E-Paper
Advertisement

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!
Advertisement

ఇల్లు కాలి వరి రైతుడేస్తుంటే.. తన రాజకీయాలు తను చేసుకుంటున్నది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఎల్‌నినో కరువొస్తే ఏంటీ? ఎవరెటు పోతే నాకేంటీ? అన్నట్టుగానే ఉంది కేటీఆర్‌ తీరు. ఇవాళ ఆయన ప్రెస్‌మీట్‌లో వరి రైతుకు సర్కార్‌ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు పంపిందని ఓ జిరాక్స్‌ ప్రతిని చూపెట్టాడు. ఇది అవాస్తవం.

రైతులను వరి వేసుకోకుండా అడ్డుకుంటున్నారని, ఒకవేళ వేసుకుంటే దానికి రైతులే బాధ్యత వహించాలని ఆ డిక్లరేషన్‌ పత్రం మీద సంతకం పెట్టి వరి విత్తనాలు తీసుకోవాలని సర్కార్‌ చెబుతుందన్నాడు కేటీఆర్. సర్కార్‌ ఎక్కడా ఇలా చేయలేదు. ఈ సర్కారే కాదు… ఇప్పటి వరకు ఎంత కరువు పరిస్థితులు వచ్చినా.. ఏ సీఎం కూడా ఇలాంటి ఆదేశాలు ఎక్కడా ఇవ్వలేదు.

Advertisement

కానీ ఇలాంటి విపత్తు పరిస్థితుల నేపథ్యంలో కూడా రొటీన్‌ బట్టకాల్చి మీదేసే రాజకీయాలకే మొగ్గు చూపుతున్నారు కానీ.. వరి రైతు గోసను పట్టించుకునేలా లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలను సర్కార్‌ విడుదల చేయలేదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. విత్తన డీలర్లు కొందరు సృష్టించి సోషల్ మీడియాలో తిప్పడం, దాన్ని సర్కార్‌కు ఆపాదించడంతో ఈ వివాదం రచ్చ రచ్చైంది.

ఇలా గాలివాటంగా వచ్చిన వార్తలను కూడా ప్రామాణికంగా తీసుకుని.. తన ప్రెస్‌మీట్‌లోనే వాటిని పదే పదే చూపుతూ సర్కార్‌ను కావాలనే బద్నాం చేస్తున్నారనే విషయం అర్థమైపోతున్నది. ఇలా ఎవరైనా డీలర్లు చెబితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సర్కార్‌ చెబుతోంది. ఎల్‌నినో తీవ్ర కరువు నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండటమే మేలని హితబోధ చేస్తోంది సర్కార్‌.

Advertisement

ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా నష్టం ఉండదని, పెట్టుబడి నష్టం వాటిల్లకుండా లాభసాటి దిగుబడి ఉంటుందని అవగాహన పరుస్తూ వస్తోంది. ఓ వైపు వరిరైతును చైతన్యం చేసే దిశగా సర్కార్‌ వడివడిగా చర్యలు తీసుకుంటుంటే.. చలిమంటలు కాచుకుంటున్నట్టుగా బీఆరెస్‌ వైఖరి ఉందనే విమర్శలు వస్తున్నాయి.

ఎంత ఎక్కువగా వరి సాగైతే అంత మంచిదనే విధానం ఈ పార్టీలో ఉన్నట్టుంది. దీని ద్వారా సాగుకు నీరందక, అవి ఎండిపోతే సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతుందనే పొలిటికల్ యాంగిలే తప్ప.. వరి రైతు చితికిపోయినా పర్వాలేదనే దోరణి గులాబీ పార్టీలో కనిపిస్తోంది. కేటీఆర్‌ స్వయంగా పలు వేదికల మీదుగా.. ‘మేం చెబితే విన్నారా? కాంగ్రెస్‌కు ఓటేశారు..? ఇప్పుడు చూడండి.. చిలుకకు చెప్పినట్టు కేసీఆర్ చెప్పిండు.. అయినా మీరు ఆశపడ్డారు.. మాయలో పడ్డారు..!’ అంటూ ప్రజాతీర్పును కించపరిచేలాగే మాట్లాడుతూ వస్తున్నాడు.

ఇప్పుడు కరువు పరిస్థితులను కూడా వదలడం లేదనిపిస్తోంది. తన బీఆరెస్‌ సోషల్‌ మీడియాలో గిరికీలు తింపుతున్న సర్కార్‌ వ్యతిరేక కట్టుకథల ఫోటోలు, రైతుల గోసలంటూ పెట్టిన ఫోటోలనే ప్రెస్‌మీట్‌లో చూపుతూ.. రైతుల్లో సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత పెంచేలా కేటీఆర్‌ రాజకీయాలుంటున్నాయి.

ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మున్ముందు వరి రైతు పేర రాజకీయం పరాకాష్టకు చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

Tags

Related News

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

Big Stories

Advertisement
×