Weightloss Home Tips| బరువు తగ్గడానికి చాలా మంది జిమ్ వెళుతుంటారు. లేదా కఠినంగా ఆహార నియమాలు పాటిస్తుంటారు. కానీ మీకు తెలుసా ఇంట్లో నిత్యం చేసే చిన్న చిన్న పనులతో కూడా బరువు తగ్గవచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఒకవేళ మీకు జిమ్ వెళ్లడానికి టైమ్ లేకపోతే లేదా మీరు కఠినంగా డైట్ పాటించకపోయినా.. మీరు ఇంట్లోనే ఉంటూ శరీరంలోని కెలోరీలు ఖర్చు చేసుకోవచ్చు. దీని కోసం రొటీన్ గా చేసే ఇంటి పనులు చేయాలి. ఆ పనులేంటో, వాటి వల్ల మీరు శరీరాన్ని ఫిట్ గా ఎలా ఉంచుకోగలరో తెలుసుకుందాం.
1. క్లీనింగ్ చేయండి
ఇల్లు క్లీన్ గా ఉంచుకుంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. అయితే ఈ పని చేయడం వల్ల మరో లాభం కూడా ఉంది. అదే శారీరక శ్రమ. ఇంట్లో ఊడవడం, మాపింగ్ చేయడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం.. ఇలాంటి పనులు చేసినా శరీరంలో కెలోరీలు ఖర్చు అవుతాయి.
చెత్త ఊడవడం (స్వీపింగ్) – 30 నిమిషాలపాటు చెత్త ఊడ్చే పని చేస్తే 100 నుంచి 150 కెలోరీలు ఖర్చు అవుతాయి.
నేల మాపింగ్ చేయడం.. 30 నిమిషాల పాటు ఈ పని చేస్తే 150 నుంచి 200 కెలోరీలు ఖర్చు అవుతాయి.
బట్టలు ఉతకడం.. 30 నిమిషాలపాటు చేత్తో బట్టలు ఉతికితే 120 నుంచి 150 కెలోరీలు ఖర్చు అవుతాయి.
2. మెట్లు ఎక్కడం దిగడం
ఏదైనా బిల్డింగ్ లో ఎక్కువ ఫ్లోర్లు ఉంటే లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం దిగడం.. శరీరానికి ఒక మంచి వ్యాయమం. ఇలా చేస్తే మీ లోయర్ బాడీ అంటే కాళ్లు, నడుము, తొడ భాగాలకు మంచి వ్యాయమం గా ఉంటుంది. పైగా గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మెట్లు ఎక్కడం, దిగడం చేస్తే 200 నుంచి 300 కెలోరీలు ఖర్చు అవుతాయి. నిత్యం ఇలా చేస్తే మంచి శారీరక శ్రమగా ఉపయోగపడుతుంది.
3. గార్డెనింగ్
మీ ఇంట్లో ఒకవేళ చిన్న గార్డెన్ లేదా ఇంటి టెర్రెస్ పై మొక్కలు పెంచుతూ ఉంటే.. గార్డెనింగ్ కూడా బరువు తగ్గడానికి ఒక మంచి వ్యాయామంగా ఉపకరిస్తుంది. మొక్కలకు నీరు పోయడం, ఇంటి తోటలో వ్యర్థ మొక్కలు తొలగించడం, మొక్కల కుండలు మార్చడం, మొక్కలు నాటడానికి మట్ట త్రోవడం శరీరానికి శ్రమగా మారుతుంది. 30 నిమిషాల పాటు రోజు గార్డెనింగ్ చేస్తే 150 నుంచి 200 కెలోరీలు ఖర్చు అవుతాయి.
4. వంట చేయడం
వంట చేసే సమయంలో కూడా శారీరక శ్రమ కలుగుతుంది. కూరగాయలు తరగడం, రోటీల కోసం పిండి కలపడం, వంట పాత్రలు కడగడం కూడా ఒక మంచి వ్యాయామం. వంట , చేసే సమయంలో కేవలం నిలబడి ఉంటే చాలు శరీరంలో కెలోరీలు ఖర్చు అవుతాయి. అలాగే నిమిషాల పాటు వంట చేసేందుకు శరీరానికి కలిగే శ్రమ వల్ల 80 నుంచి 120 కెలోరీలు ఖర్చు అవుతాయి.
Also Read: ఏఐ వచ్చేస్తోంది.. ఈ రంగాల్లో ఉద్యోగాలుండవు.. ఫివర్ కంపెనీ సీఈఓ హెచ్చరిక
5. పిల్లలతో ఆడుకోవడం
ఇంట్లో చిన్న పిల్లలుంటే వారితో సరదాగా ఆడుకోవడం వల్ల కూడా శరీరంలో కెలోరీలు ఖర్చు అవుతాయి. పిల్లలతో పాటు పరుగులు తీయడం, దాగుడు మూతలు ఆడుకోవడం, వారితో డాన్స్ చేయడం. ఇలాంటివి చేస్తే గంటకు 200 నుంచి 300 కెలోరీలు ఖర్చు అవుతాయి.
6. మాట్లాడే సమయంలో నడస్తూ ఉండడం
ఈ కాలంలో అందరూ ఎక్కువ సేపు ఫోన్ లోనే మాట్లాడుతుంటారు. అయితే కూర్చొని మాట్లాడడం కంటే నడుస్తూ మాట్లాడడం చాలా ఉత్తమం. దీని వ్లల వాకింగ్ ఎక్సర్‌సైక అవుతుంది. శరీరంలో ఎక్స్‌ట్రా కెలోరీలు ఖర్చు అవుతాయి. 30 నిమిషాల పాటు నడిస్తే చాలు 100 నుంచి 150 కెలోరీలు ఖర్చు అవుతాయి.