంపీ విచారం వ్యక్తం చేయడం ప్రస్తుతం పాకిస్థాన్ స్థితిగతులకు అద్దం పడుతోంది.


పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?

అసలు పాకిస్థాన్ లో ఏం జరుగుతుందో అర్ధం కాని దుస్థితి. పాక్ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీడం లేదు. ఇక ఈ మధ్య కాలంలోనే NSA చీఫ్ గా ఎంపికైన ఐఎస్ఐ చీఫ్‌ మాలిక్ ఏం చేస్తున్నాడో అర్ధం కాదు. ఇక ప్రధాని చూస్తే పత్తాలేడు. ఎక్కడో ఆయన్ను సేఫ్ బంకర్లో దాచి ఉంచారన్న మాట వినిపిస్తోంది.

ఒక ప్రధాని ఎలాగుండాలి?

ఒక ప్రధాని ఎలాగుండాలి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంపీలందరినీ తన ప్రతినిథులుగా చేసుకుని వారికి దశ- దిశా నిర్దేశం చేయాలి. సరిగ్గా అదే సమయంలో రక్షణ శాఖకి సంబంధించిన అత్యవసర సమావేశాలు నిర్వహించాలి. ఆ పై త్రివిధ దళాధిపతులకు డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక భద్రతా సలహాదారు ఏమై పోయాడు?

సరే ఇవెలాగూ పాక్ లో జరిగే పనులు కావు. అక్కడ యుద్ధమనగానే ఫస్ట్ జరిగే పని ప్రజా ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం. ఆపై సైన్యం ఇటు ప్రభుత్వంతో పాటు రేషన్, పెట్రోల్, కరెంట్ అన్నింటిపై ఆధిపత్యం చెలాయించడం. ఇటు రేషన్ సరుకులు పూర్తిగా సైన్యం కోసం వినియోగించడం, ఆపై పెట్రోలు, కరెంటు సైతం ఆయుధాల తయారీ సరఫరా కోసం వినియోగించడం కోసం.. వాడుతారు. మరి పాక్ ఆర్మీ చీఫ్ అయినా ఈ దిశగా సమావేశాలు నిర్వహించి.. ఆపై తన శ్రేణులకు దిశా నిర్దేశం చేయాల్సిన సైన్యాధ్యక్షుడు ఎక్కడికెళ్లాడు? ఇక భద్రతా సలహాదారు ఏమై పోయాడు? ఎవరికీ అర్ధం కావడం లేదు.

నో ప్లాన్స్-ఓన్లీ ప్రేయర్స్ అంటోన్న మునీర్ వీడియో వైరల్

ఇదిలా ఉంటే ఎప్పటిదో తెలీదు కానీ మునీర్ అసీంకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నో ప్లాన్స్- ఓన్లీ ప్రేయర్స్ అంటూ ఈ వీడియోలో మునీర్ హ్యాండ్సప్ అంటోన్న దృశ్యం కనిపించింది. ఇతడొక సైనికాధికారా? లేక మతాధికారా అర్ధంకాని పరిస్థితి. ఇదే మునీర్ పహెల్గాం దాడికి మూడు రోజుల ముందు చేసిన ఆన్ రికార్డ్ స్టేట్మెంట్.. హిందూ- భారత్ తో పాక్ పౌర యుద్ధం చేయాలని అన్నాడు. ఇప్పుడు చూస్తే ఆయన ప్రతాపం ఈ విధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అల్లాపై ఆధారపడండి అంటూ చేతులెత్తేస్తున్నాడు మునీర్

ప్రణాళికలు లేవు కేవలం ప్రార్ధనలు మాత్రమే. అల్లాపై ఆధారపడండి అంటూ చేతులెత్తేస్తున్నాడు మునీర్. ఈ విషయంలో సైన్యం తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతోంది. బేసిగ్గానే ఇలాంటి పాక్ ఆర్మీ చీఫ్‌ లు.. భారత్ తో కయ్యానికి కాలుదువ్వేదే. ఇదే అదనుగా సైనిక ప్రభుత్వాలను స్థాపించడానికి. ఇపుడా ధైర్యం స్థైర్యం కూడా పాక్ ఆర్మీ చీఫ్ కి లేనట్టు కనిపిస్తోంది.

మునీర్ స్థానంలో సాహిర్ షంషాద్ మీర్జా?

ప్రస్తుతం పాక్ ఆర్మీలో కూడా ముసలం పుట్టినట్టు తెలుస్తోంది. ఒక తిరుగుబాటు తలెత్తినట్టు తెలుస్తోంది. ఒక పక్క పాక్ సుప్రీం కోర్టు మునీర్ కి పూర్తి అధికారాలను ఇస్తున్నాం.. ఆయన ఏమైనా చేయొచ్చన్న సంకేతాలను ఇస్తుంటే.. తన సైన్యాన్ని తాను కంట్రోల్లో పెట్టలేని దుస్థితిలో ఉన్నట్టు సమాచారం. అందుకే మునీర్ స్థానంలో సాహిర్ షంషాద్ మీర్జా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రవూఫ్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ISI

ఒక రకంగా చెబితే పాకిస్థాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం తారా స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి కనీస శక్తి సామర్ధ్యాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇన్నాళ్ల పాటు ఉగ్రవాదానికి తమకూ సంబంధం లేదని చెబుతూ వచ్చిన పాపిష్టి సైన్యం ఇప్పుడు ముసుగు తొలిగించింది. మసూద్ అజర్ సోదరుడు, జైషే మొహమ్మద్ ఆపరేషనల్ చీఫ్‌ రవూఫ్‌ అజర్ అంత్యక్రియలకు హాజరు కావడమే కాకుండా.. అతడి శవపేటికపై పాక్ జాతీయ జెండా కప్పడం చూసి ప్రపంచం నిర్వెరపోయింది. ఈ ఒక్క సీన్ తో అందరి కళ్లు తెరుచుకున్నట్టయ్యింది.

పాక్ పౌక నివాసాలు, సైనిక స్థావరాలు టచ్ చేయలేదన్న భారత్

ఇవన్నీ అలా ఉంచితే పాకిస్థాన్ కి బుర్ర పని చేస్తోందా లేదా అర్ధం కావడం లేదంటున్నారు కొందరు విశ్లేషకులు. భారత్ తాను ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టినపుడు ఇచ్చిన బ్రీఫింగ్ చూస్తే.. ఒక విషయం స్పష్టమవుతుంది. తాము పాక్ పౌరులను కానీ, ఆ దేశ సైనిక స్థావరాలను కానీ కనీసం టచ్ చేయలేదని క్లియర్ కట్ గా చెబితే.. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. అత్యుత్సాహం చూపించింది పాకిస్థాన్ ఆర్మీ.

హఫీజ్ కొడుకు తల్హా సైతం ఖతమైనట్టు సమాచారం

ఇన్నాళ్ల పాటు పాక్ పలికిన బీరాలు ఏమైపోయాయో తెలీదు. మీరు సింధూ జలాలను ఆపేస్తే మేం అణుబాంబుల వర్షం కురిపిస్తామన్న పాక్ మంత్రి ఎక్కడికెళ్లాడో అర్ధం కాదు. గతంలో ఇదే అంశంపై భారత్ కి వార్నింగ్ ఇచ్చిన హఫీజ్ సయీద్ అయితే హతమయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయ్. ఇతడితో పాటు ఇతడి కొడుకు తల్హా సైతం ముజఫరాబాద్ దాడుల్లో ఖతమయ్యాడని అంటున్నారు కొందరు అధికారులు. ఇటు మసూద్ అజర్ సోదరుడితో పాటు బంధవర్గమంతా మృతి చెందడంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నాడతను.

పాక్ రెండు కళ్లు లష్కరే, జైషే ఉగ్ర సంస్థలు

ఇన్నాళ్ల పాటు భారత్ తో కయ్యానికి కాలు దువ్విన పాక్ రెండు కళ్లు.. లష్కరే, జైషే అనే ఈ ఉగ్ర సంస్థలే. ప్రస్తుతం ఈ సంస్థల తల- కాళ్లూ- చేతులు- కొట్టినంత పని. దీంతో ఇటు టెర్రర్ సపోర్ట్ కూడా లేక పోవడంతో వార్ హర్రర్ ఫేస్ చేస్తోంది పాకిస్థాన్. వీటన్నిటికీ తోడు బలూచిస్తాన్ గొడవ మరోపక్క. ఇండియన్ నావీ.. కరాచీ పోర్టు లాక్ చేసి మరీ కట్టడి చేయడం ఇంకోపక్క. దీంతో బెంబేలెత్తిన పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని గజిబిజి గందరగోళం. ఇదే పరిస్థితి కొనసాగితే.. పాక్ షట్టర్ క్లోజయినట్టే? అన్న మాట వినిపిస్తోంది.

భారత్ తో పొరబాటున పెట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగినట్టే..

పాక్ ఇంటా బయటా, ఇరుగు పొరుగు ఎటు నుంచి ఎటు చూసినా అంతా సమస్యాత్మకమే. ఇటు ప్రజా ప్రభుత్వం కానీ అటు సైన్యం కానీ భారత్ ను తిప్పటి కొట్టలేక విలవిలలాడుతున్న పరిస్థితి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు బలూచిస్తాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన. దీంతో చైనా మద్ధతు సైతం కోల్పోయే ప్రమాదం. ఇప్పటికే మూడింట రెండు వంతులు ఆక్రమించామని చెబుతోన్న BLA అంతపనీ చేస్తే.. పాక్ అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరినట్టే. భారత్ తో పొరబాటున పెట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగినట్టే..

పాక్ రక్షణ మంత్రి వింత సమాధానాలు

ఈ అష్టదిగ్బంధం నుంచి పాక్ బయట పడే దారేది?భారత్‌ చేస్తున్న దాడులను కవర్‌ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. విదేశాంగ శాఖ మంత్రే కాదు.. రక్షణమంత్రి కూడా వింత వింత సమాధానాలు చెబుతున్నారు. మనకు దేవుడే దిక్కంటూ.. ఎంపీలు ఏడుస్తున్న పార్లమెంట్‌లో.. మంత్రి చెప్పే సంజాయిషీలను విన్న వారు షాకవుతున్నారు. నిన్న పాకిస్తాన్‌లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా.. భారత్‌ డ్రోన్లతో భయంకరమైన దాడులు చేసింది. లాహోర్ ఎయిర్‌ డిఫెన్స్‌ను ధ్వంసం చేసింది.

నిద్ర పోయారని.. పారిపోయారనీ పాక్ ఆర్మీపై సెటైర్లు

భారత్ డ్రోన్లను పాక్ ఎందుకు అడ్డుకోలేక పోయిందంటూ.. జనం నుంచి సూటిప్రశ్నలు దూసుకొచ్చాయి. నిద్రపోతున్నారని కొందరు, పారిపోయారని మరికొందరు సొంత ఆర్మీపై సెటైర్లు వేశారు. ఈ సమయంలో పార్లమెంట్‌లో పాక్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్‌ కీలక ప్రకటన చేశారు. భారత్ దాడులను అడ్డుకోకపోవడం వ్యూహాత్మకం అన్నారాయన. మన డిఫెన్స్ సిస్టం లొకేషన్లు తెలుసుకోవడానికే.. ఇండియా డ్రోన్లు ప్రయోగించిందని చెప్పుకొచ్చారు. డిఫెన్స్ మినిస్టర్ ఆన్సర్ చూసి ప్రతిపక్షాలు షాకయ్యాయి. ప్రపంచమంతా విస్తుపోయింది.

దాడులను అడ్డుకోకపోవడం వ్యూహాత్మకం- పాక్ రక్షణ మంత్రి

ఎక్కడా ఏదీ ఒక క్లారిటీ ఉండటం లేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇక పాక్ సార్వభౌమాధికారినికి ఇబ్బంది ఏర్పడితే తప్పక సాయమందిస్తామని అన్నారు చైనా విదేశాంగ మంత్రి. ఇంత జరుగుతుంటే చైనా నుంచి కనీస రియాక్షన్ లేదు. ఈ విషయం ఐక్యరాజ్య సమితిలోనే తేట తెల్లమై పోయింది. పాక్ కి మద్ధతుగా చైనా ఒక్క మాట కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు. అసలు చైనా ఉద్దేశమే వేరని తెలుస్తోంది. ఇక చైనా ఆయుధాలైనా పని చేస్తున్నాయా అంటే అదీ లేదు. చైనా, తైవాన్ ఆయుధాల సామర్ధ్యం.. భారత సైన్యం ముందు తేలిపోవడం ప్రపంచమంతటా చూసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ 400 తో భారత్ ఎంత ధీటుగా పాక్ డ్రోన్ మిస్సైళ్లను ఎదుర్కుందో తెలుసుకోవచ్చు.

బలూచిస్తాన్ ది మరో అధ్యాయం

పాకిస్థాన్ అంత్యుర్ధం అనే సెకండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ కి బలూచిస్తాన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీది 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. భారత్ నుంచి పాక్ వేరు పడ్డప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రాగానే ఉండేది. అయితే 1948లో సైనిక చర్య ద్వారా బలూచిస్తాన్ ని స్వాధీన పరుచుకుంది పాక్. పాకిస్థాన్ లో 44 శాతం భూభాగం బలూచిస్తాన్ దే. ఆ దేశ జనాభాలో 7 నుంచి 8 శాతం మాత్రమే ఉంటారు బలూచీలు. అయితే ఇక్కడ బంగారం, రాగి వంటి ఎన్నో ఖనిజ వనరులుంటాయి. ఈ వనరులను ఆశించిన చైనా.. ఇక్కడ తిష్ట వేసింది. హైబ్రిడ్ రోడ్లు ఇతర రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్వాదర్ పోర్టు సైతం నిర్మించింది.

పాక్ లోని ఆరు సైనిక స్థావరాలపై BLA బాంబులు

తమ ఖనిజవనరులను అడ్డు పెట్టుకుని పాక్ చైనాతో చేస్తోన్న దందాను అస్సలు ఇష్ట పడ్డం లేదు.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో నిరసనలు వ్యక్తం చేసింది. ఈ రోడ్లన్నిటినీ ధ్వంసం చేసింది. చైనా వారిపై దాడులు చేసింది. దీంతో చైనా కూడా ఈ విషయమై తీవ్ర తలనొప్పులను ఎదుర్కుంటోంది. భారత్ నిర్వహిస్తున్న ఆపరేషన్ సిందూర్ ద్వారా తమ కల సాకారం చేసుకోవాలని చూస్తోంది.. బలూచిస్తాన్. అదే గానీ జరిగితే.. పాక్ అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరినట్టే.

నగరం నుంచి పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన BLA

ఈ దిశగా పావులు కదుపుతోన్న బీఎల్ఏ.. పాక్ కి గట్టి షాకే ఇచ్చింది. కొన్నాళ్లుగా పాక్ ఆర్మీపై బాంబుల వర్షం కురిపిస్తూ చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఆ దేశంలోని ఆరు స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించింది. మరీ ముఖ్యంగా క్వెట్టా నగరంలో పాక్ సైన్యానికి చెందిన ఫ్రంట్ టైర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి తెగబడింది. నగరం నుంచి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టింది. అంతే కాదు బలూచిస్తాన్ లో మూడింట రెండు వంతులు తమ ఆధీనంలోకి వచ్చేసినట్టు ప్రకటించాయి బీఎల్ఏ వర్గాలు. ఒక వైపు ఇండియన్ ఆర్మీ, మరో వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇంకో వైపు ఇమ్రాన్ అనుచరుల కారణంగా పాక్ ప్రభుత్వం గజగజలాడుతోంది.

ఇమ్రాన్ ని విడుదల చేసి పాక్ ని రక్షించాలన్న డిమాండ్లు

బేసిగ్గా ఏదైనా దేశంలో ఒక యుద్ధమంటూ వస్తే.. ఆ దేశంలోని అధికార ప్రతిపక్షాలన్నీ ఏకమై పోతాయి. అందరూ కలసి దేశం కోసమే నిలుస్తారు. పాక్ లో అలాక్కాదు. ప్రస్తుతం ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెడుతున్నారు. తమ అధినేత ఇమ్రాన్ ని జైల్లో పెట్టిన షెహబాజ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. షెహబాజ్ ప్రభుత్వానికి భారత్ చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కునే దమ్మూ ధైర్యం లేదని.. ఇమ్రాన్ ని విడుదల చేసి పాక్ ను రక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వైరల్ పోస్టు కారణంగా పోయిన పాక్ పరువు

యుద్ధం లేనపుడే పాక్ ఆకలి కేకలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ దేశ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు జాస్తుంది. భారత్ దాడుల నేపథ్యంలో.. ఈ దిశగా ఒక ఎక్స్ పోస్టు వైరల్ అవుతోంది. తమ స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైన పరిస్థితులను సరిదిద్దడానికి సాయం చేయాల్సిందిగా అభ్యర్ధించింది. ఈ వైరల్ పోస్టు కారణంగా పాక్ పరువు మరింతగా పోయింది. దీంతో తమ ఎక్స్ అఫిషియల్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని కవర్ చేసే యత్నం చేసింది పాకిస్థాన్.

సమస్యలతో అతలాకుతలం అవుతోన్న పాక్

ప్రస్తుతం పాకిస్థాన్ లోని రాజకీయ, సైనిక, సామాజిక, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు ఎంత మాత్రం సరిగా లేవు. పైపెచ్చు ఇటు సాధారణ పాక్ ప్రజల నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఏర్పడుతోన్న తిరుబాటు వరకూ అంతా సమస్యాత్మకం. సైన్యంలోనూ ముసలం పుట్టిన వైనం కనిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులాంటి స్థితిగతులు ఒక్కసారిగా భగ్గుమంటోన్న పరిస్థితి. మరి ఈ అష్టదిగ్బంధనం నుంచి పాక్ బయటపడేదారేది? అన్న ప్రశ్న వినిపిస్తోంది. పాక్ భూభాగంలో సగమున్న బలూచిస్తాన్ సైతం విడిపోతే.. పాక్ ముక్కలు చెక్కలు కావడం ఖాయమని తెలుస్తోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×